పుణ్య భూమి నా దేశం నమో నమామి దన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్నా భాగ్యోదయ దేశం ....నా దేశం
అదిగో చత్రపతి.. ద్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తుంటే మానవతుల మాంగళ్యం మంటా గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృ భూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు... సార్వ భౌముడు...
అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ ఆది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఒరేయ్ తెల్ల కుక్కా నీకు సిస్తెందుకు కట్టాలిరా నారు పోసావా.... నీరు పెట్టావా .... కోత కోసావా .... కుప్పలూడ్చావా.... కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు సిస్తెందుకు కట్టాలి రా... అని పెళ పెళ సంకెళ్లు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు
అధిగదిగో...అధిగదిగ ... ఆకాశం భల్లున తెల్లారే వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రా నా భారత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బత్తిన తెల్లదొరగాడెవ్వడ బ్రతుకు తెరువుకు దేశమొచ్చి భానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా బడుగు జీవులు బగ్గు మంటే.. ఉడుకు నెత్తురు ఉప్పానైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతడి చూడరా అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టి ముట్టి వార ఫిరంగులెక్కిపెట్ ి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం
అజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భారత జాతి కన్నా మరో శివాజీ సాయుద సంగ్రామమే న్యాయామణి స్వతంత్ర్య భారతావని మనశ్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని కొలిచాడు గగనశిఖలాకెగసి కనుమరుగై పోయాడు జోహార్ జోహార్ శుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ శుభాష్ చంద్ర బోస్
గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం సాధించే సమరం లో అమర జ్యోతులై వెలిగే ధృవ తారల కన్నది ఈ దేశం చరితార్ధుల కన్నది నా భారతదేశం నా దేశంThretha Yuganiki Sri Ramudu Dvapara Yuganiki Sri Krishnudu Kali Yuganiki Nandamuri Tharaka Ramudu