మన నిప్పులనక్క(Firefox) ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, ఏకంగా హైటెక్ బస్సులమేద దీని లోగోలను చిత్రిస్తున్నారు. ఇటీవల నేను మా ఊరు ఆత్మకూరు(మంగళగిరి మండలం) నుంచి విజయవాడకు వెళ్తుంటే, N.H-5 మీద ఆగి ఉన్న ఒక హైటెక్ బస్సు మీద మన నిప్పులనక్క(Firefox) లోగోను చిత్రించడం చూసి ఆశర్యపోయాను. సమయానికి చిత్రిద్దామనుకుం ే నా దగ్గర కెమేరా లేకపోయింది. తరువాత కొన్నళ్ల తరువాత వెబ్‌లో ఈ చిత్రాలను చూసాను. నిప్పులనక్క(Firefox) అందరి జీవితాలలో ఎంతగా భాగమైపోయిందో ఈ చిత్రాలు ఒక మచ్చుతునక మాత్రమే. ఇదిగో వెబ్‌లో నాకు దొరికిన ఈ చిత్రాలను చూడండి మీకే అర్థమవుతుంది. బహుశా ఇప్పటికే చాలా మంది వీటిని ప్రత్యక్షంగా వీక్షించి ఉండే ఉంటారు (ముఖ్యంగా బెంగుళూరు హైటెక్ వాసులు). నిప్పులనక్కా అధరహో..