4. నీ పుస్తకాల వల్ల ఎందరో పాడైపోయారు అంటారు, ఎందుకట్లా రాశావు? అని అడిగాను. 'అట్లా అనిపించింది. రాశానూ అన్నారాయన. 'మరి యుప్పుడు యిల్లా ఈశ్వరుడు అంటూ భజన చేస్తున్నావేం?' అన్నాను. 'ఇప్పుడిట్లా అనిపిస్తోందీ అన్నారు. ఇంకా ఏం మాట్లాడానో గుర్తు లేదు. అప్పుడాయన నన్ను దగ్గరకు తీసుకొన్నారు. ఒక స్త్రీ ని పురుషుని వలె ముద్దు పెట్టుకున్నారు. అప్పుడు నేను ఆయనకు మనవరాలిని కాదు, అందమైన ఆడపిల్లని- అని యిప్పుడు అనిపిస్తోంది.No comments on PK భహు భార్యత్వం