Author |
Message |
Naaistam
Bewarse Legend Username: Naaistam
Post Number: 34811 Registered: 07-2005 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, August 24, 2011 - 12:46 am: |
|
Gudivada04:
|
Sachinfan
Bewarse Legend Username: Sachinfan
Post Number: 20716 Registered: 10-2010 Posted From: 66.151.103.8
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, August 23, 2011 - 11:46 pm: |
|
Gudivada04:sasthri garu keka
em keka annai.. gandhiji mahathmudu, jaati pitha ane ee desam lo ne banda boothulu titte vallu kuda vunnaru..allani chusi gandhi chesevi anni tappule ani discourage chesi vunte iyala eeda vunde vallam antaru? gaali puraanam...sollu ki ankitham
|
Pokiriraja
Bewarse Legend Username: Pokiriraja
Post Number: 14331 Registered: 02-2005 Posted From: 125.62.208.59
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, August 23, 2011 - 11:19 pm: |
|
Sastry gaaru pedda Cong. supporter lhe annaayi. Ayyane okka saari Gandhi nee amma naa bhoothullu titadhu.2-3 years back Gandhi gurinchi chaala negative gaa raasadhu. Ithanthi kee pedda gaa ethics levu,andhukke aa paper circulation rasthram motham meedha 10k-20k kooda undadhu.Inkaa mee isthaam. NANADAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU
|
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 11656 Registered: 09-2004 Posted From: 68.147.147.218
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, August 23, 2011 - 8:00 pm: |
|
Ravanabrahma:
cause manchidayithe saripodda, naa istam vachinattu chestha ante etta |
Ravanabrahma
Bewarse Legend Username: Ravanabrahma
Post Number: 16354 Registered: 06-2004 Posted From: 98.151.191.253
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, August 23, 2011 - 7:42 pm: |
|
musalayana ga..thinakunda unte pothadu ga..andukani tiffin chesi untaru le..edaina manchi cause kosame anukuntaga aayana poradedi |
Fanno1
Celebrity Bewarse Username: Fanno1
Post Number: 5625 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, August 23, 2011 - 7:38 pm: |
|
Gudivada04:
aa link lo matter post chesaa anthe. |
Fanno1
Celebrity Bewarse Username: Fanno1
Post Number: 5624 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, August 23, 2011 - 7:38 pm: |
|
ఢిల్లీలోని నీలగిరి రెస్టారెంటుకు 15వ తేది రాత్రి ఓ ఆర్డరు వచ్చింది. రేపు తెల్లవారగానే నాలుగుప్లేట్ల సాంబార్ ఇడ్లి, సాంబార్ వడ, రెండు గ్లాసుల బత్తాయి రసం పార్సిల్ చేసి పంపించాలి - అని! అంత పొద్దునే్న మేము తెరవం. కాబట్టి కుదరదు అన్నారు - హోటల్ వాళ్లు. ఆ ఆర్డరు నిరాహారదీక్షకు కూచోబోయే వి.ఐ.పి.ల కోసమని చెప్పాక సరేసరే అని ఒప్పేసుకున్నారు. ఆ ప్రకారమే చెప్పిన అడ్రసుకు ఠంచనుగా పార్సిల్ పంపించారు. మయూర్ విహార్ - సుప్రీం ఎంక్లేవ్‌లోని 280 నెంబరు ఫ్లాటు ‘పౌరసమాజం’ ఫేమ్ ప్రశాంత్ భూషణ్ అనే అడ్వొకేటుది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియాలు కాక అపరగాంధీ అన్నాహజారే కూడా ఆ సమయాన అక్కడ ఉన్నారు. నలుగురికీ నాలుగు ప్లేట్లు సరిపోయాయి. ఆరగింపులు అయాక ఇక ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరుదామా అనుకుంటూండగానే పోలీసులొచ్చి అన్నాజీని అరెస్టుచేశారని 17వ తేదీన ఢిల్లీ పత్రిక ‘పయొనీర్’ వార్త! మహాత్ముడు మళ్లీ వచ్చాడు; మరో గాంధి ఇండియాను అదరగొట్టేస్తున్నాడు అంటూ విదేశీ పత్రికలు తెగ పొగిడేస్తున్నాయి. అది వింటే మనకు మాలావు గర్వం వేస్తుంది. మంచిదే. ఆ మాత్రం దేశభక్తి ఉండాల్సిందే. కాని చిన్న సవరణ. కొత్త మహాత్ముడు పాత మహాత్ముడికంటే గొప్పవాడు. ఉదాహరణకు - నిరాహారదీక్షను ఇలా కూడా మొదలెట్టవచ్చని పాత గాంధీకి తెలియదు. ఆమాటకొస్తే ఒరిజినల్ మహాత్ముడికి ఇంకా చాలా విషయాలు తెలియవు. జైలుకు పో అంటే ఆయన పోయేవాడు. ఉంచినంతకాలం ఉండేవాడు. విడుదల చెయ్యగానే కిమ్మనక చక్కా వచ్చేవాడు. ఈ కాలపు గాంధీ అలాకాదు. వదిలిపెట్టామన్నంత మాత్రాన ఆయన జైలు వదిలిపోడు. తన కండిషన్లన్నిటికీ ఒప్పుకుంటేనే బయటికి కదిలేది అని హఠం వేసి కూచుంటాడు. అవతలివాళ్లు చచ్చీచెడీ ఒప్పేసుకుని, రాజీ కుదిరినా ఆయన చెప్పుల్లో కాలు పెట్టడు. తరువాయి మకాంకి ఏర్పాట్లుగట్రా పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటానని చెపుతాడు. మనబోటివాళ్లం లాడ్జిలో విడిదిని కారణాంతరాలవల్ల పొడిగించినట్లు, తీహార్ జైలులో బసను తన వీలునుబట్టి ఇష్టానుసారం పొడిగించేస్తాడు. విడుదల ఉత్తర్వు అందాక కూడా జైలును లాడ్జిలా ఖైదీ వాడుకోవచ్చన్న సంగతి ఇప్పటిదాకా మనకు తెలియదు. అసలు గాంధీకి అంతకంటే తెలియదు. కాబట్టి అతడికంటే ఇతడు ఘనుడు. అలాగే- 21 రోజులపాటు నిరశన దీక్షను చేసుకోనిస్తామని ఒక దశలో పోలీసులు చెప్పినా, 14 రోజులు చాలునని అన్నాగారు చివరికి తేల్చారు. మొదట ఆమరణదీక్ష అనుకున్నదాన్ని కాస్తా నిరవధిక నిరాహారదీక్ష అని సమయానుకూలంగా మార్చారు. అది కూడా తన ఆరోగ్యం అనుమతించినంతవరకే - అని షరా పెట్టారు. ఒకసారి ఆమరణ నిరాహారదీక్షను ప్రకటించాక ఇలా కూడా దాన్ని లాగించవచ్చని పాత మహాత్ముడు ఎరుగడు. పధ్నాలుగో రోజునో, అంతకంటే ముందో దీక్షకు గంట కొడతానని చెబితే అది ‘‘నిరవధిక నిరాహార దీక్ష’’ ఎలా అవుతుందన్న డౌటు మనకు రాకూడదు. అలాగే 14 రోజుల్లో దీక్షను చాలిస్తానని ప్రభుత్వానికి మాట ఇచ్చినట్టే ఇచ్చి... తీరా మొదలుపెట్టాక ప్లేటు మార్చి... దారికి రాకుంటే ఆమరణదీక్ష సాగిస్తానని సర్కారుపై శివమెత్తిన గాంధిని చూస్తే అసలు గాంధి గుడ్లు తేలెయ్యవలసిందే. ఓల్డ్ మోడల్ గాంధిగారు జనం మీదపడి, ఒంటిమీదున్న నగానట్రా నిలువుదోపిడి చేసినా, వసూలైన మొత్తాన్ని ఖర్చు పెట్టటంలో మహాజాగ్రత్తగా ఉండేవాడు. సొంతానికో, తన విలాసాలకో సాధారణంగా దమ్మిడీ కూడా వాడేవాడు కాదు. బాపు లాగే అన్నా కూడా ట్రస్టులు పెట్టాడు. వాటికోసం భారీగానే సొమ్ము వసూలు చేశాడు. కాని ఖర్చు విషయంలో పాతాయనకున్న చాదస్తం కొత్తాయనకు లేదు. తానే ప్రజలు, ప్రజలే తాను కాబట్టి తన చేతిలోని ట్రస్టుకోసం ప్రజలిచ్చిన దాన్ని తనకోసం ఖర్చుపెట్టించటంలో తప్పులేదని ఆయన నమ్మకం. 1998లో తన 61వ జన్మదిన వేడుకల నిమిత్తం - తాను నడిపే హింద్ స్వరాజ్ ట్రస్టు నుంచి రెండు లక్షల ఇరవైవేల రూపాయలను నిస్సంకోచంగా ఖర్చుపెట్టించిన నిరాడంబరుడు, నీతిమంతుడు హజారేగారు. అది అవినీతి కిందికే వస్తుందని జస్టిస్ పి.బి.సావంత్ కమిషన్ 2005లో నిర్థారించింది. ఆ సంగతి గుర్తుచేస్తే - దమ్ముంటే కేసు పెట్టమని అన్నాజీ తోకతొక్కిన తాచులా బుస్సున లేస్తాడు. పుట్టినరోజు వైభోగాలకు ట్రస్టు సొమ్మును వాడేసిన మాట నిజమే; కాని పుణెకి చెందిన ఫలానా పరిశ్రమదారు ఆ మొత్తానికి ట్రస్టు పేర తరవాతెప్పుడో చెక్కు ఇచ్చేశాడు. సొమ్ము తిరిగొచ్చింది కాబట్టి అది అవినీతి కాదు అని అన్నాగారు, ‘టీమ్ అన్నా’ సార్లు డబాయిస్తారు. గాంధీవాది గారి జన్మదిన సంబరాలకయిన ఖర్చును ఎవడో పరిశ్రమదారు భరించటమేమిటి? అది మాత్రం అవినీతి కాదా? వాడేసుకున్న సొమ్మును వేరెవరి చేతో వెనక్కి ఇప్పించినంత మాత్రాన అక్రమ వాడకం సక్రమమైపోతుందా - అని మనం అడగకూడదు. ఏది అవినీతి, ఏది కాదు అన్న విషయంలో ‘‘ఇంత చక్కటి’’ అవగాహన, స్పష్టత ఉన్న అన్నా అండ్ కో కంటే - అవినీతిపై పోరాడేందుకు యోగ్యులు ఇంకెవరు? ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకునే పార్లమెంటే సుప్రీం అని ఇన్నాళ్లూ అనుకుంటున్నాం. ఎవరిచేతా ఎన్నుకోబడని కొద్దిమంది వ్యక్తులు ‘‘పౌరసమాజం’’ అని తమకు తాము పేరు పెట్టేసుకుని, జనాన్ని కూడగట్టి ఏమి అడిగితే అది పార్లమెంటు చచ్చినట్టు చేసెయ్యాలని, అసలు పార్లమెంటుకంటే వీళ్లు క్లెయిము చేసే జనతా పార్లమెంటు గొప్పదని ఇప్పుడు అన్నా బళ్లో నేర్చుకున్నాం. మనమెంచుకున్న ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన మూడు వ్యవస్థల నెత్తిన ఎవరికీ బాధ్యత వహించని, ప్రజల ప్రమేయం బొత్తిగాలేని లోక్‌పాల్ అనే నడమంత్రపు నాలుగో వ్యవస్థను నిరంకుశంగా తెచ్చిపెట్టటమే ప్రజాస్వామ్యమనీ... ఏ చట్టం కింద ఎవరిమీద ఏ నేరాన్నయినా దర్యాప్తు చేసే పోలీసు పవర్లను, ఎవరినైనా ప్రాసిక్యూట్ చేసే ప్రాసిక్యూషన్ పవర్లను, ఎవరినైనా శిక్షించే జడిషియల్ పవర్లను రాశిపోసి లోక్‌పాల్ అనే సూపర్‌మాన్ చేతిలో పెడితేగానీ రాజ్యాంగ న్యాయానికి న్యాయం జరగదనీ... కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి పిలక, ఎంపీల జుట్టు పట్టుకుంటే చాలు రాష్ట్ర, జిల్లా, గ్రామస్థాయిలో అవినీతి మర్రి ఊడలు ఆటొమెటిగ్గా ఊడిపోతాయనీ- ఇప్పుడు గ్రహించాం. ధన్యులమయ్యాం. |
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 11655 Registered: 09-2004 Posted From: 68.147.147.218
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, August 23, 2011 - 7:29 pm: |
|
http://www.andhrabhoomi.net/weakpoint/weak-point-390 sasthri garu keka |