Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 5833 Registered: 03-2004 Posted From: 152.14.61.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, October 17, 2011 - 10:32 pm: |
|
Settlers ki ippudu telugu lo inko peru pettaru. ninna election lo vote veyyaledani settlers illa mundu dharnalu chesaranta. కోటగిరి, వర్ని సెటిలర్ క్యాంపుల్లో సైతం తెలంగాణ ఆంధ్రులు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపారు. వర్ని మండల కేంద్రంలో 76వ నంబర్ పోలింగ్‌బూత్‌లో టీఆర్‌ఎస్‌కు 257 ఓట్లు మాత్రమే పోలవ్వగా, కాంగ్రెస్‌కు మాత్రం 621 ఓట్లు వచ్చాయి. ఇక్కడే ఉన్న మరో బూత్‌లో టీఆర్‌ఎస్‌కు 186, కాంగ్రెస్‌కు 494 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి బోధన్‌లో నిర్వహించిన తెలంగాణ ఆంధ్రుల ఆత్మీయ సమ్మేళనంలో సెటిలర్లు టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తామని ప్రమాణాలు చేశారు. ఈ ఓటుబ్యాంకుపై భరోసా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌కు రెండు మండలాల్లో ఆశాభంగం అయింది. బాన్సువాడ, బీర్కూరు, పొతంగల్ తదితర ప్రాంతాల్లో మైనార్టీలు ప్రభావితమైన సంఖ్యలో ఉన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీతో జతకట్టబోతోందన్న కాంగ్రెస్ ప్రచారం కూడా మైనార్టీ ఓటర్లను గందరగోళ పరిచాయి. ఈ మూడు కుయుక్తులతో కాంగ్రెస్ రాజకీయ లబ్ధిని సొంతం చేసుకుంది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత ప్రచారం కోసం పల్లెల్లో తిరగడమే కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్న కాంగ్రెస్ కుట్రలు, కుతంవూతాలు, టీడీపీతో అనైతిక బంధాన్ని పెంచుకోవడం వల్ల 33,356 ఓట్లను సొంతం చేసుకోగలిగింది. దీనికితోడు మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ నాలుగు మండలాల్లో నెరిపిన ఓట్లకొనుగోలు, పచ్చనోట్లను కుప్పలుతెప్పలుగా పంచిపెట్టడం, మద్యాన్ని ఏరులైపారించడం వంటి చర్యలవల్ల కాంగ్రెస్ కొన ఊపిరినుంచి తేరుకున్నట్లయింది. |