Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2012 * KCR < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Durga
Celebrity Bewarse
Username: Durga

Post Number: 30547
Registered: 03-2004
Posted From: 207.70.143.185

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, January 20, 2012 - 4:12 pm:    Edit Post Delete Post View Post/Check IP


Fanno1:

Sonia Gulam nabi anatam ento adi ghulam nabi vacchi KCR to cheppatam ento.. maree...




picha na..MOVIEART--ali.lol
*TARAKA*
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6132
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, January 20, 2012 - 3:50 pm:    Edit Post Delete Post View Post/Check IP

Jananni VP lani cheyyatam lo veedi tarvthe evarina. statement " Telangana ki sambhandinchi JAC ne supreme ani Sonia kooda andanta. జేఏసీ అంటే దేశం మొత్తం మీద చాలా గౌరవం ఉంది. తెలంగాణకు సంబంధించినంత వరకు సీఎం కన్నా జేఏసీ సుప్రీం అని గులాం నబీ ఆజాద్‌తో సోనియాగాంధీయే అన్నరట’

Sonia Gulam nabi anatam ento adi ghulam nabi vacchi KCR to cheppatam ento.. maree...


జేఏసీ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు
ఎవరో, ఏదో అంటే ఆగమెందుకు?
తెలంగాణలో సీఎం కన్నా జేఏసీయే సుప్రీం
ఆజాద్‌తో సోనియానే అన్నరట
{పత్యర్థిని గురి చూసి కొట్టాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘తెలంగాణకు సంబంధించినంత వరకు సీఎం కన్నా జేఏసీయే సుప్రీం. ఎవరో, ఏదో మాట్లాడితే ఆగమాగం కావొద్దు. నేతలెవరూ అడ్డగోలుగా మాట్లాడొద్దు. పర్యటనలను అడ్డుకొమ్మని కొందరు జేఏసీ నాయకులే చెప్తున్నరు. ఆంధ్ర నాయకులు పర్యటిస్తే అడ్డుకొమ్మని ఎలా చెప్తరు? దీనివల్ల సమస్యలు వస్తయి. మనమేందీ? మన విశ్వసనీయత ఏంది? జేఏసీ నేతలు పక్కా వ్యూహంతో మాట్లాడాలె. జేఏసీ అంటే దేశం మొత్తం మీద చాలా గౌరవం ఉంది. తెలంగాణకు సంబంధించినంత వరకు సీఎం కన్నా జేఏసీ సుప్రీం అని గులాం నబీ ఆజాద్‌తో సోనియాగాంధీయే అన్నరట’ అని జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. ఇందులో నిర్దిష్టంగా ప్రతిపాదనలు చేయకపోవడంపై కేసీఆర్ పెదవి విరిచినట్టు తెలిసింది.

విస్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉద్యమంలో ఎప్పుడే వ్యూహంతో ఉండాలనే దానిపై ఉద్యమ నాయకత్వం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ‘ఎవరో, ఏదో అంటున్నారని మనం ఉరుకొద్దు. సమయం, సందర్భం, మన బలం, ప్రత్యర్థి స్థితి ఇవన్నీ చూసుకుని ముందడుగు వేయాలి. సరైన దిశానిర్దేశం చేసి గురి చూసి కొట్టాలి’ అని సూచించినట్టు సమాచారం. ఏప్రిల్ వరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉద్యమాలు చేయాలన్నారు. జేఏసీ కార్యక్రమాలు 10 జిల్లాల్లోనూ ఉండాలన్నారు. మార్చిలో పరీక్షల సమయంలో భావవ్యాప్తి జరగాలని ఈ బాధ్యతను తెలంగాణ విద్యావంతుల వేదిక చూడాలన్నారు.

జేఏసీలోని న్యూ డెమొక్రసీ, బీజేపీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, అన్ని సంఘాలు కూడా కష్టపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమంతో పాటు స్థానిక సమస్యలపైనా స్పందించాల్సిన అవసరముందన్నారు. సింగరేణి, టీచర్లు రాలేదని, వారితోనూ ఉద్యమ కార్యాచరణపై చర్చించాలన్నారు. అయితే ఉద్యమ రూపాలు, సమయంపైనా సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. ఇప్పుడే ఉద్యమాన్ని తీవ్ర రూపాల వైపు మళ్లించాలని కొందరు సూచించగా, క్రమంగా కాక పుట్టించాలని మరికొందరు సూచించినట్టు తెలిసింది.

విద్యార్థులకు నష్టం లేకుండా కార్యాచరణ
లోతైన చర్చకోసం సమావేశం నేటికి వాయిదా: కోదండరాం
విద్యార్థులకు నష్టం లేకుండా ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని జేఏసీ నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు సహా బీజేపీ, న్యూ డెమొక్రసీ, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా, డివిజన్, మండల స్థాయి జేఏసీల నుంచి ఉద్యమ రూపాలపై ప్రతిపాదనలు వచ్చాయని, వాటిపై చర్చ అవసరమన్నారు. దీనికోసం సమావేశాన్ని రెండు రోజులకు పొడిగించామని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం కోసం కొట్లాడితే మంత్రివర్గంలోనూ న్యాయం, వాటా దక్కేదన్నారు. పీఆర్పీ ఎమ్మెల్యేలు కొట్లాడి మంత్రి పదవులను సాధించుకుంటే మనోళ్లు మాత్రం అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.

బీఈడీ, డీఎస్సీ వంటి వడపోతలు ఇప్పటికే ఉన్నాయని, కొత్తగా టెట్ అవసరం లేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామాలకు నోటిఫికేషన్లు వెలువరించడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని, సమ్మె విరమణ సందర్భంగా ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, న్యూడెమొక్రసీ నేతలు గోవర్దన్, సూర్యం, ఉద్యోగం సంఘాల నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ పాల్గొన్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration