Ravanabrahma
Mudiripoyina Bewarse Username: Ravanabrahma
Post Number: 19482 Registered: 06-2004 Posted From: 99.67.73.204
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 28, 2012 - 7:39 am: |
|
పదే పదే ఎన్నికలతో అసహ్యమేస్తోంది! వదిలేద్దామా అని అప్పుడప్పుడు అనిపిస్తోంది బస్తాల కొద్దీ డబ్బులు పెట్టుకుని ఎన్నికలు తెస్తున్నారు ఉప ఎన్నికలపై చంద్రబాబు వ్యాఖ్యలు హైదరాబాద్, మార్చి 27 : "రాష్ట్రంలో ఒకదాని వెంట ఒకటి పదే పదే ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. వీటిని చూసిచూసి అసహ్యం వేస్తోంది. తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్నా డీఎంకే కొంతకాలంపాటు ఉప ఎన్నికల్లో పోటీచేయకుండా వదిలివేసింది. అలాగే వదిలేద్దామా అని మాకూ అప్పుడప్పుడూ అనిపిస్తోంది. కానీ దుష్టశక్తులకు అవకాశమిచ్చినవారమ�� �ుతామని పోటీచేయాల్సి వస్తోంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతున్నప్ప�� �డు ఉప ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. "2010లో తెలంగాణలో పది ఉప ఎన్నికలు వచ్చాయి. తర్వాత కడపలో రెండు ఉప ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ తెలంగాణలో బాన్స్‌వాడ ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళీ ఇటీవల ఏడు ఉప ఎన్నికలు వచ్చాయి. అవి అలా అయ్యాయో లేదో ఇప్పుడు మళ్ళీ ఒక లోక్‌సభ , మరో 18 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు ఎదురు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని ఉప ఎన్నికలు ఎప్పుడూ లేవు'' అన్నారు. బస్తాలకొద్దీ డబ్బులు పెట్టుకున్నవారే తరచు ఈ ఎన్నికలను తీసుకువస్తున్నార�� �ి ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీకి వనరులకు కొరత ఉండదని, ఆ సమయంలో దోచుకుని దాచుకున్న వారికీ ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. ఆ పని చేయలేని తమలాంటి వారికే అసలు సమస్య అన్నారు. ఎన్నికల్లో టీడీపీ కూడా డబ్బులు పంచుతోందని ఆరోపణలు చేస్తున్నారని, పంచడానికి తమకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎవరైనా ఇస్తారా అని ప్రశ్నించారు. "ఈ ఎన్నికలు చూస్తే బిజినెస్‌మెన్ సినిమా గుర్తుకు వస్తోంది. అందులో ఒకాయన కడపలో గెలవడానికి రూ. 250 కోట్లు ఖర్చు పెట్టానని, ఈ లెక్కన దేశంలోని 545 సీట్లలో గెలవడానికి ఎంత డబ్బు కావాలని అడుగుతాడు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థిితికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. విచ్చలవిడిగా పెరిగిపోతున్న డబ్బు ఖర్చును ఎవరూ ఆపలేకపోతున్నారు. వారితో పోటీపడి పంచడానికి మా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? ఇక మీ జేబులు కొట్టాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న విమర్శ రాకుండా రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళపాటు పాలించామని, అందుకే ఇంకా నిలదొక్కుకోగలిగా�� �ని ఆయన అన్నారు. ఎవరి విలువలు ఏమిటో బహిరంగంగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఎవరైనా రావచ్చునని ఆయన సవాల్ విసిరారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఎవరూ డబ్బు పంచకపోతే సంతోషిస్తామన్నార�� �. అంతేకాక డబ్బులు పంచవద్దని పిలుపు కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నా పరిధిలో లేదు రాష్ట్ర విభజన తన పరిధిలో లేని అంశమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రం కలిసి ఉంటుందా లేక విడిపోతుందా అన్న ప్రశ్నకు.. అది తన పరిధిలో లేదని చెప్పారు. |