Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2012 * Kanche iylayya < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6321
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 12, 2012 - 9:26 pm:    Edit Post Delete Post View Post/Check IP

T Suicides meeda article rasadanta kada. DC lo link vunte pettandi. ivvala kommineni lo vacchina news


తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాజకీయ నేతలు ఆత్మహత్యలు వద్దని చెబుతూనే అమాయకులను రెచ్చగొట్టేరీతిలో మాట్లాడుతున్నారు. ఆత్మహత్యలపై వారు ఎక్కువ ప్రచారం చేస్తుండడం బాదాకరంగా ఉంటుంది. అయితే తెలంగాణకు చెందిన ప్రముఖ మేధావి కంచ ఐలయ్య కొద్ది రోజుల క్రితం డక్కన్ క్రానికల్ కు రాసిన వ్యాసంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి అందరిని ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. తెలంగాణకోసం 750మంది ఆత్మహత్యలు చేసుకున్నారని సంఖ్యపై జరుగుతున్న ప్రచారంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.ఈ ఆత్మహత్యల విషయమై సామాజికపరంగా, మనస్తత్వ శాస్త్రం ప్రకారం పరిశీలన జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులన్నిటిపైన లోతైన పరిశీలన జరగాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఒక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు జరిగిన సందర్భం లేదని ఆయన అన్నారు.అయితే ఆత్మహత్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, అసలు ఏ అవకాశం లేక అంధకారంలో కూరుకుని పోయినవారే ఆత్మహత్యలకు పాల్పడతారని ఆయన విశ్లేషించారు.అది కూడా వ్యక్తిగత కారణాలు, లేదా గత్యంతరం లేని భావోద్రేక కారణాలతో ఆత్మహత్యలు జరుగుతుంటాయని ఆయన తెలిపారు.మానవ మనస్తత్వం ప్రకారం ఏ వ్యక్తి అయినా తాను ఆత్మహత్య చేసుకోవడమా? ఎదుటి వ్యక్తిని చంపడమా?అన్న దశకు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని చంపే పరిస్థితికే వెళతారు తప్ప ఆత్మహత్య చేసుకోరని ఆయన అన్నారు.ప్రత్యేక తెలంగాణ వంటి అంశం అంతమంది ఆత్మహత్యకు అవసరమైన భావోద్రేక పరిస్థితిని సృష్టిస్తుందా?ఇదసలు మానవుడి తత్వమేనా?అని ఆయన ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆయా దేశాల అనుభవాన్ని ఉదహరించారు. వందల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గి స్వాతంత్రం కోసం పోరాటాలు జరిపిన అనేక దేశాలలో స్వేచ్ఛ కోసం ఆత్మహత్య చేసుకోలేదని ఐలయ్య చెబుతున్నారు.అయితే అనేక మంది ప్రముఖులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి కాని వారెవ్వరూ జాతీయ కారణాల కోసం , ప్రజల సామూహిక కారణాల కోసమో ఆ పని చేయలేదని చెప్పారు. "ఆంటోని, క్లియోపాట్ర వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.ప్రఖ్యాత సైకాలజిస్టు సిగ్మండ్ ఫ్రాయిడ్ తన కాన్సర్ బాధను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.కాని ప్రపంచంలో ఎక్కడా రాజకీయ స్వేచ్ఛ కోసం వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోలేదు.పైగా ఇక్కడ చనిపోతున్నవారిలో ఎక్కువ మంది అణగారిన వర్గాల వారే.చైనాలో ఫ్యూడల్ లార్డ్స్ పై వందల సంవత్సరాలు పోరాడారే కాని ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదు.వలసపాలకుల క్రూర దోపిడీకి గురైన ఆఫ్రికా దేశాలలో వారికి వ్యతిరేకంగా పోరాడారే కాని ఎవరూ తమను తాము చంపుకోలేదు.ఆ మాటకు వస్తే తెలంగాణకు కూడా ఎంతో పోరాట చరిత్ర ఉంది. శతాబ్దాల కొద్దీ ఈ ప్రాంత ప్రజలు భూస్వాముల వద్ద వెట్టిచాకిరితో అష్టకష్టాలు పడ్డారు.అయినా పోరాటాలు చేశారే కాని ఆత్మహత్యలు చేసుకోలేదు.కాని తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నట్లు చెబుతున్నది ఎక్కడ చూడజాలనిది. జాతీయ వాదం లేదా ప్రాంతీయవాదం కోసం సాధారణంగా ఆత్మహత్యలు జరిగే అవకాశం తక్కువ. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ దీక్ష పర్వం తర్వాతే ఇది ఆరంభమైంది.ఆయన మేనల్లుడు హరీష్ రావు కిరోసిన్ పోసుకుని తానే ఆత్మాహుతికి పాల్పడుతున్నట్లు కనిపించారు. ఆ తర్వాతే ఈ దోరణి మొదలైంది. ఆ మరుసటి రోజే శ్రీకాంతాచారి ఘటన జరిగింది. కాల్చుకోవడం, ఉరి వేసుకోవడం, విషం సేవించడం వంటి వాటి ద్వారా ఆత్మహత్యలు జరిగినట్లు సమాచారం వస్తోంది.ఈ మరణాల కారణాలపై ఏ దర్యాప్తు సంస్థ కూడా దృష్టి పెట్టినట్లు కనబడదు.మన ప్రజాస్వామ్య దేశంలో అనేక రకాల డిమాండ్లు ముందుకు వస్తుంటాయి.కాశ్మీర్ కు ప్రత్యేక దేశం ఇవ్వాలని కొందరు వేర్పాటు వాదులు డిమాండ్ చేస్తున్నారు.అలాగే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉంది.ఐర్లాండ్ ను స్వతంత్ర దేశం చేయాలని వందేళ్లకు పైగా డిమాండ్ ఉంది.కాని ఆ లక్ష్యం కోసం ఆ దేశ ప్రజలు బలిదానాలకు పాల్పడలేదు.ఈ నేపద్యంలో ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యలపై క్షుణ్ణంగా పరిశీలన జరగాలి.ఒక తెలంగాణవాడిగా, ఇక్కడ జరిగిన అనేక ఉద్యమాలతో సంబంధాలు కలిగినవాడిగా ఈ విషయం చెబుతున్నాను. తెలంగాణ రక్తంలో ఎక్కడా ఆత్మహత్యలకు పాల్పడే తత్వం లేదు. ఈ ప్రాంత నిరుపేదలు అనేక పోరాటాలు చేసి చనిపోయారు కాని ఆత్మార్పణలు చేసుకోలేదు. గతంలో జరిగిన రజాకార్ల దమనకాండ సమయంలోకాని, కమ్యూనిస్టు సాయుధ పోరాటంలోకాని, ఆ తర్వాత 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కాని ఇలాంటి అనుభవాలు లేవు.రెండువేల తొమ్మిది నుంచి జరుగుతున్న తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోని ఉద్యమాల ఎదిక్స్ కు వ్యతిరేకంగా జరుగుతోంది.అసలు తెలంగాణ చరిత్రకు భిన్నంగా సాగుతోంది.ఇది సాదారణ మానవ తత్వానికి వ్యతిరేకంగా, జాతి , ప్రాంత స్పూర్తికి విరుద్దంగా ఇవి జరుగుతున్నాయి.ఒక విషయం మర్చిపోకుండి.ఈ ఉద్యమం అంతా డిల్లీ ప్రాయోజిత ఉద్యమం. ఈ అసహజ ఉద్యమంలో కొందరు నేతలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.మరోవైపు సమాజంలోని యువత మరణిస్తోంది.ఇది ఎలా జరుగుతోందో డిల్లీ పరిశోదన జరపాలి.అమాయకులైన యువత ఆత్మహత్యలవైపు ఎందుకు మళ్లుతున్నారో ఏ దెయ్యం పురికొల్పుతోందో జాతి యావత్తు తెలుసుకోవలసిన అవసరం ఉంది.'అని ఐలయ్య తన వ్యాసాన్ని ముగించారు. ఉస్మానియాలో పనిచేసి ప్రస్తుతం ఉర్దూ యూనివర్శిటీలో కొనసాగుతున్నారు. ఈయన లేవనెత్తిన అనేక అంశాలు పరిశీలనార్హమైనవి. ఏది ఏమైనా తెలంగాణ యువత ఎట్టి పరిస్థితిలోను ఆత్మహత్యలు చేసుకోరాదని , అదసలు తెలంగాణ రక్తంలోనే లేదని ఆయన వాదిస్తున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration