Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 48390 Registered: 03-2004 Posted From: 110.76.160.100
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, July 24, 2010 - 5:57 am: |
|
చంద్రబాబు డుమ్మాపై చిరుంజీవి నో కామెంట్ శనివారం, జూలై 24, 2010, 14:11[IST] తిరుపతి: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరు కాకపోవడంపై మాట్లాడడానికి ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి నిరాకరించారు. తన సొంత నియోజకవర్గం తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బాబ్లీపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకతాటిపై నడిచి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ఒక పార్టీ నుంచి ఒక ప్రతినిధిని మాత్రమే అనుమతించాలని తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారమే ముఖ్యమని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపించడంలో కేంద్రం జోక్యం చేసుకోదనడం సరి కాదని ఆయన అన్నారు. మహారాష్ట్రలోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉన్నందున సమస్య పరిష్కారానికి కేంద్రం నడుం బిగించాలని ఆయన అన్నారు. బయ్యారం గనుల లీజును రద్దు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
|