Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 3838 Registered: 03-2004 Posted From: 152.14.58.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 18, 2010 - 7:47 pm: |
|
http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=13353&Categoryid=3&subcati d=7 బస్సులో బాలయ్య! బంజారాహిల్స్, న్యూస్‌లైన్: అత్యాధునిక వైద్య సౌకర్యాలతో బసవతారక క్యాన్సర్ ఆస్పత్రి అత్యున్నత సేవలు అందిస్తోందని సినీనటుడు, ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆస్పత్రి వరకు కొత్తగా ప్రవేశపెట్టిన సిటీ బస్సును శనివారం ఆయన ప్రారంభించారు. దీంతోపాటు ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సైకోజెనెటిక్ యంత్రాన్ని, ఆరోగ్యశ్రీ బిల్లింగ్ కౌంటర్‌ను కూడా బాలయ్య ఆరంభించారు. దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా తమ ఆస్పత్రిలో *16 లక్షల వ్యయంతో ఈ సైకోజెనెటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్టు బాలకృష్ణ తెలిపారు. ఆరోగ్యశ్రీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని... ఇక్కడకు వచ్చేవారిలో 80 శాతం వారేనని చెప్పారు. కొత్త బస్సు స్టేషన్ నుంచి రోజుకు పది ట్రిప్పులు తిరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో ఆర్పీ సింగ్, ఆర్టీసీ రాణిగంజ్-2 డిపో మేనేజర్ బి.పద్మారావు తదితరులు పాల్గొన్నారు. |