Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 1907 Registered: 07-2013 Posted From: 106.51.206.105
Rating: N/A Votes: 0 | Posted on Friday, November 15, 2013 - 6:19 am: | |
వైసీపీ గూటికి మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి గుంటూరు జిల్లా రేపల్లే ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్ లోని లోటస్పాండ్ జగన్ నివాసంలో ఆయన సమక్షంలో మోపిదేవి, ఆయన అనుచర గణంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాన్పిక్ కేసులో ముద్దాయిగా ఉండి బెయిల్పై విడుదల అయిన మోపిదేవి జగన్ పార్టీలో చేరనున్నట్లు గతంలోనే ప్రచారం సాగింది. తాను జైలుకు వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలెవ్వరూ తనకు అండగా నిలబడలేదని, బిసి అయిన తనను కుట్ర పూరితంగా ఈ కేసులో ఇరికించారని తన సన్నిహితవద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ జైలులో ఉన్న సమయంలోనే ఆయన సన్నిహితులతో ఆయన సోదరుడు ప్రత్యేకంగా సమావేశమై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. అనంతరం మోపిదేవి బెయిల్పై విడుదల కావడంతో ఆయన వైఎస్సార్సీపీ పార్టీలోకి వెళ్లారు. I support #NTRdoNotcampaignforTDP trend in twitter.
|