Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 5670
Registered: 04-2009
Posted From: 12.131.245.18

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, July 07, 2015 - 4:15 pm:   

Lingamaneni Sivarama Prasad anta...FB lo

పవన్ కల్యాణ్ గారు మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసినెని శ్రీనివాస్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా లేమికి నిదర్శనం. 264 గ్రామాలను టాటా ట్రస్ట్ వారు దత్తత తీసుకునే విధంగా వారిని ఒప్పించి చంద్రబాబు గారు, మోడి గారి ప్రశంసలు పొందిన మా పార్లిమెంట్ సభ్యుని గురించి మాట్లాడేటప్పుడు
అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకుంటే బాగుండేది. వ్యాపారవేత్తలు రాజకీయాలలోకి రాకూడదు అనే పవన్ గారు పొట్లూరి వరప్రసాద్ గారికి ( ఈయన ప్రముఖ వ్యాపారవేత్త) విజయవాడ పార్లమెంట్ సీట్ ఇవ్వాలని ఎలా పట్టుబట్టారో వివరించాలని నా కొరిక.ఇక వారు చెప్పిన ప్రసాద్ గారికి సీట్ ఇస్తే గత పది సంవట్చ్చరాలుగా అమావాశ్యకు, పౌర్నమి కి వచ్చి ఒక జండా భుజాన వేసుకొని రెండు గంటలు కొండల మీద తిరిగి, ఫోటోలకు ఫోజులిచ్చి, అన్ని చేసేసాము అన్నట్లు ప్రవర్తించిన ప్రజా ప్రతినిధి ఇంకొకరిని చూసినట్లు మాత్రమే ఉండేది.

నాని గారు గత సం!! కాలంలో చేసిన పనులను క్రింద ఇవ్వటం జరిగింది. పవన్ కల్యాణ్ గారు "ఉభయ తెలుగు రాస్త్రాలలో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ది చేసిన ఎమ్ పీ ఎవరైనా ఉన్నరేమో తెలుసుకొని, ఎవరు లేకపోతే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తన విజ్నతను చూపించాలని నా మనవి".

యువకుడు, విద్యావంతుడు, నిత్య చైతన్య స్పూర్తి విజయవాడ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెసినెని శ్రీనివాస్ (నాని) గారు ఈ సంవత్ఛర కాలంలో నియోజకవర్గ అభివృద్ది కోసం చేసిన కృషి, సాధించిన విజయాలు అనితర సాధ్యం.. కానీ ఒక్క సంవత్సర కాలంలో తన నియోజకవర్గం అభివృద్ది నిమిత్తం 21360.02 కోట్లు నిధులను సాధించిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మా ఎం పీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము.
సాధించిన నిధులలో -- విజయవాడ పట్టణం -
కనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్ (ఎన్నికల వాగ్దానం) ---- 320 కోట్లు
ఎస్ డబ్ల్యూ డీ, అండర్గ్రౌండ్ డ్రేనేజ్, తాగు నీటి సౌకర్యం కొరకు --- 460 కోట్లు
మరుగు దొ డ్లు, గృహ నిర్మాణం కొరకు ---- 121 కోట్లు
విజయవాడ ఏర్‌పోర్ట్ అభివృద్ది పరచుటకు ---- 103 కోట్లు
విజయవాడ నగరం, నూతన రాజధాని ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ కొరకు ---- 19700 కోట్లు
( మొత్తం విజయవాడ నగరానికి 20704 కోట్లు)
విజయవాడ-జగదల్పుర్ జాతీయ రహదారి కొరకు ---- ౩౦౦ కోట్లు
నందిగామ మునిస్పాలిటీ ఎస్ డబ్ల్యూ డీ, తాగు నీటి సౌకర్యం కొరకు ---- 172.40 కోట్లు
జగ్గయ్యపేట, తిరువూరు మునిస్పాలిటీ తాగు నీటి సౌకర్యం కోసం
( విడుదల కాబోతున్న నిధులు) ----171.62 కోట్లు
తిరువూరు - రాజవరం రోడ్ కోసం ---- 12 కోట్లు
టాటా ట్రస్ట్ అధినేత గౌరవనీయులు రతన్ టాటా గారిని, టాటా టీమ్ సభ్యులను కెసినెని నాని గారు అనేక పర్యాయములు కలసి చర్చలు జరిపిన ఫలితముగా ఏప్రిల్ 15 న రతన్ టాటా గారు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 264 గ్రామాలను దత్తత తీసుకోవటానికి అంగీకార పత్రం జరిగింది - ఇది విజయవాడ పార్లమెంట్ చరిత్ర లోనే ఒక అపూర్వ ఘట్టం. టాటా ట్రస్ట్ వారు ఈ గ్రామాలలో ప్రస్తుతం నిర్వహిస్తున్న మైక్రో ప్లానింగ్ కార్యక్రమం వలన ఆ ప్రాంతములో 2000 మందికి తాత్కాలిక ఉపాధి లభించుతోంది.
నియోజకవర్గం లోని గ్రామాలలో వెదురు సాగును ప్రమోట్ చేసి రైతు సోదరుల అభివృద్ది సాధించాలనే లక్ష్యంతో కెసినెని నాని గారు తన స్వంత ఖర్చులతో 90 మంది రైతు బృందాన్ని ఇటీవలే ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, గోవా రాస్త్రాలకు పంపటం జరిగింది.
ఇక నిత్యం ప్రజలతో మమేకమయి, ప్రభుత్వ పధకాలను సమర్ధవంతంగా అర్హులకు చేరుస్తూ, అన్ని వర్గాల మన్ననలు పొందుతూ, నియోజకవర్గ సర్వతోముఖాభి వృద్దికి అవిశ్రాంత కృషి చేస్తున్న నిరంతర శ్రామికులు మా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు - యువకులు, డైనమిక్ నాయకులు విజయవాడ మధ్య నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ బొండా ఉమా మహేశ్వర రావు గారు - తొనకిస లాడే చైతన్యం కెసినెని శ్రీనివాస్(నాని) గారు - అనుభవం,ఆవేశం,చైతన్యం కలగలిసిన ఈ త్రిమూర్తుల సారధ్యంలో విజయవాడ అభివృద్ది కి పర్యాయ పదంగా మారాలని ఆకాంక్ష. ఒక్క ఏడాదిలోనే ఇంత అభివృద్ది సాధించిన ఈ టీమ్ పార్లమెంట్ సభ్యుని నాయకత్వంలో మిగిలిన 4 ఏళ్లలో మరెంతో సాధించాలని ఎదురు చూస్తున్నాం. వీరు చేసే కృషి ఫలించాలని, వీరి నాయకత్వంలో విజయవాడ- స్మార్ట్ విజయవాడ గా రూపు దిద్దుకోవాలని నా హృదయ పూర్వక ఆకాంక్ష.
Warrior

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration