Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8312
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Sunday, January 10, 2016 - 7:12 am:   

http://www.kostalife.com/telugu/%E0%B0%AC%E0%B1%86%E0%B0%9C%E0%B0%B5%E0%B0%BE%E0 %B0%A1%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%AD%E0%B0%AF%E0%B0%AE%E0%B1%86%E0%B0%82% E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81/


నదిని ఆనుకొని ఊరు. ఊరు చుట్టూ కొండలు… ఊరి మధ్య నుంచి పారే కాలవలు. పలకరించే పచ్చని చెట్లు. సేదతీరమని సాయంత్రాన్ని ఆహ్వానించే వనాలు. అరిటాకుల్లో వేడివేడిగా వడ్డించే హోటళ్లు. పల్లెటూరి భోళాతనంతో ప్రపంచాన్నే గెలిచే జనాలు. నల్లరేగడిలో సిరులు పండించే శివార్లు. ప్రశాంతతని పలకరించే వాతావరణం… దుర్గమ్మని ఓ పక్క… మరియమ్మని మరోపక్క కలిపే తోరణం. రవి వర్మ గీసిన డివోషనల్ పెయింట్ లా అందంగా ఉంది కదూ ఈ ఊరేదో ! నిజానికి ఇదీ బెజవాడ ! కానీ… లాంగ్ షాట్ లో సైకిల్ ఛేజింగ్ లు చూపించి… ముక్కుసూటితనానికి తలబిరుసు రంగేసి… లేనిపోని గొడవలు ఊరికి చుట్టబెట్టి… కులాన్నో… కాల్ మనీనో కట్టబెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నం చేస్తునేఉంటారు కొందరు. ఇదేం బ్రేకింగ్ న్యూస్ కాదు. నడుస్తున్న చరిత్రే ! ఇలాగే కంటిన్యూ అయితే బెజవాడ నిజంగా ఇంతేనేమో అని నెక్ట్స్ జనరేషన్ అనుకునే డేంజరుంది. విజయాలు అలవాటైపోయి బెజవాడ విజయవాడ అయ్యింది. అలాంటి ఊరి మీద ఊరికే కొందరు కాలక్షేపంగాళ్లు కత్తులు నూరుతున్నారిప్పుడు. భ్రమల్లోంచి బైటేసి… హిస్టరీలో ఓ రౌండేసి వాస్తవాల్ని బైటపెడుతోంది బెజవాడ. ఇది నా హృదయం అంటూ పరుస్తోంది… పలకరిస్తోంది. నిజానికి క్రిష్ణా జిల్లాగానీ బెజవాడ గానీ అందరివాడ. ముందు నుంచీ !
నేనండీ బెజవాడని ! మన గురించి మనం చెప్పుకోకూడదు కానీ మంచిని మించి చెడు చెలరేగిపోవాలనుకున్నప్పుడు మనం కూడా సౌండ్ కాస్త పెంచాలి. ఏరా ఎవడచెప్పాడ్రా అంటూ అడ్డగోలు ప్రచారాల్ని అడ్డంగా దులిపేయొచ్చు. పెద్ద విషయం కాదు. కానీ… కావాల్సింది వాదాలు కాదు. వాస్తవాలు. అందుకే కాస్త ఓపిగ్గా చెప్తున్నా ! వరసబెట్టి వినండి. హారతి కర్పూరం వెలిగించినా, మంట పెట్టారంటూ గగ్గోలు పుట్టించాలనుకునే వాళ్లున్నప్పుడు గట్టిగానే చెప్పాలి. కాల్ మనీ మాటొస్తే బెజవాడ ఇంతేనంటాడొకడు. రజాకార్ల పోరాటంలో తెలంగాణోళ్ల నుంచి ఎక్కువ అద్దెలు పిండుకున్నారంటూ మన మీద చెత్త పలుకులు పలుకుతారింకొకరు. మూన్ మూన్ సేన్ చందమామకి చుట్టం అన్నట్టు ఉంటాయ్ ఇలాంటోళ్ల మాటలు. ఏదో జరిగితే ఇంకేదో ఊహించుకొని… మరేదో రాస్తారు. నిజానికి… రజాకార్ల పోరాటంలో కాదు… అంతకు ముందు నుంచే నైజాంకి ఊతమిచ్చి నిలబెట్టిందే బెజవాడ, క్రిష్ణాజిల్లా ! దుక్కి దున్నడం నేర్పిందెవరు… నిజామాబాద్ పంటలు ఎవరి చలవ ? తండాల్లా ఉన్న తెలంగాణలో అక్షరాలు దిద్దించింది బెజవాడ పంతుళ్లు కాదూ ! బోన్సాయ్ ప్రచారాలతో మహావృక్షం మరుగునపడుతుందా చెప్పండి. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానంతే !
ఎందరికి తెలుసు బెజవాడ…?
బెజవాడంటే ఉత్సాహం. ఉరకసేలే ఉత్సవం. బ్యారేజీ దిగువన ఈతలు కొట్టినట్టు… ప్రపంచాన్ని ఈదడం బెజవాడోళ్లకి క్రిష్ణా జిల్లా వాళ్లకి నీళ్లతోనే ఒంటబడుతుంది.
1960, 70ల వరకూ తెలుగింటి వాకిలి బెజవాడే ! హైద్రాబాద్ కళ్లు తెరవలేదు. విశాఖ కాదు మరే ఊరూ నాతో పోటీ కాదు అప్పటికి ! దక్షిణంపక్క నాది దాదాపు మద్రాస్ రేంజ్. చరిత్ర తిరగేసినా భౌగోళికంగా లెక్కేసినా… తెలుగు జాతికే నగ లాంటి నగరాన్ని ! మరి నా మీద ఎందుకింత పగ ? ఇది వరకంటే ఢోకా లేదు. ఈ మధ్య… ముప్ఫైనలభై ఏళ్లుగా కొందరి అవసరాల కోసం నాకు పరిమితుల కంచె వేశారు. అవకాశాల్ని తుంచేశారు. నిజానికి నా హిస్టరీ వేరు. చరిత్ర అంటే… చెట్టు మీద చింతకాయ్ కాదు. ఎవరుబడితే వాళ్లుకొడితే రాలిపోయేందుకు. శాతవాహనుల టైంలో… అంటూ మరీ లోతులొద్దులే గానీ… వంద నూటపాతికేళ్లలో ఏం జరిగిందో చూద్దాం ! తెలుగునాట స్వతంత్ర పోరాటంలో మొదట అడుగేసిందే నేను. బెజవాడోళ్లకి చొరవ ఎక్కువ. దానికితోడు సాహిత్యం చదివో… పేపర్లు చూసో తెలుగు జాతిని నిద్రలేపింది ఇక్కడి గొంతులే ! మగ్గం నేసినా… సహాయ నిరాకరణ చేసినా, చీరాల పేరాల వరకూ చిందేసినా.. అడుగు పడింది మాత్రం ఇక్కడ నుంచే కదూ ! పింగళి వెంకయ్య జాతి కోసం జాతీయ జెండా ఎగరేసిందే నా నడిబొడ్డున ! ఆంధ్రాబ్యాంకు లాంటి ఆర్థిక పునాదులెన్నో అలవోకగా పడ్డాయ్.
అదొక్కటేనా ! ఏ వాదానికైనా విధానానికైనా ఆయువు పట్టు నేనే ! నేనోపట్టుపడితే తప్ప జనం నోళ్లలో పడకపోయేవి ఉద్యమాలైనా… పోరాటాలైనా ! బతుకంటే ఏంటో చెప్పిన భౌతికవాదాన్ని నేర్పిన గోరా ఎక్కడి వాడు ? ఎర్రజెండా ఎగరేసి కాంగ్రెస్ ని సవాల్ చేసిన కమ్యూనిస్టులు ఎక్కడనుంచొచ్చారు ? కార్ల్ మార్క్స్ రోడ్లు ఊరికే వచ్చాయా ? నండూరి లాంటి దిగ్గజాలు దూలాల్లా జర్నలిజాన్ని నిలబెట్టింది ఇక్కడ. విశ్వనాథ రచనలతో వీధి అరుగులు విలసిల్లిందిక్కడ. ఆటోమొబైల్స్ అద్భుతాలు, వ్యాపారాల్లో ప్రయత్నాలు… అబ్బో చెప్పుకుంటూపోతే విజయవాడ విజయాలు శతకోటి. కాళేశ్వర్రావంటే మార్కెట్టు కాదు సుమా… రాజకీయానికి నడకనేర్పిన అయ్యదేవర వారు. కేఎల్ రావ్, కాకాని వెంకటరత్నాల చరిత్ర రోమాల్ని నిక్కబొడుస్తుంది. బెజవాడ అంటో ఏంటో చూపించి… కుళ్లు ప్రచారాల్ని కుళ్లబొడుస్తుంది. గేట్సు, బఫెట్సు కాదు… ఫిలాంతరఫీ అంటే ఏంటో నా తరఫున ఎప్పుడో చూపించాడు పాతూరి నాగభూషణం. ఇక్కడే తెలియట్లేదూ బెజవాడోళ్లకి సంపాదించడమూ తెలుసు… నలుగుర్నీ ఉద్ధరించడమూ వచ్చని ! ఖండాంతరాళాలకి వినిపించిన బాలమురళీ, బాలాంతరపు లాంటి దిగ్గజాల ధ్వని, వెండి తెరని వెలిగించిన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ ల విశ్వవిఖ్యాత జిలుగులూ… అన్నీ బెజవాడ ఆనవాళ్లే ! సినిమాలు… పుస్తకాలు… కళలు… పోరాటాలు… తెలుగు జాతి ఘనత ఏ రంగంలో తిరగేసినా బెజవాడ పేజీలు కనిపించాల్సిందే ! ఒకటా రెండా… ఇవన్నీ అప్పట్లోనే నేను సెట్ చేసిన ట్రెండు.
నాకు ఇచ్చిన వాళ్లు లేరు… నేను ఇచ్చిన వాళ్లే…
అయినా నా మీద ఎందుకింత ఏడుపు ? నా కడుపుకొట్టి చుట్టుపక్కల వాళ్లు కొట్టుకుపోయిన అవకాశాలెన్నో…! ఆంధ్రకళా పరిషత్తు అంటున్న ఆంధ్రా వర్సిటీ అసలు ఎక్కడిది ? క్రిష్ణ ఒడ్డున బెజవాడలో పెట్టాల్సింది కాదూ ! ప్రపంచ మేథావి కట్టమంచి నాకు మాత్రం చెడే చేశాడెందుకో ! ఆంధ్రావర్సిటీ విశాఖకి తరలించి ఫౌండర్ వైస్ ఛైర్మన్ గా సీఆర్ఆర్ కొట్టిన దెబ్బ నొప్పేంటో ఇప్పటికీ తెలుస్తోంది ! ఆంధ్రా పోరాటానికి ఆయువుపట్టు నేనైతే హక్కు నాదంటూ పరిశ్రమల్నీ తన్నుకుపోయింది విశాఖ. రాజధానిపై కర్నూలు కన్నేస్తే… కేంద్ర సంస్థల్ని హైద్రాబాద్ ఎగరేసుకుపోతే ఏడుపు తప్ప ఏం మిగిలింది నాకు ? కన్నీళ్లు క్రిష్ణలో కలిసిపోయి కనిపించడం లేదు కానీ, నాది భాషకందని ఘోష !
అంతెందుకు గత పాతికేళ్లలో కంపెనీలు, స్టార్ హోటళ్లు, సినిమా, మీడియా… ఇలా హైద్రాబాద్ ని అలంకరించిన ప్రతి నగా… నిజానికి నా ధగధగే ! కాదా ? ఓ సారి పెట్టుబడుల చిట్టా చూడండి…. బెజవాడ బిడ్డల రెక్కల కష్టం లెక్క తీయండి. తెలుస్తుంది. దీనికితోడు… సింగపూర్లూ, సిలికాన్ వేలీలు, ఆస్ట్రేలియా, జర్మనీలు… ప్రతి చోటాకి బిడ్డలు వలసపోతే… ఇంటిపట్టున ఎదురుచూస్తున్న తల్లిలా ఇలా మిగిలిపోయా ! నాలో నేను కుములిపోయా ! బ్రెయిన్ డ్రెయిన్ అంటారే… అలా తెలివి గల వాళ్లంతా ఇంతలా వలసపోయిన మరో ఊరు లేదు తెలుగు గడ్డ మీద. ఇలా బిడ్డలకే కాదు కోహినూర్ లాంటి వజ్రవైఢూర్యాల్నీ ఎన్నో వదులుకున్నా ! చెప్పుకుంటే సిగ్గు చేటు… బందరు రోడ్డును వెడల్పు చేయించుకోడానికే 20 ఏళ్లు పట్టింది. బైపాస్ లేక… ఊళ్లోంచి లారీల పోయే అతి పెద్ద నగరం నేనేనంటే సిగ్గుపోతుంది.
ఇవన్నీ చాలవన్నట్టు, 129 వర్ణాల్ని కడుపులో పెట్టుకున్న నాకు… 27 ఏళ్ల నాటి రెండు కుటుంబ గొడవలతో కులం రంగేయాలనుకుంటారు కొందరు. ఎంత దుర్మార్గం ! నా జాతకంలో ఏడుపు తప్ప ఒడుపు లేదా అనుకుంటున్న టైమ్ లో మళ్లీ రాజధానయ్యా ! ఇప్పుడు మళ్లీ కులమనో, కాల్ మనీ పేరు చెప్పో ముద్రేసి నిద్ర చెడగొట్టాలనుకుంటున్నారు కొందరు. నా సామి రంగా… రాటుతేలిన బెజవాడకి ఇలాంటి కుట్రల నుంచి బైటపడడం తెలవదా చెప్పండి ! ఫైనల్ గా ఒక్క మాట.. ఎవరెన్ని ప్రచారాలు చేసినా ఎంత బురద జల్లాలనుకున్నా… చేతలతో, చేవతో సమాధానం చెప్పే నా బిడ్డల ఖలేజా ముందు ఇలాంటి లేనిపోని లగేజీలు ఎంతో కాలం నిలవవ్.మిగలవ్. నిజానికి నేనంటే, బెజవాడంటే, ఉత్సాహానికి ప్రోత్సాహం, కొత్త దనానికి కొలబద్ద, రేపటిని నిద్రలేపే ఉదయం.
ఈ మాట నేనిప్పుడు చెప్పించాల్సిన పనో … ఒప్పించాల్సిన అవసరమో లేదు. కాకపోతే… ఓ ఊరి మీదో… ఓ ప్రాంతంమ్మీదో అక్కడి జనంమీదో కసి పెంచుకోవడం, సందుదొరికినప్పుడల్లా వివాదాల్ని ఉసి గొల్పాలనుకోవడం మాత్రం సరికాదని చెప్పడానికే ఇదంతా ! బెజవాడంటే… ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కున చేర్చుకునే తత్వం… అడిగి వడ్డించే ఆప్యాయతా చూద్దాం… రోహిణి కార్తె ఎండల్ని కాదు ! కలుపుకొని పోవడానికి నేను అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సిద్ధం. మరి… కలిసిరావడానికి మిగతా వాళ్లు సిద్ధమా ? లేదంటే అదే పాత యుద్ధమా ? తేల్చుకోవాలి. తెలుసుకోవాలని ఆశిస్తూ….
మీ
బెజవాడ

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration