Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7136 Registered: 03-2004 Posted From: 76.122.133.243
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, September 22, 2014 - 6:35 am: |
|
Akhariki Great Andhra vaadu kooda comedy chesthunnadu Sakshi meeda డుసు తొక్కనేల, కాళ్లు కడగనేల అన్నది సామెత. సాక్షి ఛానెల్ కు ఈ సామెత అచ్చంగా సరిపోతుంది. సాక్షి దినపత్రిక విజయం సాధించింది. ఆ విజయం వెనుక ఎందరో జర్నలిస్టుల కృషి వుంది. దినపత్రికలో వైఎస్ కుటుంబ వ్యవహారాల సంగతి ఎలా వున్నా, పలువురు జర్నలిస్టులు పాఠకులకు నచ్చే ఇంటర్వూలు, వ్యాసాలు, ఇణకా ఇంకా చాలా చాలా అందించారు. ముఖ్యంగా సాక్షి ఫ్యామిలీ పేజీలు ఆ పత్రికకు ఓ ఇమేజ్ ను తెచ్చాయి. రానురాను ఆ ఫ్యామిలీ పేజీలపై బోలెడు ప్రయోగాలు చేసి, పాఠకులు విసుగెత్తేలా చేసారు. ఆఖరికి మళ్లీ ఇటీవల కాస్త కుదురుకుని, పాత ఇమేజ్ రావాలంటే సినిమాలే గతి అని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ పేజీలను తెల్లారితే చాలు సినిమా వాటితో నింపి, ఆ విధంగానైనా జనాలకు ఆసక్తి కలిగించాలని చూస్తున్నారు. విషయం ఏదైనా ఆవువ్యాసం దగ్గరకు వెళ్లినట్లు, ఏదైనా సరే సినిమా వాళ్లతోనే నింపడం అన్నది గడచిన ఒకటి రెండు నెలలుగా ఆనవాయితీ గా పెట్టుకున్నారు,. అది ఫాదర్స్ డే అయినా, మదర్స్ డే అయినా, ఫ్రెండ్ షిప్ డే అయినా అన్నింటికి సినిమాయే మంత్రం. పోనీ ఆ విధంగానైనా పోయిన దాన్ని తిరిగి తెచ్చుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాట పడుతోంది సాక్షి ఛానెల్ కూడా. పత్రిక సంగతి ఎలా వున్నా, ఛానెల్ మాత్రం ఎంత మాత్రం క్లిక్ కాలేదన్న సంగతి తెలిసిందే. టాప్ టెన్ లో ఆఖరిన నిల్చుని, ఆ లిస్టులో వున్నాం అన్న సంతృప్తి మాత్రం మిగుల్చుకుంది. వైఎస్ కుటుంబానికి భీకరంగా అంకితమైపోయి, ఛానెల్ అంటే అమ్మో అన్న ఫీలింగ్ ను తెచ్చేసుకుంది,. దాంతో ఇప్పుడు సాక్షి పత్రిక ఫ్యామిలీ సెక్షన్ మాదిరిగా సినిమాల వెంట పడాలని డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది. వీలయినంతవరకు వార్తల నడుమ ఏదో విధంగా సినిమాల వ్యవహారాన్ని చొప్పించాలని చూస్తోంది. అలాగే సినిమా ఫంక్షన్లు లైవ్ ఇవ్వడం అన్నది ప్రారంభించారు. సంతోషం అవార్డుల ఫంక్షన్, మొన్నటికి మొన్న దిక్కులు చూడకు రామయ్య, ఇలా సినిమాల మీద పడ్డారు. సినిమా కాంట్రావర్సీలపై దృష్టి పెట్టారు. శివాజీ, డైరక్టర్ యాది వివాదం, ఇప్పుడు రివ్యూలు, ప్రభావం అంటూ ఓ డిస్కషన్..ఇలా న్యూస్ చానెల్ ను సినిమా చానెల్ గా మార్చి అయినా రేటింగ్ లు తెచ్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అక్కడా మళ్లీ నాణ్యత, చిత్తశుద్ధి అంతంత మాత్రం. ఇప్పుడు రివ్యూలు రాసే వాళ్లను వదిలేసి, వేరే వాళ్లతో డిస్కషన్ పెట్టడం అంటే ఏమనుకోవాలి? అసలు ఇప్పుడు రివ్యూలు ఎవరు రాస్తున్నారు..రాయడం అన్నది ఎన్నడో మరిచిపోయిన వాళ్లు ఎవరు? వివాదాలు ఎక్కడ వస్తున్నాయి? ఎవరితో డిస్కషన్ పెట్టాలి అన్న వాటి దగ్గర మళ్లీ క్వాలిటీకి తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. మరి ఇలా అరకొర ప్రయత్నాలు చేస్తే, అటు న్యూస్ చానెల్ కాకుండా, ఇటు ఎంటర్ టైన్ మెంట్ చానెల్ కాకుండా అయిపోతుందేమో? - |