Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through January 26, 2015 * Pranab.. < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7294
Registered: 03-2004
Posted From: 76.122.133.243

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 20, 2015 - 6:13 am:    Edit Post Delete Post Print Post

neethulu chepthunnadu...AP Reorganization bill ela accept chesaro marhipoinattu vunnadu...appudu ayane kada President...



ర్లమెంట్‌ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంపై అధికార, విపక్షాల తీరుపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీవ్రంగా స్పందించారు. ప్రతీ అంశాన్ని ప్రతిపక్షాలు వివాదం చేసి సభా కార్యక్రమాలను అడ్డుకోవడం, చట్టసభల్లో పద్దతి ప్రకారం చేయాల్సిన సాధారణ చట్టాలకు కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ మార్గం ఎంచుకోవడాన్ని రాష్ట్రపతి తప్పుపట్టారు.

మంగళవారం దేశంలోని వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల విద్యార్ధులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్‌ శీతాకాల సమావేశా తీరును వివరిస్తూ.. అధికార, ప్రతిపక్షాల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చట్టాలను చేయడంలో పార్లమెంట్‌ విఫలమైతే.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని భగ్నం చేసినట్లేనని అన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగకూడదని ప్రణబ్‌ పేర్కొన్నారు.

లోక్‌సభ కార్యాక్రమాలకు ఒక ప్రయోజనం ఉండాలని, సభలో సహకారం, సామరస్యం నెలకొనేలా చూడాలని ప్రణబ్‌ సూచించారు. అధికార పక్షానికి పాలనను సాగించే హక్కు ఉండగా.. విపక్షాలకు పాలనలోని లోపాలను ఎత్తిచూపే హుక్కు ఉండాలని ప్రణబ్‌ అన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేయాల్సిన పార్లమెంట్‌.. సామూహిక ఆందోళనలకు, వీధి నిరసనలకు వేదిక కావోద్దని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేయడం కారణంగా కాలం, డబ్బు వృధా అవడంతో పాటు.. విధానపరమైన పక్రియ కుంటుపడుతుందన్నారు. అధికార, విపక్షాలు ఈ అంశంపై దృష్టిసారించి పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ప్రణబ్‌ సూచించారు.

మరోవైపు అధికార పక్షానికీ చురకలు అంటించారు. సాధారణ చట్టాలకు సైతం ఆర్డినెన్స్‌ మార్గాన్ని ఎంచుకోవడంపై రాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసాధారణ పరిస్థితుల్లో, అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభలో అధికార పక్షానికి మెజారిటీ లేనట్లయితే.. ఉమ్మడి సభ నిర్వహించి చట్టాలు చేసిన రోజులు ఉన్నాయని ప్రణబ్‌ తెలిపారు. పార్లమెంట్‌ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఉమ్మడి సభను నిర్వహించి చట్టాలను చేశారని రాష్ట్రపతి తెలిపారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration