Author |
Message |
Critic
Pilla Bewarse Username: Critic
Post Number: 705 Registered: 03-2004 Posted From: 107.131.43.23
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 15, 2015 - 12:55 pm: |
|
Chala baga cheppadu RK - I have the same feeling. |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 1186 Registered: 08-2014 Posted From: 43.249.216.26
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 15, 2015 - 6:57 am: |
|
bhayya goppa goppa leaders vishayam lo ilaanti sinna sinna vishayaalani thappulu gaa enchadam/thelchadam sahajam...panee paataa lekapothe idhoka vishayam ani RK dheenni scenary seyadam....
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7323 Registered: 03-2004 Posted From: 76.122.133.243
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, February 14, 2015 - 9:31 pm: |
|
Lenevo:
sontha party vallani, officials ni janala mundu kindal chese alavatu vundedi.. I am not sure if he is doing that now or not.. |
Lenevo
Kurra Bewarse Username: Lenevo
Post Number: 1207 Registered: 05-2011 Posted From: 98.255.193.75
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, February 14, 2015 - 9:25 pm: |
|
bokkaleeee, idiki importance ivaledaani idu edupu |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7320 Registered: 03-2004 Posted From: 76.122.133.243
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, February 14, 2015 - 8:21 pm: |
|
on KCR ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విషయానికి వద్దాం! ప్రభుత్వ నిర్వహణలో ఉపకరించడం కోసమని ఆయన పలువురు సలహాదారులను నియమించుకున్నారు. తమ సలహాలు వినేవారులేక వారంతా ప్రస్తుతం గోళ్లు గిల్లుకుంటున్నారు. వాస్తు విషయంలో మాత్రమే ప్రస్తుతానికి కేసీఆర్ సలహాలు స్వీకరిస్తున్నారు. ‘సీతయ్య ఎవరి మాట వినడు’ అన్నట్టుగా కేసీఆర్ ఎవరి మాటా వినరు! ముఖ్యమంత్రిగా ఎనిమిది మాసాలుగా ఆయనను గమనిస్తున్న వారెవ్వరూ ఆయనకు సూచనలు ఇవ్వడానికి ధైర్యం చేయడం లేదు. తనకు కావాలనుకున్నప్పుడు మాత్రం ‘మీరంతా సూచనలు చేయండి. అందరం కలిసి నిర్ణయాలు తీసుకుందాం’ అంటారు. అంతా ఉత్తదే! నిన్నగాక మొన్న ముఖ్య కార్యదర్శులందరినీ పిలిచి భోజనం పెట్టి మరీ గంటలకొద్దీ ఉపన్యాసం ఇచ్చి పంపారు. కుటుంబ సభ్యులైన కేటీఆర్, కవిత మాట ఆయన వింటారని చాలా మంది భావిస్తారుగానీ అందులో కూడా వాస్తవం లేదు. కూతురైనా, కొడుకైనా ఆయన మనస్సు ఎరిగి ప్రవర్తించాలేగానీ ఎదురు చెప్పడానికి ఉండదు. ఆ మధ్య అధికారులతో ఏర్పాటు చేసిన ఒక సమీక్షా సమావేశంలో కేసీఆర్ చెవిలో ఏదో చెప్పటానికి కేటీఆర్ ప్రయత్నించారు. అంతే- ఆగ్రహం చెందిన కేసీఆర్ - ‘రారా నువ్వే ఈ కుర్చీలో కూర్చో. నేనే పోతాను. నువ్వే పాలించు’ అని అందరి ముందు ఈసడించుకున్నారు. తెలంగాణలో రెండు చానెళ్లను నిషేధించడం మంచిది కాదనీ, అందరితో సఖ్యతగా ఉండటం మేలనీ సలహా ఇచ్చిన పాపానికి ఒక పారిశ్రామికవేత్తకు ఎంట్రీ లేకుండాపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడని అందరూ భావిస్తారు. వాస్తవం మాత్రం ఇది! తెలంగాణలో తనకు, తన పార్టీకి తిరుగులేదని కేసీఆర్ భావిస్తారు. అందుకే ఎవరి మాటను ఆయన లెక్కచేయడం లేదు. ఎనిమిది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలోని మొత్తం స్థానాలను గెల్చుకున్న బీజేపీ శాసనసభ ఎన్నికలలో మాత్రం మూడు స్థానాలకే పరిమితమయ్యింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉండవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం! రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. కేసీఆర్‌కు ఈ విషయం తెలియదనుకోవడం పొరపాటు. ఉద్యమ సందర్భంగా ఆయన ఎన్నో గెలుపోటములను చవిచూశారు. అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా మార్పు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కదా! అధికారం అనేది కళ్లు, చెవులను మూసేస్తుంది. వాస్తవాలను చూడటానికి, వినడానికి అంగీకరించనివ్వదు. అందుకే కేసీఆర్ చర్యలే కాకుండా ఆయన వ్యవహారశైలి కూడా ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యింది. తెలంగాణలో ఇప్పుడు బలమైన ప్రతిపక్షం లేదని భ్రమిస్తూ ఉండవచ్చు. ఢిల్లీలో సామాన్యుడిని అందలం ఎక్కించిన ప్రజలు ఇక్కడ మాత్రం అలా చేయరని గ్యారంటీ ఏమిటి? కంటికి కనిపించే నాయకులు కాదు- కనిపించని ప్రజలే నిజమైన ప్రతిపక్షం. ఈ సత్యాన్ని అధికారంలో ఉన్నవారు గ్రహించాలి. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7319 Registered: 03-2004 Posted From: 76.122.133.243
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, February 14, 2015 - 8:19 pm: |
|
As a TDP Sympathizer, i welcome his comments. Hope CBN read his article..... ఎన్టీఆర్ వంటి మహానుభావుడికే ప్రజల చేతిలో పరాభవం తప్పనప్పుడు చంద్రబాబు ఎంత? అందుకే 2004లో ఆయన ఓడిపోయారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అష్టకష్టాలు పడ్డారు. అదృష్టం బాగుండటంతోపాటు ముఖ్యమంత్రిగా పాత ట్రాక్ రికార్డు కూడా ఉపయోగపడి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తాను మారిన మనిషినని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో మళ్లీ కొన్ని పాత వాసనలు పొడచూపుతున్నాయి. పార్టీకి లభించిన విజయాన్ని సమష్టి విజయంగా గుర్తించడానికి ఆయన నిరాకరిస్తున్నారు. తన రెక్కల కష్టం వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చామని భావిస్తున్నారు. మనం అని భావించకుండా ‘నేను’ అని భావిస్తున్నారు. పార్టీ సహచరులు, మంత్రివర్గ సహచరులకు అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ‘దునియాకో సున్నా, దిల్సే కర్నా’ అంటారు. అంటే అందరూ చెప్పేది విని మనస్సుకు నచ్చింది చేయి అని అర్థం. అంతా నాకే తెలుసు అని ఎవరు భ్రమించినా అది అహంకారమే అవుతుంది. ‘నేను’ అన్న భావం నుంచి పక్కకు వచ్చి సమష్టితత్వాన్ని అలవర్చుకుంటే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చంద్రబాబు క్యాబినెట్లోకానీ, తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన వారిలోగానీ అత్యధికులు కొత్తవారే! అంతమాత్రాన వారికి ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటు. రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లాలోని ఒక సభలో మాట్లాడుతూ ‘మా శాసనసభ్యులకంటే ఇంతకుముందు మాట్లాడిన మహిళలే బాగా మాట్లాడారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళలను ప్రోత్సహించడానికి సరదాగా ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చుగానీ, అలాంటి వాటివల్ల ఎమ్మెల్యేలు నొచ్చుకోరా? ఉపన్యాసాలు ఇచ్చేవారంతా నాయకులుకారు. ఆ మాటకొస్తే చంద్రబాబు ఉపన్యాసం మాత్రం ఏమంత ఆకట్టుకునే విధంగా ఉంటుంది? |