Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22676 Registered: 08-2008 Posted From: 220.255.1.131
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 20, 2015 - 2:33 am: |
|
నాయుడు గారు ఆ కథలో వేలుపెట్టనన్నారు! Sakshi | Updated: February 19, 2015 22:24 (IST) ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మరణించారంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. సినిమా రంగంలో దుక్కిపాటి మధుసూదనరావు గారి తరువాత మళ్ళీ రామానాయుడు గారికి ‘నవలా చిత్రాల నిర్మాత’గా చాలా పేరుండేది. పాఠకాదరణ పొందిన నవలలను వెండితెరకెక్కించడానికి రామానాయుడు గారు ఎప్పుడూ ముందుండేవారు. అలా నవలల నుంచి ఆయన సినిమాలుగా తీసినవి చాలానే ఉన్నాయి. అప్పటి ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన మొదలు ఇప్పటి బలభద్రపాత్రుని రమణి లాంటి ఎంతోమంది రచనలు ఆయన ద్వారా వెండితెరకెక్కాయి. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ప్రేమనగర్’ లాంటి పెద్ద కమర్షియల్ హిట్ సైతం నవలే కదా! ఇక, నా నవలల్ని కూడా ఆయన చలనచిత్రాలుగా నిర్మించారు. అందులో ప్రధానంగా అందరికీ గుర్తుండిపోయేవి - ‘జీవనతరంగాలు’, ‘సెక్రటరీ’, ‘అగ్నిపూలు’. సినిమాకు పనికొచ్చే మంచి కథల కోసం వెతికే స్వభావం వల్ల నాయుడు గారికి నవలల మీద, నవలా రచయితల మీద చాలా మర్యాద ఉండేది. నవలలు ఆయన బాగా చదివేవారు. నవలను సినిమాకు ఎంచుకొనేటప్పుడు ఆ కథల గురించి బాగా చర్చించేవారు. మరికొంతమందికి కూడా ఆ నవలలు ఇచ్చి, చదివించేవారు. ఫలానా నవల సినిమాకు ఒదుగుతుందా, లేదా అని జాగ్రత్తగా జడ్జి చేసేవారు. అన్ని చర్చలు చేసి, సదరు నవలను సినిమాకు ఎంచుకున్న తరువాత తెరపైన ఆ నవలకు పూర్తి న్యాయం చేసేవారు. అవసరమైతేనే సినిమాకు తగ్గట్లుగా కథలో కొద్ది మార్పులు చేసేవారు. నా ‘అగ్నిపూలు’కు అలానే కొన్ని మార్పులు చేశారు. అయితే, అప్పటికే ఆ నవలను చదివి, ఆ పాత్రలతో అనుబంధం పెంచుకున్న మహిళా ప్రేక్షకులను సినిమాతోనూ ఒప్పించి, మెప్పించారు. ఆయన తీసిన నా నవలా చిత్రాల్లో నా వరకు నాకు బాగా నచ్చినది - ‘జీవనతరంగాలు’ (1973). అప్పట్లో సీరియల్‌కు అలాంటి పేరు పెట్టడం చర్చనీయాంశమైంది. కానీ, నేను ఆ పేరు మీద పట్టుబట్టాను. తరువాత సినిమాగా తీస్తున్నప్పుడు నాయుడు గారు సాధారణంగా సినిమాలకు పెట్టే పేర్లకు భిన్నంగా ‘జీవన తరంగాలు’ అనే టైటిలే ఉంచారు. ఆ నవలను సినిమాగా తీస్తున్నప్పుడు ఆయన కథలో సినిమా కోసం మార్పులేమీ చేయలేదు. ‘అద్భుతమైన నవల. ఆ కథలో వేలు పెట్టను’ అని చెప్పారు. అలాగే చేశారు. పైగా, ‘జీవన తరంగాలు’ అనే పేరుకు తగ్గట్లే కథలో సందర్భోచితంగా ఒక పాట రాయించి పెట్టారు. ఆత్రేయ గారు రాసిన ‘ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో...’ అనే పాట అప్పుడూ, ఇప్పుడూ ‘ఎవర్‌గ్రీన్’గా నిలిచిపోవడం విశేషం. ఆయన చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. ఏదైనా నవల బాగుందంటే ఆ రచయితతో మాట్లాడి, నిజాయతీగా డబ్బులు చెల్లించి హక్కులు తీసుకొనేవారు. అప్పట్లో నవలలు రాసేవారందరూ తమ నవలల హక్కులను రామానాయుడు గారు తీసుకుంటే బాగుండేదని ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. పాఠకులు ఆదరించిన కథలను సినిమాగా తీయడం వల్ల ప్రేక్షకులను మెప్పించడం సులభమవుతుందని ఆయన నమ్మకం. నా నవల ‘అభిశాపం’ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ నవల హక్కులు కూడా తీసుకున్నారు. ఆ నవలను సినిమాగా తీయాలనుకుంటున్నట్లు ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా! కానీ, ఎందుకనో ఆయన కోరిక నెరవేరలేదు. అలాంటి అభిరుచి గల నిర్మాత ఇప్పుడు భౌతికంగా కనుమరుగవడం నవలాప్రియులకు కూడా బాధాకరం. ఏమైనా, మంచి సినిమాలు అందించిన వ్యక్తిగా, మరీ ముఖ్యంగా నవలా చిత్రాల నిర్మాతగా తెలుగు సినీ రంగంలో ఆయనకు సుస్థిరమైన స్థానం ఉంది. ఆ రకంగా స్త్రీ ప్రేక్షక హృదయాలలో ఆయనకూ, ఆయన నవలా చిత్రాలకూ ప్రత్యేకమైన గుర్తింపు మిగిలింది.సంభాషణ: రెంటాల జయదేవ |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 95322 Registered: 03-2004 Posted From: 185.46.212.75
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 19, 2015 - 9:04 am: |
|
Yemi jaruguthondhi saami Tollywood ki.... varasa pettesaru antha.... |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 41971 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 19, 2015 - 9:01 am: |
|
Papam Chandramohan ki heart attack anta. Be Positive!
|
Bestboy
Kurra Bewarse Username: Bestboy
Post Number: 1162 Registered: 03-2005 Posted From: 75.142.52.156
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 19, 2015 - 2:55 am: |
|
RIP GREAT PERSON.. PRODUCER ante Eeyanalaa undaali ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
|
420
Mudiripoyina Bewarse Username: 420
Post Number: 15216 Registered: 12-2006 Posted From: 82.157.134.169
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 19, 2015 - 1:08 am: |
|
Great man indeed .. RIP |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22670 Registered: 08-2008 Posted From: 220.255.1.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 19, 2015 - 12:51 am: |
|
సెంటిమెంట్ల చిన్నయ్య Sakshi | Updated: February 18, 2015 23:41 (IST) వెండితెర మీదే కాదు... వ్యక్తిగతంగానూ రామానాయుడికి సెంటిమెంట్ ఎక్కువ. అవతలి వారి కష్టాన్ని తన కష్టంగా తీసుకొనే భావోద్వేగ తత్త్వం మొదలు ఏదైనా పని చేసేటప్పుడు ముహూర్తాల కోసం వేచి చూసే నమ్మకాల దాకా అన్నీ ఉన్న పాత తరం పల్లెటూరి పెద్దమనిషి తనం ఆయనది. రామానాయుడి చిత్రమైన అలవాట్లు, నమ్మకాలలో కొన్ని... రామానాయుడు చాలా సెన్సిటివ్. కృత్రిమమైన ప్రవర్తనలు ఎక్కువగా కనిపించే ఈ గ్లామర్ ప్రపంచంలో ఇన్ని దశాబ్దాలుగా ఉంటున్నా, ఆయన గుండెలోని తడి ఇంకిపోలేదు. మనసును బాధించే విషయాలు విన్నా, సంఘటనలు చూసినా ఆయన తట్టుకోలేరు. అప్రయత్నంగానే ఆయనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. రామానాయుడికి సెంటిమెంట్లు ఎక్కువ. నిర్మాతగా మద్రాసులో తొలిరోజులు గడిపిన రామానాయుడికి రాహుకాలాలు, వారాలు, వర్జ్యాల పట్టింపులున్నాయి. రాహుకాలంలో ఆయన కథలు వినరు. కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. అలాగే, మంగళవారాలు ప్రయాణం చేయకపోవడమనేది ఆయనకున్న మరో నమ్మకం. అందుకే, ఏ పని చెయ్యాలన్నా పండితులతో మంచి ముహూర్తం నిర్ణయించుకుంటారు. అలాగని, గాలిలో దీపం పెట్టి, దేవుడా... అంతా నీదే భారమనే తరహా వ్యక్తి కాదాయన. మంచి ముహూర్తంలో పని ప్రారంభించడం వరకే కానీ, ఆ తరువాత కూడా చేసే పని నిజాయతీగా, నిబద్ధతతో చేస్తారు. రామానాయుడికి దైవభక్తి ఎక్కువ. ఆయన ఇంటి ఆరాధ్యదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి. వెంకన్నంటే ఆయనకు అపారమైన గురి. అందుకే, నిర్మాతగా తాను తీసిన ఏ సినిమా అయినా సరే విడుదల కన్నా ముందే రీలు పెట్టెలు తీసుకువెళ్ళి, తిరుమల వెంకన్న దగ్గర పూజలు చేయించడం రామానాయుడి అలవాటు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలంగా ఉన్న 1960ల నాటి నుంచి రిలీజ్ రోజున విజయవాడకు వచ్చి, జనం మధ్య కూర్చొని సినిమా చూడడం, ప్రేక్షకుల నాడి గమనించడం ఆయన చాలా కాలం కొనసాగించిన సెంటిమెంట్. అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రామానాయుడు స్టూడియోస్ కట్టాక, స్టూడియో ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండగానే మొదట్లోనే ఎత్తై గుట్ట మీద దేవుడి గుడి కట్టించారాయన. రోజూ ఉదయం స్టూడియోకు వస్తూనే, ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం చేసుకొన్న తరువాతనే ఆఫీసులోకి అడుగుపెట్టడం ఆయన నిత్యకృత్యం. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోనూ స్టూడియో కట్టాక, రోజూ సాయంత్రం వేళ అక్కడకు కారులో వెళ్ళడం, కాసేపు కాలక్షేపం చేసి, అక్కడ ఖాళీ జాగాలో పండించిన కూరగాయలు వగైరా చూసి రావడం ఆయనకు అలవాటు. అలాగే, ‘నాయుడి గారి హస్తవాసి చాలా మంచిది’ అని సినీ పరిశ్రమలో ఒక నమ్మకం. అలాగే, దర్శకుడు దాసరిది కూడా! అందుకే, ఆయన చేతుల మీదుగా డబ్బు తీసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన తన వద్దకు వచ్చి, శుభాకాంక్షలు చెప్పే సినీ టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికీ వంద రూపాయల నోటు ఇవ్వడం రామానాయుడు అలవాటు. ఆయన చేతి మీదుగా ఏడాది తొలిరోజు డబ్బు తీసుకుంటే, ఆ ఏడాది పొడుగూతా ప్రతి రోజూ సంపాదన ఉంటుందని చాలామంది నమ్మకం. రామానాయుడు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ 2015 జనవరి 1న కూడా ఆ నమ్మకం, అలవాటు అలాగే కొనసాగింది. రెండు గంటల పాటు స్టూడియోకు వచ్చి కూర్చున్న రామానాయుడు ఆ ఆనవాయితీని కొనసాగించారు. - రెంటాల జయదేవ |
Vespa
Pilla Bewarse Username: Vespa
Post Number: 495 Registered: 10-2014 Posted From: 183.82.184.72
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 12:00 pm: |
|
DARREN salute to your Highness Dr.D.Ramanaidu Sir |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 84136 Registered: 07-2004 Posted From: 8.7.228.252
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 11:44 am: |
|
okkokkale andaru vellipothunnaaru TFI lo...sad yaa... |
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 10169 Registered: 09-2011 Posted From: 70.74.196.154
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 11:43 am: |
|
RIP Ignorance is bliss
|
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 84134 Registered: 07-2004 Posted From: 8.7.228.252
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 11:35 am: |
|
|
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 24146 Registered: 10-2010 Posted From: 76.220.127.55
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 10:52 am: |
|
R.I.P Jagamanthati Kutumbham Nadhi
|
Kabutar_gadu
Kurra Bewarse Username: Kabutar_gadu
Post Number: 2179 Registered: 02-2012 Posted From: 183.82.106.109
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 10:13 am: |
|
RIP Entertainment ki address nenu!!!
|
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1760 Registered: 04-2008 Posted From: 117.195.225.186
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 9:37 am: |
|
RIP Ramanaidu gaaru..... |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 41964 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 8:34 am: |
|
Very sad. RIP Mr. Naidu. Be Positive!
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 51910 Registered: 05-2004 Posted From: 68.60.66.223
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 8:28 am: |
|
Rest in peace Daggubati Ramanaidu sir, 78 years lived life to the full,, but too early ilanti vallu undatam industry ki chala avasaram. ippudu pedda dikku lekunda poyindi industry lo, oka main pillar virigipoyindi Dagudumuta Dandakor Audio Review
|
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 27541 Registered: 03-2004 Posted From: 75.73.142.62
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 7:50 am: |
|
RIP sir Naaku okadu edurochinaa vadike risku...nenu okadiki edurellina vadike risku
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 72372 Registered: 03-2004 Posted From: 59.144.58.37
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 6:18 am: |
|
Dodla:
it doesn't depend only on discipline.... My native country: telugu naaDu
|
Edo_okati
Mudiripoyina Bewarse Username: Edo_okati
Post Number: 23078 Registered: 03-2007 Posted From: 47.16.83.93
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 6:17 am: |
|
RIP Sir, Chala manchi ayana. Bapatla MP ni eyana develop chesinattu ga evaru cheyyala, Kani kulapu votes to vodipoyaru, Rajakeeya Sanyasam teesukunnaru. 15 year batting ento vipareetam ga chestandi. PP's what's up
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 72371 Registered: 03-2004 Posted From: 59.144.58.37
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 6:15 am: |
|
RIP Ramanaidu gaaru My native country: telugu naaDu
|
Dodla
Pilla Bewarse Username: Dodla
Post Number: 646 Registered: 08-2012 Posted From: 134.134.139.77
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 6:15 am: |
|
Why all discipline people like ANR, Rama naidu getting cancer? e function ki ayina kala teppistadu Rama naidu garu pata (old) taramu vallandaru velli potunnaru pedda dikku anedi lekunda potundi cine industry ki veellandaru mettu mettu pettukuntu industry ki oka value techaru May his soul rest in peace |
Droid
Pilla Bewarse Username: Droid
Post Number: 267 Registered: 01-2014 Posted From: 24.1.118.125
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 6:12 am: |
|
RIP Monna India vellinappudu chepparu cancer ani |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 139480 Registered: 03-2004 Posted From: 71.170.62.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 6:01 am: |
|
vaarnee...hmm... rest in peace... PD gadu fan of NTodu then PK
|
Pokiriraja
Mudiripoyina Bewarse Username: Pokiriraja
Post Number: 15462 Registered: 02-2005 Posted From: 106.66.146.136
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 5:29 am: |
|
Ramanaidu Sir RIP. We miss you a lot Sir.Fans eppudu vellinaa apyaam gaa mathladhevaaru. NANDAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU.
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 95312 Registered: 03-2004 Posted From: 185.46.212.75
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 5:20 am: |
|
Oh Shit, yeppudu poyadu? RIP.... |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22658 Registered: 08-2008 Posted From: 175.156.93.118
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, February 18, 2015 - 5:05 am: |
|
|