Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8021 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, October 09, 2015 - 9:47 pm: |
|
ఏపీకి చంద్రబాబే పెద్ద ఆకర్షణ.. ఐటీ ప్రముఖుల వ్యాఖ్య విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో అన్ని సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఐటీ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో అందరికీ అందించేందుకు ఉద్దేశించిన ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టు బాహుబలి వంటి భారీప్రాజెక్టు అని ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఈ-ప్రగతి విజన్ డాక్యుమెంట్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా జె.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ-ప్రగతి ప్రాజెక్టుకు సీఎం నిర్మాత కాగా, తాను దర్శకుడినని, విప్రో, సిస్కో తదితర భారీకంపెనీలు ఇందులో కీలకపాత్ర పోషించాయని విశ్లేషించారు. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో అందుబాటులోకి తే వాలని నిర్ణయించగా, సీఎం రెండేళ్లలోనే పూర్తిచేయాలని ఆదేశించారని, ఆ మే రకు దీన్ని 17 సెప్టెంబర్, 2017కు పూర్తిచేస్తామని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ పేరుతో విడుదలచేసిన పుస్తకం పెద్దబైబిల్ లాంటిదని పేర్కొన్నారు. నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని రాషా్ట్రలు ఐటీకి మౌలిక వసతులు, రాయితీలు, భూములు ఇస్తాయని, అయితే చంద్రబాబు వంటి సీఎంలు ఏ రాష్ట్రంలోను లేర ని, ఆయన ఏపీలో ఉన్నారు కాబట్టి ఇక్కడకు ఐటీ కంపెనీలు వస్తాయని పేర్కొన్నారు. దీనిని ఆయన దీవార్ సినిమాతో పోల్చారు.అలాగే ఏపీకి చంద్రబాబు ఉన్నారని, ఆయ న్ను చూస్తే ఐటీ కంపెనీలు ఇక్క డికి వస్తాయని పేర్కొన్నారు. ఐటీని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలు ప్రజలకు సులభతరంగా ఆన్‌లైన్‌లో అందించేందుకు ఈ ప్రగతిని రూపొందిస్తున్నారు. దేశంలోనే కాకుండా ఆగ్నేయ ఆసియా దేశాల్లోనే ఇది మొదటిది. దీనికోసం ఐటీ దిగ్గజాలైన విప్రో, టీసీఎస్, హెచ్‌పీ, సమీర్, సీడాట్ వంటి సంస్థలు 9 నెలలుగా శ్రమిస్తున్నాయి. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా... ఒకటేమిటి మొత్తం 33 ప్రభుత్వ శాఖల పనులు దీనిద్వారా సులభంగా అందుకోవచ్చు. ఈ ప్రాజె క్టును ఆదర్శంగా తీర్చిదిద్ది... దీన్ని ఇతర రాషా్ట్రలకు విక్రయించి..ఆదాయం కూడా సంపాదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం- రూ. 2,398 కోట్లు ప్రభుత్వం పెట్టుబడి రూ.1,528 కోట్లు పూర్తిచేసే సమయం - 2 ఏళ్లు గ్రోత్ మిషన్లు -7 ప్రాజెక్టులు - 72 ప్యాకేజీలు - 14 తరంగాలు (వేవ్స్) - 4 ప్రభుత్వ శాఖలు -33 సేవలందించే ఏజెన్సీలు - 315 అందించే సేవలు - 745 |