Author |
Message |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8179 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 10, 2015 - 6:58 pm: |
|
ప్రస్తుత పీపీఏ వల్ల ప్రజలపై మోయలేని భారం ఈఆర్సీని కోరిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్, ఆంధ్రజ్యోతి: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ప్రజా విచారణ నిర్వహించాలని తెలంగాణ ఈఆర్సీని టీ జేఏసీ చైౖర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రస్తుత ఛత్తీ్‌సగఢ్ విద్యుత్‌కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లోని షరతుల వల్ల తెలంగాణ వినియోగదారులపైనా, ప్రభుత్వంపైనా మోయలేని భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వివిధ సంఘాల నేతలతో కలిసి కోదండరాం మంగళవారం టీ ఈఆర్సీ చైర్మన్‌ను కలిశారు. ఛత్తీ్‌సగఢ్ పీపీఏపై ప్రజా విచారణ నిర్వహిస్తే బహిరంగంగా చర్చ జరిగి మేలు జరుగుతుందంటూ కోదండరాం ఈఆర్సీ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర విద్యుత్చట్టంలోని సెక్షన్ 86(3) ప్రకారం ఈఆర్సీ పారదర్శకంగా బాధ్యతలు నిర్వహించాలని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వినియోగదారులపై ఆర్ధిక భారం పడే నిర్ణయాలకు ముందు ప్రజా విచారణ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈఆర్సీ చైర్మన్‌ను కలిసినవారిలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, అడ్వొకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఎంపీజే అధ్యక్షుడు ఖాజా మోయినుద్దీన్, టీజాక్ సమన్వయకర్త కె.రఘు ఉన్నారు. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 29214 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 10, 2015 - 11:42 am: |
|
Musicfan:
kashtam rao garu..bjp candidate anaamakudu, congi aa rajayya incident tho no confidence at all. they will win but at least tough fight ayithe bagundu, though I highly doubt it Ignorance is bliss
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8178 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 09, 2015 - 9:51 pm: |
|
Musicfan:
they will win...Opposition is very weak... |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 56779 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 09, 2015 - 8:57 pm: |
|
hope these turn to defeating TRS, adi lenanta varaku TRS doesnt care. Brucelee Audio Review
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8175 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 09, 2015 - 8:38 pm: |
|
ప్రచారానికి పోతే జనం నిలదీతలు రైతులు, మహిళల నుంచి నిరసనలు మంత్రులకూ తప్పని చేదు అనుభవాలు ఊహించని పరిణామాలతో పాలుపోని స్థితి విపక్షాల ప్రోత్సాహంతోనే అని అనుమానం మీడియా ముందు ప్రశ్నించకుండా జాగ్రత్తలు వరంగల్‌లో హోరాహోరీగా ప్రచారం హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం అంతా సాఫీగా సాగిపోతుందని భావించిన అధికార టీఆర్ఎస్.. అనూహ్యమైన పరిణామాల మధ్య ఉలికిపాటుకు గురవుతోంది. ఊహించని విధంగా స్థానికులు తిరగబడుతుండటంతో కలవరపడుతోంది. ప్రచారానికి వెళ్లిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను జనం.. ప్రధానంగా రైతులు, మహిళలు వివిధ సమస్యలపై నిలదీస్తుండటాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ను బరిలో దించిన తరుణంలో.. కాంగ్రెస్ తన అభ్యర్థిగా రాజయ్యను దింపడం, ఆ తర్వాత ఆయన కోడలు..ముగ్గురు మనుమళ్ళు చనిపోవడంతో కాంగ్రెస్ కొత్త అభ్యర్థిగా సర్వే సత్యనారాయణను ఎన్నికల గోదాలోకి దించడం తమకు అనుకూలమని గులాబీ దళం తలపోసింది. టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ దేవయ్య ఎన్నారై కావటం వల్ల ఆయన తమకు పోటీనే కాదని అంచనా వేసింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాజాగా బిహార్ ఎన్నికల్లో ఓడిపోవడం వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కి కలిసి వచ్చే అంశమని కూడా భావించింది. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా ప్రచారానికి వెళ్తున్న మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న చేదు అనుభవాలు టీఆర్ఎస్ వర్గాలను బిత్తరపోయేలా చేస్తున్నాయి. 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి సందర్భం ఏదైనా.. టీఆర్ఎస్ నేతలు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరించేవారు. దూకుడును ప్రదర్శించేవారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో చురుగ్గా పాల్గొన్న వివిధ వర్గాలతో వారికి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. అయితే 2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం, తామే అధికారంలోకి రావటం, ప్రభుత్వాన్ని నడుపుతూ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక (మెదక్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక జరిగినప్పటికీ, 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఆ ఎన్నిక జరిగింది) కావటంతో వరంగల్ ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు గతంలో ఎన్నడూలేని విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. అంతేగాకుండా.. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఇతర ముఖ్య నాయకులు చేసిన ప్రకటనల వల్ల వారిపై ప్రజల అంచనాలు విపరీతంగా పెరిగాయి. కానీ 17 నెలల టీఆర్ఎస్ పాలనలో కొత్తగా ఒరిగిందేమీ లేకపోవటంతో, నిలువెత్తు ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకలైన వరంగల్ ప్రజలు ఆగ్రహాన్ని దాచుకోలేకపోతున్నారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం తమ ముంగిట్లోకి వస్తున్న అధికార టీఆర్ఎస్ నేతలను ఎదురుబెదురు లేకుండా సూటిగా నిలదీస్తున్నారు. దీంతో వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సమస్యలకు పరిష్కారం చూపలేక పార్టీ నేతలు నీళ్లు నమలాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ నేతలు సంయమనంతో వ్యవహరించాలని సూచిస్తున్నట్లు తెలిసింది. తొందరపడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. దీంతో తాము ప్రచారానికి వెళ్లిన చోట నిలదీతలు ఎదురుకాకుండా పార్టీ నాయకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి మీడియా ఉన్న చోట జనం తమను ప్రశ్నించకుండా, ఒకవేళ ప్రశ్నించినప్పటికీ, నవ్వుతూ బదులిచ్చేలా ఓపిక తెచ్చుకుంటున్నారు. అయితే తమ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిలదీస్తున్న వారంతా విపక్షాల ప్రోత్సాహంతో ముందుకు వస్తున్న వారేనని కొందరు టీఆర్ఎస్ నేతలు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎక్కువ మంది పార్టీ నాయకులు మాత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటేనే భయమేస్తోందని, ఎవరు? ఎప్పుడు? ఏ రీతిన? నిలదీస్తారో తెలియటం లేదని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఎలాగోలా వరంగల్ ఉప ఎన్నికల ప్రచార గండం గట్టెక్కాలని కోరుకుంటున్నారు. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8174 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 09, 2015 - 8:06 pm: |
|
ki mind dobbindi.. http://www.andhrajyothy.com/Artical?SID=171172 yee chestha lu enti...Raithula meeda case lu enti? ఆదిలాబాద్ మార్కెట్ యార్డుపై దాడి కేసుపై. సర్కారు ‘పోలీసు చర్య’ 9 మంది అన్నదాతల అరెస్టు.. రేపోమాపో మరో 50 మందికి బేడీలు! పత్తికి మద్దతు ధర కోసం ఉద్యమించడమే నేరం ఫుటేజీ ఆధారంగా ఖాకీల వేట జోగు వ్యాఖ్యలపైనా వివాదం ప్రతిపక్షాల ఆందోళన (ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్) మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేశారన్న ఆరోపణలతో రైతులపై బనాయించిన కేసుల వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. రైతులు జీన్స్ ప్యాంట్లు టీషర్టులు వేసుకోరంటూ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. మద్దతు ధర రాని కారణంగా ఆవేదన చెంది మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసిన రైతులపై కేసులు నమోదు చేయవద్దంటూ విపక్షాలు కూడా ఆందోళనలు మొదలు పెట్టాయి. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీపై ఈ నెల 2 న జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీల ఆధారంగా 60 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. వీరిలో నుంచి తొమ్మిది మందిని మొదట అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. కేసుతో సంబంధం ఉన్న మరో 50 మంది కోసం నేడో...రేపో వేట మొదలు పెట్టబోనున్నట్లు సమాచారం. మరోవైపు మార్కెట్ యార్డుపై దాడిచేసినవారు రైతులు కారని, వారంతా మద్యం సేవించి దాడికి పాల్పడ్డారని, రైతులు టీషర్టులు, జీన్స్ ప్యాంట్లు వేసుకోరని మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. అంతేకాక దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి పేర్కొనడం వివాదం మరింత ముదరడానికి కారణమైంది. అయితే కడుపు కాలిన రైతులు ఆగ్రహంతో మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేశారే తప్ప ఇందులో ఎలాంటి కుట్ర లేదని పలు రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కేసులతో ప్రయేయం ఉన్న మిగతా రైతులు పోలీసులు తమను ఎప్పుడు అరెస్టు చేస్తారోనన్న ఆందోళనకు లోనవుతున్నారు. కాగా.. మంత్రి వ్యాఖ్యలను, పోలీసుల వైఖరిని మొదట నుంచి వివిధ ప్రజా సంఘాలు, టీడీపీ, బీజేపీ, సీపీఎం, రైతుకూలీ సంఘాలు విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని అస్త్రంగా మలుచుకుని ప్రభుత్వ తీరును ఎండ గట్టాలన్న భావనతో ఆ పార్టీలన్నీ దీపావళి తర్వాత ఆందోళనలు చేయడానికి నడుం బిగించాయి. సోమవారం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో ఆయా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పత్తి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ ఆందోళన చేపట్టారు. రైతులపై నమోదు చేసిన కేసులు ఇవే... పత్తిపంటకు మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై ఈ నెల 2న దాడి చేసిన రైతులపై పోలీసులు పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 147, 148, 353,448, 427, 506 తదితర సెక్షన్లతోపాటు సెక్షన్ (3)పీడీపీపీ, సెక్షన్ 7క్లాస్ (1), అలాగే ఆర్/డబ్ల్యు 149 ప్రకారం వివిధ రకాల కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన రైతులు వీరే.... మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో అరెస్టయిన తొమ్మిది మందిలో మేడి గూడ గ్రామానికి చెందిన చిట్యాల భూమన్న, గిమ్మె గ్రామానికి చెందిన రంగినేని కిషన్‌రావు, జైనథ్ మండలం కౌట గ్రామానికి చెందిన కోరాట దయాకర్, ఆదిలాబాద్ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన బుడ్డెరవి, తాంసి మండలం గిరిగాం గ్రామానికి చెందిన పోతంశెట్టి శంబులు, జైనథ్ మండలం పూసాయి గ్రామానికి చెందిన బుడ్డె రాజన్న, కనపమేడిగూడ గ్రామానికి చెందిన బోపతి రమణ, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముస్కు లింగారెడ్డి, తలమడుగు గ్రామానికి చెందిన పేదల్వార్ సంతోశ్ ఉన్నారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలేదు. మార్కెట్ కమిటీ అధికారులు, ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కు కావడంతోనే పత్తి రైతుకు మద్దతు ధర లభించడం లేదు. తమకు మద్దతు ధర రావడంలేదన్న ఆక్రోశంతోనే రైతులు మార్కెట్ కమిటీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరి కుట్ర లేదు. అమాయక రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. -రైతు ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ దారట్ల కిష్టు వీడియో ఫుటేజీ ఆధారంగా అరెస్టులు ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం. వీడియో ఫుటేజీల ఆధారంగా దాడిలో పాల్గొన్న మిగిలిన వారిని కూడా రెస్టు చేస్తాం. -ఆదిలాబాద్ డీఎస్పీ ఏ.లక్ష్మీ నారాయణ కేసులుఎత్తివేయండి.. ఆర్డీవోకు టీడీపీ నేతల వినతి రైతులకు మద్దతు ధర రూ.4100 చెల్లించాల్సి ఉండగా రూ.3800 చెల్లించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన టీడీపీ, బీజేపీ నాయకులపై, మార్కెట్ కార్యాలయంపై దాడి చేసిన రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని సోమవారం ఆదిలాబాద్ ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ముందుగా బీజేపీ, టీడీపీ నాయకులు కలెక్టరేట్ వరకు ర్యాలీగా తీశారు. నాయకులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని ఈ సందర్భంగా పలువురు నేతలు డిమాండ్ చేశారు. మంత్రి రామన్న రైతులను అవమానించారు రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో, జిల్లాలో పత్తి రైతులు బాధలో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి తరుణంలో ఆవేదనతో మార్కెట్ కార్యాలయంపై రైతులు దాడి చేశారే తప్పా దీనికి ఎవరి కుట్రలేదు. రైతులు జీన్‌ప్యాంట్స్, టీషర్టులు వేసుకోరంటూ మంత్రి జోగు రామన్న అనడం సరికాదు. అలా అనడం ద్వారా ఆయన రైతులను అవమానించారు. త్వరలో రాష్ట్రంలో మంత్రులను, టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి. - టీడీపీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు రాధోడ్ రమేశ్ కేసులను ఎత్తివేయకుంటే ద్యమిస్తాం కడుపుకాలిన రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేస్తే వారిపై అక్రమంగా కేసులు బనాయించారు. కష్టాల్లో ఉన్న రైతును ఆదుకోవాలే తప్పా కేసులు పెట్టడం సరికాదు. పత్తి రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తాం. - బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాయల్ |
|