Author |
Message |
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1699 Registered: 04-2012 Posted From: 12.130.208.36
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 31, 2016 - 9:04 am: |
|
Lovebewarsetalk:
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99523 Registered: 03-2004 Posted From: 185.46.212.70
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 31, 2016 - 8:32 am: |
|
Sirio .... |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8554 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 31, 2016 - 8:27 am: |
|
sooper!!! |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 146049 Registered: 03-2004 Posted From: 107.77.104.120
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 31, 2016 - 7:52 am: |
|
Super... |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 2998 Registered: 08-2014 Posted From: 14.96.111.37
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 31, 2016 - 7:30 am: |
|
Esperanza:i agree vallu vallu entha closee oo
This reminds me of a gossip that both chiru and balayya do it simultaneously with few popular actresses in 80's and 90's start...one performing cunnilingus and the other subjecting himself to fellatio...
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27036 Registered: 08-2004 Posted From: 88.114.249.112
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 31, 2016 - 7:21 am: |
|
Prasanth:
i agree vallu vallu entha closee oo idoka udaharana space for lease
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77155 Registered: 03-2004 Posted From: 59.144.58.33
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 31, 2016 - 7:19 am: |
|
ee vidhamga vivarinchadam mee fans ku kuda saadhyam kaadhu... chiru telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27034 Registered: 08-2004 Posted From: 88.114.249.112
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 31, 2016 - 7:15 am: |
|
దాదాపు 6 నెలలుగా ఈ తెలుగు లో ప్రచురణ ఆపివేసిన ప్రముఖ దిన పత్రిక "ఇండియా టుడే".ఈ నెలలో నందమూరి బాలకృష్ణ జీవిత విశేషాలతో ఒక ప్రత్యేక సంచిక తో పునః ప్రారంభమైనది.ఈ సంచికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.అందులో బాలకృష్ణ కి సినిమా జీవితానికి సంభందించిన అన్ని ముఖ్య ఘటనలు ప్రస్తావించారు.అంతే కాక బాలకృష్ణ గురించి కొంత మంది ప్రముఖుల అంతరంగాన్ని కూడా ఆవిష్కరించారు.తెలుగునాట యన్టీఆర్, ఏయన్నార్ తర్వాత అత్యధికకాలం పోటాపోటీగా సాగిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ బరిలో పోటీపడే వీరిద్దరూ నిజజీవితంలో మంచిమిత్రులు. బాలకృష్ణ గురించి చిరంజీవి మాటల్లో. మహానటులు నందమూరి తారకరామారావుగారి కుమారుడు కావడం నందమూరి బాలకృష్ణ అదృష్టం. పూర్వజన్మ సుకృతం. సినిమా సృజనాత్మక కళారంగం. అందులో రాణించడానికి కేవలం అదృష్టం, ఘనమైన వారసత్వం దోహదం చేయలేవు. ప్రారంభంలో ఒకట్రెండు చిత్రాలకు ఫ్యామిలీ ట్యాగ్ కొంతమేర ఉపయోగ పడవచ్చునేమోగానీ, వాటివల్ల దశాబ్దాల పాటు ఉన్నతస్థాయిలో ఈ రంగంలో కొనసాగడం అసాధ్యం. అందుకు బాలకృష్ణ పెద్ద ఉదాహరణ.నందమూరి బాలకృష్ణ సినీ రంగప్రవేశం చేసి నాలుగు దశాబ్దాల కాలం దాటింది. నాకు తెలిసి బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఇప్పటికీ కథానాయకుడి పాత్రలే వేస్తున్న వారిలో భారతదేశంలో కమల్ హాసన్ తరువాత బాలకృష్ణ ఒక్కరే కనిపిస్తారు. నిబద్ధత, కరోర పరిశ్రమ, క్రమశిక్షణ వంటి విశిష్ట గుణాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల మెస్మరిజం బాలకృష్ణలో ఉన్నది కనుకనే ఇంకా తెలుగు సినీపరిశ్రమ ఫేవరెట్ హీరోల్లో ఒకరిగా ముందుకు సాగుతున్నారు.ఎనిమిది దశాబ్దాల తెలుగు చిత్రపరిశ్రమ చరిత్రలో ఎందరో మహానుభావులు తమ నటనా చాతుర్యంతో భారత సినీపరిశ్రమలో తెలుగు రంగానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. కథానాయకుల గురించి చెప్పుకోవలసి వస్తే యన్టీఆర్, ఏయన్నార్, వారి తరువాత కృష్ణ శోభన్ బాబు అత్యధిక విజయాలు సాధించిన హీరోలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలచిపోతారు. ఆ నలుగురి తర్వాత నాతో పాటు బాలకృష్ణ నాగార్డున, వెంకటేశ్‌ను ఒక సెట్ గా ప్రేక్షకులు, విమర్శకులు పరిగణించారు. తెలుగు సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక వ్యాపారంగా రూపొందిన దశలో మేము నలుగురం అనేక విజయవంతమైన చిత్రాలను అందించగలిగాం, ఎవరి శైలి వారిదే, ఎవరి మార్కెట్ వారిదే – అన్నట్టు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు. ఆశీర్వదించి మమ్మల్ని ఎంతో ఎత్తుకు పెంచారు. తెలుగు సినిమాలు వసూలు చేసే కలెక్షన్లు అప్పట్లో హిందీ చిత్ర పరిశ్రమను సైతం ఆశ్చర్యపోయేలా చేశాయి. పాత్రల వైవిధ్యం విషయంలో బాలకృష్ణ ఎక్కువ ప్రయోగాలు చేశారు. బాలకృష్ణ జానపదం చేశారు. పౌరాణికం చేశారు. ఒకటో, రెండో సైన్స్ ఫిక్షన్ చిత్రాలు కూడా చేసినట్టు నాకు గుర్తు! సాంఘికం సరేసరి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో విరివిగా సినిమాలు రావడానికి ఒక రకంగా బాలకృష్లే కారణం. సమరసింహారెడ్డి అంతటి ఘనవిజయం సాధించకపోయి ఉంటే, ఆ తరహా చిత్రాలకు అక్కడితోనే పుల్ స్టాప్ పడేదేమో. బాలకృష్ణ సింహాను ఈ మధ్య టీవీలో చూశాను. అటువంటి పాత్రకు బాలకృష్ణ ఒక్కడే సరిపోతాడు అని అనిపించేటట్టు నటించారు. డైలాగ్స్ తో మాస్ ను మెప్పించడం బాలకృష్ణ కే సాధ్యం! బాలకృష్ణ తెలుగు సినీపరిశ్రమలో తనదైన ట్రెండ్ క్రియేట్ చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ కి కుమారుడిగానే కాక, ఆయన నటనావారసత్వాన్ని నిలబెట్టే విధంగా పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించడం విశేషం. బాపు శ్రీరామరాజ్యం లో బాలకృష్ణ చక్కగా ఒదిగిపోయారు. బాలకృష్ణలో నాకు నచ్చే అంశాల్లో తెలుగు భాష, సంస్కృతుల పట్ల అతనికున్న అభిమానం, అనురక్తి, కొన్ని సంస్కృత శ్లోకాలను సైతం అలవోకగా వల్లిస్తూంటారు. బాలకృష్ణ గొప్ప స్నేహశీలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో అందరి మధ్య చక్కటి బంధాలు, అనుబంధాలు ఏర్పడటంలో ఆయన చొరవ ఎంతో ఉంది. మనసులో ఏదీ దాచుకోకుండా గడగడ మాట్లాడేస్తూ, జోక్స్ కట్ చేస్తూ సరదాగా ఉండటం బాలకృష్ణ నైజం. మేము తనని అభిమానంతో "బాల" అని సంబోధిస్తాం. పేరుకు తగ్గట్టుగానే బాలకృష్ణ ది చిన్నపిల్లాడి మనస్తత్వం, అయితే అతనిలో కొన్ని సందర్భాల్లో గొప్ప భావుకుడు, వేదాంతి కూడా కనిపిస్తారు. ఈ మధ్య నా 60వ పుట్టినరోజు వేడుకల్లో బాలకృష్ణ పాల్గొని హుషారుగా డాన్స్ చేసి అందరినీ ఆనందింప చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఏర్పాటు చేయడంలో బాలకృష్ణ కూడా ఎంతో చొరవచూపించారు. నాకు తనలో నచ్చే అంశాలలో తల్లిదండ్రుల పట్ల చూపించే గొప్ప ప్రేమానురాగాలు. తన మాతృమూర్తి పేరిట ఏర్పాటు చేసిన 'బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, ఆ సంస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దు తున్నారు. పేదలైన క్యాన్సర్ పేషెంట్లకు ఆ సంస్థ అందిస్తున్న వైద్యసేవలు వెలలేనివి. అందుకు బాలకృష్ణను ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. అలాగే, తన తండ్రి ఎన్.టి.రామారావుగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ ఏనాడూ.తాను ముఖ్యమంత్రి కుమారుడిననే భావన చూపించేవారు కాదు. అది బాలకృష్ణలోని మరో గొప్ప క్వాలిటీ. హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణ భవిష్యత్తులో మరెన్నో ఉన్నతశిఖరాలు అధిరోహించి, తన అభిమానుల్ని అలరించాలని, తెలుగు సినీకళామతల్లికి గర్వకారణం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సౌజన్యం:ఇండియా టుడే space for lease
|