Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 100021 Registered: 03-2004 Posted From: 194.171.252.110
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, August 24, 2016 - 4:31 am: |
|
సిడ్నీ: భారత నౌకా దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఫ్రెంచ్ డిఫెన్స్ కాంట్రాక్టర్ డీసీఎన్ఎస్ కంపెనీ ద్వారా భారత్ నావికా దళం కోసం ఆరు స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములను తయారు చేస్తుండగా వాటికి సంబంధించిన రహస్య సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. దాదాపు 22,400 పేజీల సమాచారం అక్రమంగా వెల్లడైందని 'ది ఆస్ట్రేలియన్' అనే ఓ ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. ఈ లీక్ కారణంగా ఈ జలాంతర్గాములు పనిచేసే సామర్థ్యం, పనితీరుకు సంబంధించిన పూర్తి రహస్యాలు వెలుగులోకి వచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఈ జలాంతర్గాములు ఎలా నిఘా నిర్వహిస్తాయో, అవి ప్రయాణించే సమయంలో వేగాన్ని బట్టి ఎలాంటి శబ్దం వస్తుందో అనే రహస్యాలు తెలిసిపోయాయట. అంతేకాకుండా ఇవి సముద్రంలో ఎంత తోతువరకు వెళతాయి, వీటి పరిధి, మ్యాగ్నెటిక్, ఎలక్టో, ఇన్ఫ్రారెండ్ సమాచారం కూడా తెలిసిందట. అయితే, అసలు ఈ సమాచారం ఎవరు లీక్ చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు. మరోపక్క, ఈ సమాచారం లీక్ వల్ల మలేషియా, చిలీ దేశాలకు కూడా ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఎందుకంటే ఆ దేశాలు కూడా ఈ తరహా జలాంతర్గాములనే ఉపయోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా కూడా స్కార్పియన్ క్లాస్ సబ్ మెరైన్స్ నే ఉపయోగిస్తోంది. అయితే, తాము వాడేది స్కార్పియన్ జలాంతర్గామే అయినా.. భారత్ తయారుచేయిస్తున్న సబ్ మెరైన్ లాంటిది కాదని, తాము ఉపయోగించేది వేరే మోడల్ అని ఆస్ట్రేలియాకు చెందిన ఓ అధికారి చెప్పారు. మరోపక్క, బ్రెజిల్ కూడా ఈ తరహా వాటిని 2018 నుంచి ఉపయోగించనుంది. ప్రాజెక్ట్ 75 పేరుతో డీసీఎన్ఎస్, భారతదేశానికి చెందిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కలిసి ఈ ఆరు జలాంతర్గాములను నిర్మిస్తుండగా దీనికోసం భారత్ అంచనా వ్యయం 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, ఇందులో తొలి జలాంతర్గామిని ఈ ఏడాది చివర్లో, మిగితా ఐదింటిని 2020 నాటికి భారత నేవీకి అప్పగిస్తారు. లీక్ పై పారికర్ ఏం చెప్పారంటే.. భారత్ తయారుచేయిస్తున్న స్కార్పియన్ సబ్ మెరైన్స్కు సంబంధించిన సమాచారం లీకైందని తన దృష్టికి రాత్రి 12గంటల ప్రాంతంలో వచ్చిందని, అయితే, ఇది హ్యాకింగ్ కేసు అయి ఉండొచ్చని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. అలసు లీకైంది భారత జలాంతర్గాముల సమాచారమా కాదా అనే విషయం తొలుత గుర్తిస్తామని చెప్పారు. అయితే, లీకైంది 100శాతం సమాచారం కాదని అన్నారు. లీక్ సంబంధించిన మూలాలు విదేశాల్లో ఉన్నాయని నేవీ ప్రకటించింది. |