Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2076 Registered: 04-2015 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, August 31, 2016 - 12:46 pm: |
|
Hello Greetings from Telugu.MFlixWorld.com!! Big day around for NANDAMURI fans as most awaited South Indian movie ... NTR's "JANATHA GARAGE" is ready to hit more than 2500+ screens on 1st September 2016. There is lot of hype and expectation on "JANATHA GARAGE" which is expected to create new records in Tollywood and South India. It already created a buzz with its whopping business and shocking satellite prices. We made an attempt to bring to you the heat and add excitement by running you through the film's story line. Pls read below Chakri's Preview on NTR's latest movie "JANATHA GARAGE" scheduled to release on 1st September. Pls Visit for latest photos, Videos and updates : Janatha Garage / Mflixworld.com నందమూరి వంశానికి ... “గ్యారేజ్” కథలకి ఒక అభినావ సంబంధం ఉంది. ఎందుకంటే నందమూరి తారకరామారావు గారి “ డ్రైవర్ రాముడు”, నందమూరి బాలకృష్ణ గారి “లారీ డ్రైవర్”...ఇప్పుడు మన Jr NTR గారి “జనతా గ్యారేజ్”. ఆ రెండూ సూపర్ హిట్ సినిమాలే కాబట్టి... నందమూరి అభిమానులు “జనతా గ్యారేజ్” కూడా మరో సూపెర్ హిట్ అనే కాన్ఫిడెన్సు లో ఉన్నారు. పైగా .... జూనియర్ “టెంపర్” “నాన్నకు ప్రేమతో” వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపులో ఉన్నాడు. “మిర్చి” మరియు “శ్రీమంతుడు” వంటి అల్ టైం హిట్స్ తో కొరటాల శివ కూడా సూపర్ ఫాం లో ఉన్నాడు. వీరిద్దరి కలయికలో వస్తున్నా సినిమా పై ఆ మాత్రం Expectations ఉండటం అర్ధం చేసుకునేదే. పైగా ... శివ కి NTR అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా. మరి... ఈ ఇద్దరూ Hat-trick కొట్టబోతున్నారా??? ఇప్పటి వరకు మనం చూసిన ఈ సినిమా స్టిల్స్ గాని, టీజర్ గాని, ట్రైలర్ గాని ఒక్క విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి ఈ విశ్వం మొత్తం సశ్యాస్యామలంగా వుండాలి అంటే ప్రకృతిని కాపాడు కోవాలి అని నమ్మే ఒక IIT చదువుకునే యువకుడు.... సమాజం బాగుండాలి అంటే మనుషులంతా బాగుండాలి అని నమ్మే ఒక పెద్దాయన! ఎక్కడో వేరు వేరు ప్రాంతాల్లో తమ ఆలోచనలతో బ్రతికే ఈ ఇద్దరూ... ఎందుకు కలుసుకున్నారు... ఎలా తమ తమ లక్ష్యాలని చేరుకున్నారు అనేదే ఈ సినిమా. ఇకపోతే మన కథానాయకుడు NTR గారి పంథా రోజు రోజుకి సమాజానికి స్పూర్తిగా నిలిచే కథలు ఎంచుకోవడం లో శ్రద్ద చూపిస్తున్నారు. ఆ బాటలోనే విజయాల్ని సాదిస్తున్నారు... అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. IIT విద్యార్థి గా మనకు కావలిసిన వినోదం... NTR మార్క్ డాన్సు.... తరువాత Mohan Lal గారి తో కలసి నేటి సమాజం లో ప్రజలకి జరిగే అన్యాయాలను “రిపేరు“ చేయడం ... ఈ ప్రయత్నం లో జరిగే ఆసక్తి కరమైన కథాంశంతో మన ముందుకి రాబోతుంది “జనతా గ్యారేజ్”. అంటే... NTR నట విశ్వరూపాన్ని మరో సారి అభిమానులు చూడబోతున్నారన్న మాట.... అన్నమాట కాదు...ఉన్న మాటే! ఇక దర్శకులు కొరటాల శివ గారు... తెలుగు సినీ చరిత్ర లో ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. మొదటి సారి ఓ దర్శకుడు కమర్షియల్ సినిమా చేస్తూ... దానిలో సమాజానికి ఉపయోగ పడే ఒక మంచి పాయింట్ ని తీసుకుని, దానికి కమర్షియల్ ఎలెమెంట్స్ జోడించి సంచాలన విజయం సాధించే ఫార్ముల ఆయన సొంతం. ఇప్పటికే రెండు సార్లు నిరూపించుకున్నారు కూడా . అటువంటి ప్రయత్నమే మరో సారి చేస్తున్న ఆయన బాటలో విజయం తప్ప మరొకటి చోటు చేసుకోదు అని పూర్తిగా నమ్ముతున్నాను. సమంతా గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఆమె సినీ పరిశ్రమకి విజయలక్ష్మి. ఇక మోహన్ లాల్ ఎంతటి స్టామినా ఉన్న స్టార్ నటుడో మనకి తెలుసు. DSP సంగీతం ఇప్పటికే ఒక ఊపు ఊపేస్తోంది. NTR ఏ స్థాయిలో డాన్స్ చేసాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పంచ్ డైలాగ్స్ రాయటం లో శివ దిట్ట.... పలకటం లో NTR కి తిరుగు లేదు... అవి ఎలా పేలతాయో అని అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఏ విధంగా చూసినా .... సినిమా సంచలనం సృష్టించేట్టుగానే కనిపిస్తుంది అనడం లో సందేహం లేదు. అంతెందుకండి.... మీతో పాటూ... నాకు కూడా చాలా చాలా EXPECTATIONS ఉన్నాయి.... ఎంతగానో ఎదురుచూస్తున్నా..... సరేనండి.... తిన బోతూ రుచి గురించి ఎందుకు... రెండు రోజులలో విడుదలవుతున్న “జనతా గ్యారేజ్” విజయం తరువాత ఈ మాటలు నిజమని మీరే నమ్ముతారు. ప్రేమతో .... మీ “చక్రి” |