Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9890 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 07, 2017 - 10:28 am: |
|
తారక్.. అతితక్కువ గ్యాప్ లో అతి ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరో. తనమీద నందమూరి హీరో అనే ముద్ర పడినప్పటికీ.. తనదంటూ ఒక 'ఇండివిడ్యువాలిటీ' మెయింటైన్ చేస్తూ వచ్చిన తారక్ మీద ప్రేక్షకుడి గురి నానాటికీ పెరుగుతోందనే చెప్పాలి. తెరమీద సంగతి అటుంచితే.. జనం ముందు కూడా సూటిగా, అర్థవంతంగా, తడబడకుండా మాట్లాడగలగడం తారక్ కుండే యూనిక్ క్వాలిటీ. ఎన్నికల ప్రచారంలో కూడా ఆవేశపూరిత ప్రసంగాలు చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తమ్మీద తనవైన క్యాపబిలిటీస్.. జూనియర్ ఎన్టీయార్ ని ఒక ఎత్తులో నిలబెట్టేశాయి. కట్ చేస్తే.. ఇప్పుడీ బుడ్డ ఎన్టీయార్ ఒక 'గడ్డు' పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఏమిటది..? యాక్టింగ్ లో ఎన్టీయార్ డైనమిజం ఎంతో మొన్నటి 'టెంపర్' మూవీతో తేలిపోయింది. మిగతా పెర్ఫామెన్స్ సంగతి పక్కకు బెడితే.. ఎన్టీయార్ ఒరిజినల్ స్టామినా ఎంతన్నది అంతకుముందే యమదొంగ మూవీతో రుజువైపోయింది. తాతను గుర్తు చెయ్యడం కాదు, తాతను మరిపించగల సత్తా కూడా తనకుందంటూ ప్రూవ్ చేసి చూపించాడు తారక్. పౌరాణిక పాత్రల్ని కూడా ఊదిపారేస్తానన్న సిగ్నల్స్ ఇచ్చేశాడు. 'ఎనీ డౌట్స్' అంటూ.. తెరమీద నుంచే నందమూరి అభిమానుల్ని గద్దించి అడిగిన దిల్లున్నోడుగా ఎన్టీయార్ సెటిలైపోయాడు. టాలీవుడ్ లో 'ఇది తారక్ తరం' అని చెప్పుకోగల సామర్థ్యం అతడికుందనుకుంటున్న తరుణంలో.. తారక్ ఒక సిన్సియర్ ఛాలెంజ్ ని టేకప్ చేశాడు. జై లవకుశ..! మూడు విభిన్నమైన వేరియేషన్స్ వున్న మూడు కథానాయక పాత్రల్ని ఇందులో జూనియర్ పోషిస్తున్నాడు. గురువారం రిలీజైన మొదటి టీజర్లో.. జై అనే నెగెటివ్ ఫ్లేవరున్న పాత్ర రివీలైంది. హావంలోనూ, భావంలోనూ తారక్ చూపించిన విభిన్నత.. విమర్శకుల మనసుల్ని కూడా దోచేసింది. వీటన్నిటికంటే ముఖ్యమైనది 'డిక్షన్'. తడబడే మాటతీరుతో స్టామరింగ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకున్న జూనియర్.. డైలాగ్ డెలివరీలో తన సీనియారిటీ ఎంతో తేల్చిపారేశాడు. రౌద్రరసంలో కూడా తారక్ కి తిరుగులేదంటూ వరసబెట్టి సెలెబ్రిటీ ట్వీట్లు పడిపోతున్నాయి. కానీ.. ఇది టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..! రాముడైనా, రావణుడైనా రామారావేనంటూ ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళం. రాముడి వేషంలో, కృష్ణుడి వేషంలో కరుణ రసాన్ని పండించి కలెక్షన్లు కురిపించిననట్లే.. భీముడు, కర్ణుడు, దుర్యోధనుడి వేషాల్లో వీరోచిత నటన ప్రదర్శించిన చరిత్రకారుడు ఎన్టీయార్. రావణాసురుడిగా నెగెటివ్ షేడ్ లో కూడా మెరుపులు కురిపించాడు. ఇప్పుడు అదే ఛాలెంజ్ ని జూనియర్ ఎన్టీయార్ చేతుల్లోకి తీసుకున్నాడు. జై పాత్రకు తారక్ పూర్తిగా న్యాయం చేసినట్లు టీజర్ చెబుతోంది. కానీ సినిమా ఆద్యంతం అదే టెంపోను మెయింటైన్ చేసి.. సక్సీడ్ అయినప్పుడే.. తారక్.. ది హీరో. నిరుత్సాహపరిస్తే మాత్రం.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే ! http://journalistdiary.in/viewnews/91/1937/Tarak-To-Face-A-Critical-Challenge-in -Jai-Lavakusa.htm |