Author |
Message |
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 2184 Registered: 03-2013 Posted From: 65.198.163.148
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 26, 2014 - 5:38 pm: |
|
superman thammi ivannee already expected antunnaru .. Bewarsegadu Fan of Balayya and PK
|
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1103 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 26, 2014 - 5:26 pm: |
|
First 1yr koncham tought ga vuntundhi AP budget. I think 2nd yr nunchi cool gane vuntundhi... |
Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 903 Registered: 04-2012 Posted From: 8.28.19.85
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 26, 2014 - 4:04 pm: |
|
good |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1102 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 26, 2014 - 3:49 pm: |
|
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించిన కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాట పట్టా యి. అమ్మకం పన్నుల చట్టం కింద ఓ కంపెనీ ఏ రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఆ ప్రాంతంలో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ నిబంధనతో పలు కం పెనీలు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ నగరాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాయి. మరికొన్ని కంపెనీలు అదే పనిలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఎక్కడ వ్యాపారం చేసినా హైదరాబాద్‌లోని రిజిస్టర్డు కార్యాలయం నుంచి ప్రభుత్వానికి పన్ను చెల్లింపులు జరిగేవి. విభజన నేపథ్యంలో కంపెనీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వాణిజ్య పన్నుల శాఖ వద్ద వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. హైదరాబాద్‌లో రిజిస్టరైన కంపెనీలు తెలంగాణాలో వ్యాపారం నిర్వహించుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం నిర్వహణకు 13 జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రిజిస్టర్ కావాలి. ఉమ్మడి రాష్ట్రంలో అమ్మకం పన్నుల ద్వారా అత్యధిక రాబడి లిక్కర్, చమురు ద్వారా లభించేది. ఈ రెండు రకాల ఆదాయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. అమ్మకం పన్ను చెల్లింపుల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ విభజన తర్వాత విజయవాడకు తరలుతోంది.13 జిల్లాల మద్యం అమ్మకాల రాబడి ఇకపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఖాతాలో జమపడుతుంది. ఇక లిక్కర్ తర్వాత అత్యధిక శాతం రాబడి సమకూర్చే చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా విశాఖపట్నం తరలుతున్నాయి. ఆయిల్ కంపెనీలు విశాఖ తరలిరావడంతో వాణిజ్య పన్నుల డివిజన్‌కు ఏటా అదనంగా రూ.4,500 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నది. విజయవాడ డివిజన్‌కు రమారమి 6,700 కోట్లు ఆదాయం లభించనున్నది. చమురు రంగంలో ప్రధానమైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ కంపెనీలు తాజాగా విశాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో చమురు, గ్యాస్ ఇతర ఉత్పత్తుల వ్యాపార లావాదేవీలకు సంబం«ధించి ఇకపై ఈ కంపెనీలో పన్నులు విశాఖలోని వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాలి. వాణిజ్య పన్నుల శాఖ విశాఖ డివిజన్లో ఎక్కువగా పన్నులు చెల్లించే సంస్థల (ఎల్టీయూ) విభాగంలో ఆయిల్ కంపెనీలు నమోదయ్యాయి. ఒక్క విశాఖకు ఇప్పటివరకు 450 కంపెనీలు వచ్చాయి. ఈ 450 కంపెనీలలో 89 కంపెనీలు పూర్తిగా తెలంగాణ నుంచి వచ్చేశాయి. అటువంటివాటిలో రెయిన్ కాస్టింగ్ కార్బన్ (విశాఖ) లిమిటెడ్, విశ్వరూప ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎన్ఎఫ్ ఇండియా లిమిటెడ్, రాహుల్ కేబుల్స్ లిమిటెడ్ తదితర కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు ఏడాదికి కోటి నుంచి ఏడు కోట్లు వరకు అమ్మకం పన్ను చెల్లించేవి. ఇంకా లక్షల్లో పన్నులు చెల్లించే వందలాది కంపెనీలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. అదే సమయంలో వి శాఖ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న కోరమాండల్, వరుణ్ మోటార్స్, ఎంఎంటీసీ వంటి సంస్థలు తెలంగాణాలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. కోరమాండల్ రూ.5 కోట్లు, వరుణ్ మోటార్స్ రూ.50 కోట్లు, ఎంఎంటీసీ రూ.40 కోట్లు రూపాయలు ఆదాయం తెలంగాణాలో చెల్లించనున్నట్టు తెలిసింది. జూన్ రెండు నుంచి నెలాఖరు వరకు నిర్వహించే వ్యాపారంపై జూలై 20నాటికి రిటర్న్స్ దాఖలు చేయాలి. దీంతో రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ కంపెనీల వల్ల వచ్చే ఆదాయంపై స్పష్టత వస్తుందని విశాఖ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ టి శివశంకరరావు తెలిపారు. |
|