Author |
Message |
Vespa
Pilla Bewarse Username: Vespa
Post Number: 481 Registered: 10-2014 Posted From: 183.82.184.72
| Posted on Monday, February 16, 2015 - 7:22 am: |
|
fanno dorling can u tell me english what is it abt ? |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7327 Registered: 03-2004 Posted From: 76.122.133.243
| Posted on Sunday, February 15, 2015 - 10:25 am: |
|
Lovebewarsetalk:
actually DC was doing good..It was a huge success in chennai too...Sudden ga emindo teleedhu..IPL team might be one of the reason...Telangana issue punyama ani aa team epuudoo losses lone vundi. |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 1185 Registered: 08-2014 Posted From: 43.249.216.26
| Posted on Sunday, February 15, 2015 - 6:52 am: |
|
Fanno1:Vespa...DC ni naakinchesindhi kadaa Gayatri reddy...
Fanno bhayya, Vespa dorling all bolls annaa kudaa...yes wat u said is right konchem...migathaa konchem edho real estate meedha aasalu..YS untaadu, mallee power loki vasthaad...appudu konchem quid pro quo lo involve ayyi baari etthuna lands sanction seyinchukuni...ilaa edho..edhedho..plan/oohalu sesukuntaa alaa alaa sanka naakipoyings...
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7324 Registered: 03-2004 Posted From: 76.122.133.243
| Posted on Saturday, February 14, 2015 - 9:35 pm: |
|
Vespa...DC ni naakinchesindhi kadaa Gayatri reddy... ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు ఆయన సోదరుడినీ అదుపులోకి తీసుకున్న సీబీఐ కెనరా బ్యాంకును మోసగించిన కేసులో చర్యలు హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని బెంగళూరు సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు డాక్యుమెంట్లతో వెంకట్రామిరెడ్డి.. తమను రూ.357 కోట్ల మేర మోసం చేశారంటూ సీబీఐకి కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీబీఐ అధికారులు వెంకట్రామిరెడ్డిని శనివారం అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జిల నివాస ప్రాంగణానికి తీసుకెళ్లి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం వెంకట్రామిరెడ్డిని బెంగళూరు తరలించారు ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను మోసం చేసినందుకు వెంకట్రామిరెడ్డిపై ఐపీసీ 420, 120(బీ), 468, 471 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా వెంకట్రామిరెడ్డితోపాటు ఆయన సోదరుడు వినాయక్రవి రెడ్డి, డీసీహెచ్ఎల్ ముఖ్య అధికారి పీకే అయ్యర్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. గతం లో వివిధ బ్యాంకుల్లో రూ.1230 కోట్ల మేర వెంకట్రామిరెడ్డి లోను తీసుకున్నారు. అయితే ఆయన అన్ని బ్యాంకుల్లోనూ ఒకే ఆస్తిని తనఖా పెట్టినట్లు కెనరా బ్యాంకు గుర్తించింది. దీంతో వెంకట్రామిరెడ్డి తమను మోసగించారంటూ 2013లో సీబీఐకి ఫిర్యాదు చేసింది. కాగా.. వెంకట్రామిరెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ అధికారులు గోప్యత పాటించారు. సీబీఐ వర్గాల సమాచారం మేరకు... డిఫాల్టర్‌కు రూ 50 కోట్ల రుణమిచ్చినందుకు పలువురు ఆంధ్రాబ్యాంకు అధికారులను బెంగళూరులో అరెస్టు చేశారు. ప్రసుత్తం ఐదుగురు అధికారులు కస్టడీలో ఉన్నారు. హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కెనరా బ్యాంకు పెట్టిన కేసులో సీబీఐ అరెస్టు చేసిన వెంకట రామిరెడ్డి అప్పుల పర్వం 2005లో మొదలైంది. ఆ తరువాత 2009-11 మధ్యలో పలు వందల కోట్ల రూపాయల మేరకు వివిధ బ్యాంకుల నుంచి ఆయన సంస్థ డీసీహెచ్ఎల్ అప్పులు చేసింది. అలా అప్పులు చేయడం కోసం.. సికింద్రాబాద్‌లో ఉన్న కెనరా బ్యాంకు బ్రాంచ్‌ను మోసం చేశారని సీబీఐ ఆరోపణ. కెనరా బ్యాంకు నుంచి రెండు విధాలుగా వెంటరామి రెడ్డి అప్పులు తీసుకున్నారు. ఒకటి.. ఓపెన్ క్యాష్ క్రెడిట్ లిమిట్ కాగా.. రెండోది.. స్వల్పకాలిక కార్పొరేట్ రుణాలు. మొత్తం కలిపి సుమారు రూ. 1,230 కోట్ల మేర రుణాలు అందుకున్నారు. ఓపెన్ క్యాష్ క్రెడిట్ కోసం.. సంస్థ దగ్గర ఉన్న ముడి సరుకులు, ఇతర స్టాక్‌లు, జరుగుతున్న పని అంచనా విలువ, తయారై ఉన్న ఉత్పత్తులు, సంస్థకు రావాల్సిన బకాయిలను తాకట్టు పెట్టేశారు. కోటి రూపాయల రుణం కావాలంటే.. రూ. నాలుగు కోట్ల మేర స్టాక్‌లు లేదా రావాల్సిన కచ్చితమైన బకాయిలు ఉండాల్సిన ఈ లావాదేవీల్లో రూ. 1,230 కోట్ల మేరకు కెనరా బ్యాంకు నుంచి అప్పు చేసిన డీసీహెచ్ఎల్ సంస్థ.. తన దగ్గర ఎంత స్టాక్ ఉన్నట్లు లేదా రావాల్సిన బకాయిలు ఉన్నట్లు చూపించిందో అంచనా వేయొచ్చు. వాస్తవానికి డెకన్ చార్జర్స్ జట్టును అమ్మడానికి 2012లో బీసీసీఐ పీవీపీ వెంచర్స్ సంస్థను సూచించగా.. కాదన్న డీసీహెచ్ఎల్ వేరే సంస్థను ఎంపిక చేసుకుంది. ఆ సంస్థ గురించి తమకు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా బీసీసీఐ.. డెకన్ చార్జర్స్ సంస్థను ఐపీఎల్ నుంచి తొలగించింది. దీంతో ఆ లావాదేవీల్లో డీసీహెచ్ఎల్ నష్టపోయిందని చెబుతారు. కారణాలు ఏమైనా.. ఓపెన్ క్యాష్ క్రెడిట్, స్వల్పకాలిక కార్పొరేట్ రుణాల కోసం బ్యాలెన్స్ షీట్లను, బ్యాంకు స్టేట్మెంట్లనూ వెంకటరామి రెడ్డితో పాటు ఇతర డైరక్టర్లు పోర్జరీ చేశారని సీబీఐకి కెనరా బ్యాంకు ఫిర్యాదు. తమ దగ్గర రుణాలతో పాటు, ఇతర బ్యాంకుల నుంచి డీసీహెచ్ఎల్ తీసుకున్న రుణాల సమాచారాన్ని దాచి కొత్త రుణాలను తీసుకున్నారని బ్యాంకు ఆరోపణ. డీసీహెచ్ఎల్ అక్రమ లావాదేవీల వల్ల బ్యాంకుకు రూ. 357.77 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. |
|