Author |
Message |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7944 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Wednesday, September 30, 2015 - 6:19 pm: |
|
అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు మరో వరం లభించింది. ముంబై, మంగళూరులను కాదని కేంద్రం ఆ వరాన్ని ఏపీకే ఇచ్చింది. ఆ వరం ‘దేశంలోనే తొలి డ్రెడ్జింగ్ హార్బర్’! 1890 కోట్ల రూపాయల విలువైన ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గల అంతర్వేదిలో నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. అంతేకాదు.. ఈ హార్బర్ ద్వారా సాగరమాల ప్రాజెక్టుకు ఏపీ నుంచే తొలి అడుగు వేసింది. రాష్ట్రానికి ఉన్న విశాల కోస్తా తీరాన్ని ఉపయోగించుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు చేయూతను ఇచ్చింది. ముంబై, మంగళూరులలో ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల నుంచి ఒత్తిడి వచ్చినా.. కేంద్రం ఏపీ వైపే మొగ్గింది. అధికారులను చంద్రబాబు అప్రమత్తం చేసి.. తగిన సమయంలో స్థలాన్ని కేటాయించడంతో రాష్ట్రం చేతికి ఈ ప్రాజెక్టు వచ్చింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఆధ్వర్యంలో.. రూ.1890 కోట్ల వ్యయంతో ఈ హార్బర్‌ను నిర్మించనున్నారు. అక్టోబర్ 3న అంతర్వేదిలో హార్బర్‌కు కేటాయించిన స్థల పరిశీలనకు కేంద్ర బృందం రానుంది. ఆ బృందంలో డీసీఐ సీఎండీ రాజేశ్ త్రిపాఠి, డైరక్టర్ ఎం.ఎ్‌స.రావు, ఆపరేషన్ జీఎం కెప్టెన్ ఎస్.దివాకర్, కెప్టెన్ కె.ఎం. చౌదరిలతో పాటు డీసీఐ నాలెడ్జ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న కోస్టల్ ఇండియా డెవల్‌పమెంట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ శాస్ర్తిలు ఉన్నారు. కాగా, ఏర్పాటుకు ఏపీకి లేఖ ద్వారా సూత్రప్రాయ అంగీకారం తెలిపిన కేంద్రం.. మూడు విడతల్లో నిధులను మంజూరు చేసేందుకు ఒప్పుకొంది. మొదటి విడతలో రూ.730కోట్లు డీసీఐకి అందజేయనుంది. రెండో విడతలో రూ.640 కోట్లు, మూడో విడతలో రూ.520 కోట్లు నిధులను విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికనూ కేంద్రం తయారు చేసింది. డ్రెడ్జింగ్ హార్బర్లో శిక్షణా సంస్థ, వర్క్‌షాప్, జెట్టీల నిర్మాణం, డ్రెడ్జింగ్మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాల్లో ఎక్కడైనా ఇక్కడి నుంచే డ్రెడ్జింగ్ కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పోర్టుల అనుసంధానానికి సాగరమాల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఇక, అంతర్వేది వద్ద సాగరతీరంలో రెండు కిలోమీటర్లు విస్తరించనున్న ఈ డ్రెడ్జింగ్హార్బర్తో సాగరమాల ప్రాజెక్టుకు తొలి అడుగు పడినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరం వెంట విస్తృతంగా డ్రెడ్జింగ్కార్యకలాపాలు చేపట్టి అంతర్రాష్ట్ర జలమార్గాలను అభివృద్ధి చేసేందుకూ మార్గం సుగమం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక, కేవలం రెండేళ్లలో హార్బర్‌ను పూర్తిచేస్తామని డీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7943 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Wednesday, September 30, 2015 - 6:15 pm: |
|
ఎపిలో పైలట్ ప్రాజెక్టు వాషింగ్టన్ : ఇంటర్నెట్ను మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తెచ్చే గూగుల్ ప్రధాన ఉత్పత్తి లూన్ పట్ల ప్రధాని నరేంద్రమోదీ ఆకర్షితులయ్యారు. గత వారాంతంలో ఆయన గూగుల్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు గూగుల్ ప్రతినిధులు దీని గురించి ఆయనకు వివరించగా అది దూర విద్య, గ్రామీణ పాఠశాలలు, టెలీ మెడిసిన్ విభాగాలకు ఎంత గానో ఉపయోగకరంగా ఉంటుదని ప్రధాని ప్రశంసించినట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటివరకు ఇంటర్నెట్ అందుబాటులో లేని గ్రామాలకు అది అందుబాటులోకి తేవడం తమ ప్రధాన లక్ష్యమని గూగుల్ అధికారులు ప్రధానికి వివరించారు. ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చినట్టయితే 16 కోట్ల మందిని పేదరికం రేఖ నుంచి పైకి తీసుకురావచ్చని తమ పరిశోధనలో తేలిందని వారు చెప్పారు. ఇప్పటివరకు దాన్ని ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాలకు కనెక్టివిటీ కోసమే వినియోగిస్తున్నారని, అవసరాన్ని బట్టి దాన్ని దూరవిద్య, టెలీమెడిసిన్‌తో సహా భిన్న విభాగాలకు విస్తరించే విషయం పరిశీలించవచ్చునని ప్రధాని సూచించారు. తనకు ఎంతో ప్రీతిపాత్రమైన కాన్సెప్ట్ ‘జామ్’ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ ఇందులోని జె అక్షరం జన్‌ధన్ యోజన, ఎ అక్షరం ఆధార్, ఎం అక్షరం మొబైల్ గవర్నెన్స్‌కు సంకేతంగా నిలుస్తాయని ప్రధాని వారికి తెలిపారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. జన్‌ధన్ యోజన, ఆధార్లను ఇప్పటికే విస్తరించగా మొబైల్ గవర్నెన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకువెళ్లే విషయంలో గూగుల్ సలహా సహకారాలు అందించాలని ప్రధాని కోరినట్టు ఆయన చెప్పారు. అలాగే గూగుల్ టెక్నాలజీలు వ్యవసాయ రంగానికి ఏమైనా ఊతం ఇవ్వగలవా అని కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వర్షపాతాన్ని మదింపు చేయడం, భవిష్యత్తు పంట ధోరణులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఆ టెక్నాలజీలు ఎలా ఉపయోగపడతాయో పరిశోధించాలని ఆయన సూచించారు. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7931 Registered: 03-2004 Posted From: 68.230.148.2
| Posted on Sunday, September 27, 2015 - 9:18 pm: |
|
Swacch bharat lo kooda sinificant difference chooinchina 6 states lo AP kooda vundhi... Ediche batch baga edavandi..mee yedupe TDP ki AP ki sreerama raksha.. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7930 Registered: 03-2004 Posted From: 68.230.148.2
| Posted on Sunday, September 27, 2015 - 9:11 pm: |
|
https://www.facebook.com/TDP.Official/videos/1152886014724988/ |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Critic
Pilla Bewarse Username: Critic
Post Number: 933 Registered: 03-2004 Posted From: 107.131.42.191
| Posted on Saturday, September 26, 2015 - 2:56 pm: |
|
CBN aasthi 42.4 lakhs ----------------------------------------------------
![MOVIEART--bemmi.boodida](http://www.bewarsetalk.net/discus/movieanimated/bemmi.boodida.gif) |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7923 Registered: 03-2004 Posted From: 68.230.148.2
| Posted on Saturday, September 26, 2015 - 8:19 am: |
|
Kubang:Power one rupee ki ivvatam pichathanam. Land, water and vat exemption okay. Power bill thadisi mopedu avuddi 10 years ki
fertilizer company kada... Govt ye kontundi emo kadaa final gaa..I dont know..just guessing.. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Filmlover
Kurra Bewarse Username: Filmlover
Post Number: 2884 Registered: 01-2013 Posted From: 117.216.217.233
| Posted on Thursday, September 24, 2015 - 9:34 am: |
|
Kubang:pichathanam
hmmm Not a palanquin bearer....
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 28382 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Thursday, September 24, 2015 - 9:30 am: |
|
Power one rupee ki ivvatam pichathanam. Land, water and vat exemption okay. Power bill thadisi mopedu avuddi 10 years ki Ignorance is bliss
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98245 Registered: 03-2004 Posted From: 185.46.212.70
| Posted on Thursday, September 24, 2015 - 4:11 am: |
|
.... |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Phani
Pilla Bewarse Username: Phani
Post Number: 974 Registered: 11-2013 Posted From: 67.170.255.66
| Posted on Wednesday, September 23, 2015 - 11:35 pm: |
|
CBN ki anni kalisosthe AP thondarlone manchi position lo untundhi ![MOVIEART--bemmi.entry](http://www.bewarsetalk.net/discus/movieanimated/bemmi.entry.gif) |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7912 Registered: 03-2004 Posted From: 68.230.148.2
| Posted on Wednesday, September 23, 2015 - 10:01 pm: |
|
17 వేల కోట్లు... శ్రీసిటీలో మరో చైనా కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడులకు లోంగీ ఓకే తొలి విడతగా రూ.1670 కోట్లు వెయ్యి మెగావాట్ల సోలార్ సెల్స్, పానెళ్లు అక్కడే 500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ఐదు వేల మందికి సంస్థలో ఉపాధి కల్పన ఆర్ఈసీ నుంచి మరో 9 వేల కోట్ల రుణం కృష్ణపట్నంలో క్రిభ్కో భాస్వరం, పొటాష్ ప్లాంట్ వెయ్యి కోట్ల పెట్టుబడి.. 6 లక్షల టన్నుల ఉత్పత్తి న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటన సత్ఫలితాలను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఒకేరోజు ఎంవోయూలు వెల్లువెత్తాయి. 17 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో చైనాకు చెందిన జియాన్ లోంగీ సిలికాన్ మెటీరియల్స్ కార్పొరేషన్ సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను స్థాపించనుంది. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ సెల్స్, మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూళ్లను ఉత్పత్తి చేయనుంది. ఇక్కడ తయారు చేసిన వాటిని విదేశాలకూ ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది. వాటితో పాటు అక్కడే మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను సంస్థ ఉత్పత్తి చేసి.. రాష్ట్రానికి విక్రయించనుంది. మరోవైపు ఏపీ జెన్కో అనంతపురంలో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి పార్కును ఏర్పాటు చేయనుంది. దానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ) రూ.3 వేల కోట్ల రుణం ఇవ్వనుంది. అలాగే, రాజధాని అమరావతి ప్రాంతంలో విద్యుత్ సరఫరా స్థిరీకరణకు మరో రూ.6 వేల కోట్లను ఇవ్వనుంది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీజెన్కో-లోంగీ, శ్రీసిటీ-లోంగీ, ఏపీజెన్కో-ఆర్ఈసీ, ఏపీట్రాన్స్కో-ఆర్ఈసీల మధ్య నాలుగు వేర్వేరు అవగాహనా ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాల సందర్భంగా చైనా రాయబార కార్యాలయ మంత్రి లియూ జిన్సాంగ్, లొంగీ సంస్థ చైర్మన్ బావోషెన్ ఝొంగ్లు మాట్లాడారు. భారత్‌లో ఉత్పత్తికి చైనా ఆసక్తిగా ఉందని వెల్లడించారు. శ్రీసిటీలో తొలి విడత రూ.1670 కోట్లు పెట్టుబడి పెడతామని, 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారానికి పెద్దపీట వేస్తున్నామని, నిరంతరాయ విద్యుత్‌తో పాటు సమగ్ర రాయితీలు ఇస్తున్నామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. సులభంగా వ్యాపారం చేయదగ్గ రాషా్ట్రల్లో రెండో స్థానంలో నిలిచిన రెండు వారాల్లోనే భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం సంతోషకరమని రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. రాబోయే 15 రోజుల్లో 2 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు బిడ్లు పిలుస్తామని, రెండు నెలల్లో పవన విద్యుత్‌లోనూ భారీ పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చి సరిగ్గా బుధవారానికి ఏడాది అని, సరిగ్గా అదే రోజు ఈ ఒప్పందాలు జరగటం ఆనందంగా ఉందని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. తమ సెజ్‌లో ఇప్పటికే నాలుగు చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయన్నారు. చంద్రబాబు వంటి డైనమిక్ ముఖ్యమంత్రితో పనిచేయటానికి తాము ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటామని ఆర్ఈసీ సీఎండీ రాజీవ్ శర్మ అన్నారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఇతర రాషా్ట్రలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని, ఏపీకి ఎన్ని నిధులు కావాలన్నా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పునురాత్పదక ఇంధన వనరుల శాఖ కార్యదర్శి త్రిపాఠి అన్నారు. కృష్ణపట్నంలో క్రిభ్కో ప్లాంట్ ఎరువుల ఉత్పత్తి సంస్థ క్రిషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో).. కృష్ణపట్నంలో భాస్వరం, పొటాష్ ఎరువులను ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడిని సంస్థ పెట్టనుంది. వచ్చే పదేళ్ల వరకూ విద్యుత్‌ను ఒక్క రూపాయికే ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ఆఫర్, ఏడేళ్ల వరకూ వ్యాట్ మినహాయింపు తదితర మినహాయింపులివ్వడంతో రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలని నిర్ణయించినట్లు క్రిభ్కో చైర్మన్ చంద్ర పాల్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నిర్ణయాల వల్ల సంస్థకు 500 కోట్ల మేర ప్రయోజనాలు చేకూరుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిందని చెప్పారు. ఇప్పటిదాకా యూరియాను మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లమని, అయితే భాస్వరం, పొటాష్‌ను ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ ఇదేనని ఆయన చెప్పారు. ఏడాదికి 6 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నెలకొల్పుతున్నామన్నారు. 4-5 ఏళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. |
|