బంట్రోతు కామెంట్ పై బాలయ్య కౌంటర్ ఇలా సాగింది. 'ఎవరు అయితేనేం. మనం ప్రజలకు సేవకులం. అధికారంలో ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉండొచ్చు. అందరూ ప్రజల బంట్రోతులే. ప్రజల కోసం కష్టపడటానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులం' అంటూ బాలయ్య చాలా సూటిగా కౌంటర్ ఇచ్చేశారు. బాలయ్య ఇచ్చిన కౌంటర్ కు వైసీపీకి ప్రత్యేకించి ఆ కామెంట్ చేసిన చెవిరెడ్డికి నిజంగానే అవాక్కయ్యారనే చర్చ అమరావతిలో తారా స్థాయిలో నడుస్తోంది.