Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through March 27, 2013 * Oh avunaa attage.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 82859
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 25, 2013 - 6:42 am:    Edit Post Delete Post Print Post

మూడు దశాబ్దాలు దాటిన తన రాజకీయ జీవితంలో ఎన్నో సంచలనాలకు ఆయన కేంద్రబిందువుగా నిలిచారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులకు ఆయన పేరంటేనే హడల్. సన్నిహితులకు మాత్రం మనసులో ఏమీ దాచుకోని 'బోళా శంకరుడు'. ఆయనే మాజీ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు డాక్టర్ పి.శంకరరావు. బ్రిటన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసి, అక్కడే కొంతకాలం కీలక ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి, స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన కుమార్తె సుస్మిత సొంతంగా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అవినీతిపై పోరాడే తన తండ్రినే అవినీతి ఆరోపణలతో అరెస్టు చేయడాన్ని ప్రతిఘటించి వార్తల్లోకెక్కిన సుస్మిత తండ్రితో తన అనుబంధాన్ని గురించి చెబుతున్న విశేషాలే ఈ వారం 'నాన్న-నేను'.

అవినీతి మీద నాన్న సాగిస్తున్న పోరాటం ఫలితంగా ఈరోజు ఎందరో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతస్థాయి అధికారులు జైలు జీవితం గడుపుతున్నారు. జడ్జీలు జైలు పాలయ్యారు. దాని వల్లే నాన్నకు ఎన్నో బెదిరింపులు, బుజ్జగింపులు వచ్చాయి. వందల కోట్లలో డబ్బు ఆశ ఎరచూపారు. ప్రాణాలు తీస్తామన్న బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా నాన్న ఏ ప్రలోభాలకు లొంగలేదు.

అది 2002 సంవత్సరం. మా కుటుంబాన్ని కల్లోలానికి గురిచేసిన ఏడాది. ఆ ఏడాదిలోనే అమ్మకు పెద్ద జబ్బు చేసింది. కడుపులో పెద్ద ప్రేగులు చితికిపోయాయి. ఇక బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేశారు. ఆపరేషన్ చేస్తే బతకవచ్చు లేదా చనిపోవచ్చు అని డాక్టర్లు చెప్పడంతో అంతా దేవుడిదే భారమని ఆపరేషన్ చేయించడానికే సిద్ధపడ్డాము. అమ్మంటే నాన్నకు ఎంత ప్రేమో నాకు అప్పుడే తెలిసింది. అప్పటి దాకా అమ్మను సరదాగా ఆటపట్టిస్తూ నవ్వించే నాన్నలో చెప్పలేనంత దిగులు కనిపించింది.

అమ్మ ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఇంట్లో అమ్మ ఫోటోతో నాన్న మాట్లాడేవారు. "నన్ను వదిలిపెట్టి ఎక్కడకు వెళదామనుకుంటున్నావు? అంతా నీ ఇష్టమేనా? నువ్వు మొండిదానివైతే నీ కన్నా మొండివాడిని నేను. ఎలా వెళతావో నేనూ చూస్తాను..ఇంటికి రా డిష్యూం డిష్యూం..పోట్లాడుకుందాం'' అని నాన్న అంటుంటే మా కళ్లలో నీళ్లు జలజల రాలిపోయేవి. నానమ్మ చనిపోయినప్పుడు, అమ్మకు సర్జరీ జరిగినప్పుడు మాత్రమే నాన్న కంట కన్నీరు నేను చూశాను. ఆ తర్వాత అమ్మ ఆరోగ్యం కుదుటపడింది.

అయితే మరో విషాద సంఘటన అదే ఏడాదిలో చోటుచేసుకుంది. డిగ్రీ చదువుకుంటున్న మా తమ్ముడు సుదీశ్ ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. పదేళ్లయినా ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో ఇప్పటికీ తెలియదు. వాడి ఆచూకీ కోసం నాన్న చేయని ప్రయత్నమంటూ లేదు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి అమ్మానాన్నలకు చాలాకాలం పట్టింది. తమ్ముడి అదృశ్యం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. సుదీశ్‌ని తలచుకుంటే చాలు మా గుండె నీరైపోతుంది. కళ్లు గోదారులవుతాయి.

ఎందరికో ప్రాణదాత
మా అమ్మానాన్నలకు మేము ముగ్గురం. అన్నయ్య శశాంక్, నేను, తమ్ముడు సుదీశ్. నాకు ఊహ తెలిసేసరికే నాన్న రాజకీయాలలో ఉన్నారు. అంతకుముందు ఆయన మెడిసిన్ చేసి వైద్య వృత్తిలో ఉండేవారు. నాన్నకు పేదల వైద్యుడిగా రంగారెడ్డి జిల్లా అంతటా మంచి పేరు ఉండేది. నాన్న హస్తవాసి మంచిదని ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే జిల్లా నలుమూలల నుంచి నాన్న దగ్గర ట్రీట్‌మెంట్ కోసం రోగులు వచ్చేవారు. రాజకీయాల్లోకి రాకముందు నాన్న 14 కంపెనీలకు ప్యానల్ డాక్టర్‌గా ఉండేవారు. రాంనగర్‌లో నాన్న క్లినిక్ ఎప్పుడూ నాలుగైదు వందల మంది రోగులతో కిటకిటలాడుతుండేది.

పావలా, అర్థ రూపాయి, రూపాయి... ఎవరు ఎంత ఇచ్చినా పుచ్చుకునేవారే తప్ప ఇంతని ఎప్పుడూ డిమాండ్ చేసేవారు కాదు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఉచితంగానే చికిత్స చేయడం మొదలుపెట్టారు నాన్న. రోజూ వందలాది మంది రోగులకు ట్రీట్‌మెంట్ ఇచ్చే నాన్న మాకెప్పుడైనా సుస్తీ చేసి ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తే మాత్రం చేతులు వణికిపోయేవి. "ఇంజక్షన్ చేయడానికి ఇలా వణికిపోతున్నారు...మీరేం డాక్టరు?'' అంటూ అమ్మ వేళాకోళమాడితే "నా బిడ్డకు సూది గుచ్చినప్పుడు రక్తం వస్తే నేనెలా భరించేది?'' అని అనేవారు. ఇంజక్షన్ ఇస్తే ఏదైనా రియాక్షన్ జరుగుతుందేమోనని కూడా నాన్నకు భయం. రాజకీయ నాయకులలో చాలామందికి నాన్నే ఆస్థాన వైద్యుడు. "నా మొదటి పేషెంట్ పివి నరసింహారావుగారు అయితే చివరి పేషెంట్ డి. శ్రీనివాస్‌గారు'' అని నాన్న ఇప్పటికీ సరదాగా చెబుతుంటారు. సినీనటులు రాజనాల గారికి చివరి రోజుల్లో నాన్నే దగ్గరుండి వైద్యం చేయించారు. రాజబాబు, జి.వరలక్ష్మి తదితర సినీనటులు కూడా ఒకప్పుడు నాన్న దగ్గర వైద్యం చేయించుకున్నవారే.

ప్రపంచం చూపించారు...
నాన్న ఎమ్మెల్యేగా నాలుగుసార్లు షాద్‌నగర్ నుంచి గెలిచారు. ఐదవ ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు రావడంతో నాన్న మూడేళ్ల తర్వాత రాజీనామా చేయాల్సి వచ్చింది. షాద్‌నగర్‌లో ఒక క్లినిక్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్యం అందచేసేవారు. ప్రస్తుతం కంటోన్మెంట్ (సికింద్రాబాద్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాన్న రాజకీయాలలో ఉన్నప్పటికీ అమ్మ మాత్రం మమ్మల్ని వాటికి దూరంగా పెంచారు. మా అన్నయ్య గాంధీ జయంతి నాడు, తమ్ముడు గాంధీ వర్ధంతి రోజు పుట్టారు. దీంతో వాళ్లిద్దరి పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా జరిగేవి కావు. నేను పుట్టింది మేనెలలో. దీంతో మే నెల వచ్చిందంటే మా కుటుంబానికి సెలవుల పండుగలా ఉండేది.

నా పుట్టినరోజుకు ముందే నాన్న బంతిలా ఉండే ప్రపంచపటం (గ్లోబ్) తెచ్చి నా ముందు పెట్టేవారు. "ఇక తిప్పు బేటా... అది ఎక్కడ ఆగితే అక్కడే నీ బర్త్‌డే సెలబ్రేషన్స్'' అనేవారు. గిరగిర తిరుగుతున్న గ్లోబ్ మీద నా చూపుడువేలును ఆన్చేదాన్ని. అలా ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగాము. అప్పుడప్పుడు కొన్ని ట్రిక్కులు కూడా ప్లే చేసి అమ్మకు ఇష్టమైన ఊళ్లకు వెళ్లేవాళ్లం.. మన దేశంలో మేము కాలుపెట్టని రాష్ట్రం లేదు. కాశీ నుంచి కన్యాకుమారి దాకా, కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం దాకా ఈ దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలకు మమ్మల్ని తీసుకెళ్లారు నాన్న. కుంకుమ బొట్టు పెట్టుకోందే నాన్న గుమ్మం దాటి బయటకు వెళ్లరు. నాన్నకు అదో సెంటిమెంట్. నాన్నకు దైవభక్తితో పాటు జ్యోతిష్యం మీద నమ్మకం కూడా ఎక్కువే. ఒక్క హిందూ మతానికి చెందిన వారినే కాదు ఏ మతానికి చెందిన ఆధ్యాత్మిక గురువునైనా గౌరవిస్తారు.

చదువంటే నాకు ప్రాణం
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న స్వగ్రామం కరీంనగర్ జిల్లా అయినా దాదాపు 40 ఏళ్లకు పైగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్‌లోనే ఉంటున్నాం. నేను గ్రాడ్యుయేషన్, పిజిలో ఎంబిఎ మార్కెటింగ్ ఇక్కడ చేశాక బ్రిటన్‌లోని వేల్స్ యూనివర్సిటీలో ఎంబిఎ ప్రొక్యూర్‌మెంట్ పిజితోపాటు నాలుగు డిగ్రీలు చేశాను. ఆ తర్వాత పిహెచ్‌డి అక్కడే చేశాను. నేను బికాం చేస్తూనే కార్పొరేట్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను. బ్రిటిష్ అకాడమి ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో, అమెరికన్ అకాడమి ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో కూడా పాల్గొన్నాను. నేను యుకెలో చదువుకుంటున్నప్పుడే ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేసేదాన్ని. నాన్నకు 2004లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. 2008లో ఇండియాకు తిరిగి వచ్చేసి నేనే సొంతంగా ఒక కంపెనీని ప్రారంభించాను. కంపెనీ అగ్రిమెంట్ కోసం ఇక్కడ లాయర్ల దగ్గరకు వెళితే గంటకు పాతిక వేల చొప్పున చార్జ్ చేశారు.

అలా మూడు లక్షల బిల్ వేయడంతో నేనే ఎందుకు లా చదవకూడదని ఎల్ఎల్‌బి చదిచి పట్టాపొందాను. నాన్న కోసం ఇంటికి వచ్చే కార్యకర్తలు ఎక్కువ. రోజూ వంద విస్తర్లయినా మా ఇంట్లో లేవాల్సిందే. ఎవరు వచ్చినా వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టడం నాన్నకు అలవాటు. అమ్మ చేతి వంట అంటే నాన్నకు ఇష్టం. అయితే నేను వంట చేస్తే మాత్రం, "చూడు నా బిడ్డ ఎంత రుచిగా వండిందో! నీ జీవితంలో నువ్వెప్పుడైనా ఇలా వండావా? బేటా ఎక్సలెంట్. వంటంటే ఇలా ఉండాలి'' అని అమ్మను ఉడికిస్తూ, నన్ను మెచ్చుకుంటూ తినడం నాన్నకు సరదా. ఇప్పుడు వంట బాధ్యత నాదే. నాన్నకు ఇష్టమైన వంటలను వండిపెట్టడం నాకు కూడా చాలా ఇష్టం.

నా జీవితాన్ని మార్చేసిన రోజు
నా జీవితంలో ఈ ఏడాది జనవరి 31వ తేదీ పెనుమార్పులు తీసుకువచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజుకు ముందు, తర్వాత నేను ఏమిటి అని నన్ను నేను బేరీజు వేసుకోవడం మొదలుపెట్టాను. 1992 నుంచి వివాదంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్స్ భూముల వ్యవహారం హఠాత్తుగా తెరపైకి తెచ్చి నాన్నను అరెస్టు చేయడానికి పోలీసులు మా ఇంటికి వచ్చారు. 68 సంవత్సరాల వృద్ధుడిని అని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చుకుంటూ నాన్నను తీసుకెళ్లారు. ఆ సందర్భంగా నాన్నకు శరీరంపైన గాయాలయ్యాయి.

పోలీసులు ఆయన పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించడాన్ని నేను భరించలేకపోయాను. ఒక ఎమ్మెలే ్య పట్ల ఇంత అమానుష వైఖరి ఏమిటని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాను. ఈ సంఘటన మా జీవితంలో చాలా మార్పులే తీసుకువచ్చింది. అవినీతి మీద నాన్న సాగిస్తున్న పోరాటం ఫలితంగా ఈరోజు ఎందరో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతస్థాయి అధికారులు జైలు జీవితం గడుపుతున్నారు. జడ్జీలు జైలు పాలయ్యారు. దాని వల్లే నాన్నకు ఎన్నో బెదిరింపులు, బుజ్జగింపులు వచ్చాయి. వందల కోట్లలో డబ్బు ఆశ ఎరచూపారు. ప్రాణాలు తీస్తామన్న బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా నాన్న ఏ ప్రలోభాలకు లొంగలేదు. వెనుకడుగు వేయలేదు. అవినీతి అనే కొండను నాన్న ఒంటరిగానే ఢీకొన్నారు. ఆయనకు తన సొంత ప్రభుత్వం నుంచి కూడా మద్దతు లభించలేదు. నాన్నకు అండగా నిలబడాలన్నదే నా ఆశయం.

ఒక వ్యక్తి సాగిస్తున్న పోరాటం వల్ల సమాజంలో పెనుమార్పులు రాకపోవచ్చు. అవినీతి పూర్తిగా అంతం కాకపోవచ్చు. కాని ఒక్కో నీటి చుక్క మహానదిగా మారినట్లు అవినీతిపై నాన్న పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని నా నమ్మకం. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నాయకుడు జి.వెంకటస్వామిగారు మా తాతగారు(మా అమ్మకు తండ్రి). కొన్ని మనస్పర్థల కారణంగా దాదాపు నలభై ఏళ్లుగా మా రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. నాన్న అక్రమ అరెస్టు మళ్లీ మా రెండు కుటుంబాలను కలిపింది. నాన్న ఆసుపత్రిలో ఉండగా తాత, మా మేనమామలు వినోద్‌గారు, వివేక్‌గారు వచ్చి నాన్నను పరామర్శించారు. ఈ కలయిక అమ్మానాన్నలనే కాదు మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలుగచేసింది. జీవితం చాలా చిన్నది. ఇందులో మమకారాల స్థానంలో విద్వేషాలు ఉండకూడదని నేను భావిస్తాను.

Sankar Rao gaaru intha manchi vyakthi ani ippati daaka theliyaledhu saami MOVIEART--mummy....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Parra
Kurra Bewarse
Username: Parra

Post Number: 2943
Registered: 01-2013
Posted From: 212.95.7.77

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 25, 2013 - 6:30 am:    Edit Post Delete Post Print Post

Inga pakkana kokobba...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 82858
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 25, 2013 - 6:29 am:    Edit Post Delete Post Print Post


Parra:

Kaani congi vallu anatam gooram...


Congress vallu yemaina antarabba....

YSR chanipoyinappudu naaku mixed feelings kaligayi abba, poyadu nayalu anukunya same time ayyo papam ani bhi anukunya....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Queenslander
Pilla Bewarse
Username: Queenslander

Post Number: 926
Registered: 02-2013
Posted From: 60.240.207.19

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 25, 2013 - 6:28 am:    Edit Post Delete Post Print Post

Kiki congress
MAHESH & NTR jr--- natinchadam vachina iddaru herolu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Parra
Kurra Bewarse
Username: Parra

Post Number: 2942
Registered: 01-2013
Posted From: 212.95.7.77

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 25, 2013 - 6:27 am:    Edit Post Delete Post Print Post

Kaani congi vallu anatam gooram...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 82857
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 25, 2013 - 6:26 am:    Edit Post Delete Post Print Post

Arikatlodu saana hurt avuthunnadabba....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 82856
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 25, 2013 - 6:26 am:    Edit Post Delete Post Print Post

http://telugu.greatandhra.com/politics/march2013/25_ysr_death.php ....

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration