Author |
Message |
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22896 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 16, 2013 - 7:49 am: |
|
Dvsk:
Karimnagar lo natural ga t sentiment ekkuva kada...akkada valle gelustaru max...anduke akkadollani bhayapettu lagtunnadu...RR lo try jeste dobbeymannaru. space for lease
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 83554 Registered: 03-2004 Posted From: 130.138.227.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 16, 2013 - 7:22 am: |
|
Vallu next election lo contest cheyyadaniki veelu ledhu anukonta kadaa? |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 121889 Registered: 03-2004 Posted From: 93.83.138.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 16, 2013 - 7:09 am: |
|
aa bongulo signature le...
|
Dvsk
Kurra Bewarse Username: Dvsk
Post Number: 3836 Registered: 08-2007 Posted From: 94.173.207.252
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 16, 2013 - 7:04 am: |
|
Esperanza:
Farm house owner endi mana party ni kumpu settunnadu TELUGUDESAM PILUSTONDI RAA KADALI RAA
|
420
Mudiripoyina Bewarse Username: 420
Post Number: 14018 Registered: 12-2006 Posted From: 62.12.14.26
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 16, 2013 - 6:51 am: |
|
Vivarimpudeee Knit India,do not split India !
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22895 Registered: 08-2004 Posted From: 130.233.204.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, April 16, 2013 - 4:30 am: |
|
డామిట్ కథ అడ్డం తిరిగింది! అనుకున్న దొకటి!! అయింది ఒకటి!!! మరిప్పుడు ఎలా? ఏం చేయాలి? ఏడాది వరకూ ఎవరూ లెక్కచేయకపోతే పలుకుబడి సంగతేమిటి?.. ఆదివారం రాత్రి కేంద్ర ఎన్నికల ప్రధాన కమినషర్ హెచ్ఎస్ బ్రహ్మ చేసిన ప్రకటన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన ఇది. జగన్‌ను నమ్మి నట్టేట మునిగామన్న ఆవేదన ఇది. ఎన్నికలకు ఏడాది ముందులోగా స్పీకర్ రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు నిర్వహించబోమన్న ప్రకటన వారికి వజ్రా ఘాతంలా పరిణమించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటన జగన్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న ఎమ్మెల్యేల పాలిట విషాదంగా మారింది. ఎన్నో ఊహాలు, మరెన్నో ఆశలు, ఇంకెన్నో అంచనాలతో అసెంబ్లీ అవిశ్వాసంలో ఉత్సాహంగా లేచి నిలబడి, జగన్‌కు జైకొట్టిన కాంగ్రెస్, టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల వరకూ మాజీలు గానే మిగిలిపోవలసిన దుస్థితి దాపురించింది. సీఈసీ చేసిన ప్రకటన వారిలో ఒక్కసారిగా నీరసం ఆవహింపచేసింది. జగన్‌ను నమ్ముకుంటే మళ్లీ ఎమ్మెల్యేలయి పోతామని భావించామని, ఇలా నమ్మితే నట్టేట మునుగు తామనుకోలేదని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద వాపోతున్నారు. చివరకు కుటుం బసభ్యులతో చీవాట్లు కూడా తినవలసి వస్తోం దని కొందరు ఎమ్మెల్యేలు మధనపడుతు న్నారు. తమకు పదవులు లెక్కకాదని, తమపై వేటు వేస్తారని తెలిసినా ప్రభుత్వానికి, పార్టీ విప్‌ను ఉల్లఘించామని నిన్నటి వరకూ ధాటిగా మాట్లాడిన వారంతా ఆదివారం రాత్రి నుంచి కోలుకోలేని షాక్‌లోకి వెళ్లిపోయారు. జగన్ పార్టీకి జై కొట్టి వెళ్లిపోయిన వారిలో ఎక్కువ మంది తొలిసారి ఎన్నికయిన వారే ఉన్నారు. వారిలో సంపాదించుకున్న వారి సంఖ్య కూడా తక్కువే. ఎన్నికయిన నాటి నుంచి హైదరాబాద్‌లో గడపటమే తప్ప పెద్దగా సంపాదించుకున్నదీ ఏమీలేదని, గత ఎన్నికల్లో చేసిన అప్పులే ఇంకా తీరలేదని తమ అను చరుల వద్ద కుమిలిపోతున్నారు. వీటిని పక్కకు పెడితే.. 2014 ఎన్నికల వరకూ ఉప ఎన్నికలు నిర్వహించకుండా, అనర్హత వేటు వేస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న సరికొత్త ఆందోళన వారిలో మొదలయింది. ఏడాది వరకూ ఎన్నికలు నిర్వహించకపోతే తాము మాజీలుగానే మిగిలిపోవలసి వస్తుందని, అప్పటివరకూ నియోజకవర్గాల్లో తమ మాట వినేదెవరన్నదే వారి ఆందోళనకు అసలు కార ణం. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉంటేనే పోలీసు, రెవిన్యూ అధికారులు అంతంతమాత్రంగానే మాట వింటున్నారని, ఇక మాజీలుగా మిగిలితే లెక్కచేసేదెవరని బెంబేలెత్తుతున్నారు. ఈలోగా తమ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలను నియమిస్తే, పనులన్నీ వారి ద్వారానే జరిగిపోతా యని, అప్పుడు తమకు ఎలాంటి ప్రాధాన్యం, విలువ ఉండదని ఆందోళన చెందుతున్నారు. తమ వెంట ఉండే కార్యకర్తలు, ద్వితీయ స్థాయి నేతలకు రోజూ పోలీసు, రెవిన్యూ అధికారుల తోనే ఎక్కువ పనులు ఉంటాయని గుర్తు చేస్తు న్నారు. ఇప్పుడు మాజీలుగా మారితే, సంబం ధిత అధికారులు తమను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా పలుకుబడి ఏముంటుందని తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఉప ఎన్నికలు జరగవని సీఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో.. జగన్ పార్టీలో చేరిన టీడీపీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబాలలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఉప ఎన్నికలు వచ్చేస్తాయని తొందరపడి, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసినందు కు పశ్చాత్తాపం చెందవలసిన పరిస్థితులు వారి కుటుంబాల్లో చోటు చేసు కుంటున్నాయి. ఈ తొందరపాటుపై భార్య, కుమారులు, సోదరు లు, అంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి పెద్దలు మందలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నదీ, ఉంచుకున్నదీ రెండు పోయినట్టయిందని వారు నిష్ఠూరాలాడుతుండటంతో ఎమ్మెల్యేల ఆవేదన పతాక స్థాయికి చేరింది. దీనితో ఉన్న పార్టీలోనే ఎన్నికలముందు వరకూ కొనసాగి, నాలుగు రాళ్లు సంపాదించుకుంటే సరిపోయేదని, అనవసరంగా జగన్ నమ్మి నట్టేట మునిగిపోయామన్న భావన మొదలయింది. ఈ ఆవేశ ంలో వారు జగన్ పార్టీ మేధావులపై తమ సన్నిహితుల వద్ద రుసరుసలాడుతున్నారు. ఒకవేళ స్పీకర్ వెంటనే తమపై వేటు వేయకుండా ఎన్నికలకు ఏడాది సమయం ముందు వరకూ నాన్చి, తర్వాత వేటు వేస్తే తలెత్తే సాంకేతిక పరిణామాలేమిటో ఎవరూ ఊహించలేకపోయారని మండి పడు తున్నారు. 'మన ఆఫీసులో మేధావులమని ఫోజు లు కొట్టే వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లంతా రాజ్యాం గం, చట్టాలు, శాసనసభ వ్యవహారాలంతా తెలిసినట్లు భావి స్తారు. జగన్ కూడా వాళ్లకే పెత్తనం అప్పగిం చాడు. ఇప్పుడు సీఈసీ నిర్ణ యంతో వాళ్లకేమీ తెలియదని తేలిపోయింది. జైల్లో ఉన్న జగన్, ఆఫీసులో ఉన్న మేధా వులంతా కలసి నమ్మించి నట్టేట ముంచార'ని ఓ ఎమ్మెల్యే తన సన్ని హితుల వద్ద వాపోయారు. దీనితో జరగనున్న నష్టం గ్రహించిన ఎమ్మెల్యేలు, కనీసం స్పీకర్‌పై ఒత్తిడి పెంచి గండం నుంచి గట్టెక్కాలన్న తొందరలో ఉన్నారు. ఇప్పటికే తమపై వేటు వేయాలని ఒకసారి, ప్రభుత్వానికి దమ్ము-« దైర్యం ఉంటే తమ ఎమ్మెల్యే లపై వేటు వేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని షర్మిల, విజయమ్మసహా నేతలంతా సవాళ్లు విసురుతున్నారు. తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హుటాహుటిన స్పీకర్‌ను కలసి, తమపై వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్ధించారు. దీన్ని బట్టి జగన్‌కు జైకొట్టిన ఎమ్మెల్యేల మానసిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో, వారి కుటుంబాల ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉన్నాయో స్పష్టమవుతోంది space for lease
|
|