తమిళ దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం దావా కేసులో హీరోయిన్ అంజలి చెన్నై కోర్టుకు మరోసారి డుమ్మా కొట్టింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె బుధవారం (జూన్ 5) విచారణకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైంది. దీంతో విచారణ జూన్ 19కి వాయిదా పడింది. గతంలో పలు పర్యాయాలు గైర్హాజరు కావడంతో ఈ సారి తప్పకుండా రావాలని, లేనిచో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చినా....అంజలి పట్టించుకోక పోవడం గమనార్హం.