Superman
Pilla Bewarse Username: Superman
Post Number: 733 Registered: 10-2005 Posted From: 71.63.229.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 26, 2013 - 2:24 am: |
|
హైదరాబాద్, జూన్ 25 : మే నెల 5న బంజారాహిల్స్‌లో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, కేంద్ర మంత్రి చిరంజీవి కుమారుడు, నటుడు రామ్‌చరణ్‌కు మధ్య వివాదం జరగడం నిజమేనని పోలీసులు నిర్ధారించారు. దాంతో ఆ రోజు అస్సలు తాను కారు దిగనే లేదని, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిలే తమతో అమర్యాదగా మాట్లాడారని, దాంతో గొడవ అయిందని తాను ఎవరినీ కొట్టలేదని రామ్‌చరణ్ చెప్పిన మాటలు అబద్ధమని తేలింది. కారు దిగకపోయినా దిగినట్లు మార్పింగ్ పొటోలు వాడారని, వాటినే మీడియా ప్రచారం చేసిందని ఓ ఫొటో గ్రాఫర్ ఆ ఫొటోలు చూపి నగదు ఆశించాడని కూడా ఆయన విలేకరుల సమావేశం పెట్టి మరీ వాక్రుచ్చారు. దీనిపై ఓ న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అప్పట్లో ఫిర్యాదు చేయడంతో బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు జరిపి మే 5 ఏం జరిగిందో, పూసగుచ్చినట్లు నివేదికలో పొందుపరిచారు. ఏసీపీ శంకర్‌రెడ్డి ఇచ్చిన రిపోర్టు సారాంశం ఇలా ఉంది. |