Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23723 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2013 - 3:30 am: |
|
కడప: పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోటలో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సొంత శాసనసభా నియోజకవర్గం పులివెందుల పరిధిలోని ఏ పంచాయతీలోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు. దశాబ్దం కిందట వేంపల్లె మండలంలో ఓ పంచాయతీ కందుల శివానందరెడ్డి వర్గీయులు గెలుచుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం గెలిచిన సంఘటనలు లేవు. అయితే తాజా పంచాయతీ ఎన్నికల్లో సింహాద్రిపురం మండలం కాంబల్లె పంచాయతీ సర్పంచిగా తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి భూమిరెడ్డి ఉమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఉమాదేవి ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఉమాదేవి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి సతీమణి కావడం, ఆయన స్వగ్రామం కాంబల్లె కావడం గమనార్హం. మరో విశేషమేమిటంటే ఈ పంచాయతీలోని ఎనిమిది వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా మహిళా అభ్యర్థులే పోటీలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో వారంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రాంగోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనుల కారణంగా వార్డు సభ్యులుగా వైసీపీ తరఫున పోటీ చేయడానికి సైతం ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు. Read more at: http://telugu.oneind...ent-119409.html space for lease
|