Fakester
Kurra Bewarse Username: Fakester
Post Number: 1010 Registered: 07-2013 Posted From: 82.19.12.143
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, September 02, 2013 - 3:47 am: |
|
తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ముప్పని తాను 2009 ఎన్నికల సమయంలోనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చెప్పానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ సోమవారం అన్నారు. ఈ రోజు హరికృష్ణ పుట్టిన రోజు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు జాతి ముక్కలు అవుతుంటే తాను పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేనన్నారు. రాష్ట్ర విభజన పాపం తలాపిడికెడు అన్నారు. తన వెనుక ఎవరో ఉన్నారన్నది అవాస్తవమన్నారు. పిఏసి చైర్మన్ పదవి ఇవ్వనందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని అధినేతను బ్లాక్ మెయిల్ చేస్తున్న వారు పార్టీలో ఉన్నారని మండిపడ్డారు. తెరాసతో పొత్తు ముప్పు అని తాను అప్పుడే చెప్పానన్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే హైదరాబాదు పరిసరాల్లో 20, సీమాంధ్రలో 40 సీట్లు ఓడుతామని ముందే చెప్పానన్నారు. తాను ఆనాటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదన్నారు. గడ్డి తిని సభలో ఐదేళ్లు మాట్లాడాల్సిన అవసరం లేదని, జాతి కోసం చిత్తశుద్ధితో ఒక్కసారి నిజాయితీగా మాట్లాడినా చాలన్నారు. తాను పార్లమెంటులో మాట్లాడటంపై వచ్చిన దానిపై పైవిధంగా ఆయన స్పందించారు. తాను త్వరలో ప్రజల వద్దకు వెళ్తానన్నారు. ప్రతిరోజు ఇటలీ ముఖ చిత్రాన్ని చూసుకోవాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విభజన చేస్తున్నారన్నారు. విభజన జరిగితే హైదరాబాదులో సెటిలర్ల ఉద్యమం ఎగిసిపడుతుందన్నారు. జూ ఎన్టీఆర్, తనపై వివరణ పార్టీకి దూరమవుతున్నారని తన పైన, తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ పైన వచ్చిన వాటి పైన హరి స్పందించారు. తాను, తన కొడుకు ఎన్నిసార్లు శీలపరీక్ష చేసుకోవాలని ప్రశ్నించారు. తెలుగు ప్రజల కోసం యాత్ర చేస్తున్న సమయంలో నాడు రామకృష్ణ, బాలకృష్ణల పెళ్లికి స్వర్గీయ నందమూరి తారక రామారావు హాజరు కాలేదని, నేడు తెలుగు జాతి కోసం పార్లమెంటులో పోరాడుతున్నందున తన సోదరుడి కూతురు పెళ్లికి తాను హాజరు కాలేకపోయానన్నారు. తన తండ్రి ఆశయాలకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. హరీష్ రావుపై ఎదురుదాడి సోదరుడి కూతురి పెళ్లి రాలేదన్న తెరాస సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు పైన హరికృష్ణ మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్ బాలయ్య పెళ్లికి రాకపోవడాన్ని ఏమంటారని, తాను తెలుగు జాతి కోసం పోరాడుతున్నందునే పెళ్లికి రాలేదని చెప్పారు. బంధుత్వం కంటే తెలుగు జాతి ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలన్నారు. తనకు రాజకీయాలు నేర్పాల్సిన అవసరం లేదన్నారు. మీరు రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. తమ రాజకీయాలు ఐక్యత కోసమైతే, మీ రాజకీయాలు కుటుంబాలను చీల్చేందుకని మండిపడ్డారు. కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని తాను ఆస్తులు కూడబెట్టలేదన్నారు. అన్న రామయ్య కు చిన్న రామయ్య కు అభిమానిని
|