కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు – మంచు విష్ణు కలిసి విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సంబదించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్లో జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది.
గత కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ – విష్ణు కాంబినేషన్లో ఓ సినిమా రానుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలోకి డా. మోహన్ బాబు, రాయలసీమ బ్యాక్ డ్రాప్ అనగానే సినీ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని కొత్త నిర్మాతలు నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. http://123telugu.com/content/wp-content/uploads/2013/12/mohan-babu-rgv-vishnu1.j pg