కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య ఏలూరులో పర్యటిస్తున్నారు. ఇటివల చింతలపూడిలో జరిగిన కోడిగుడ్ల దాడి అనంతరం ఆయనకు పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను ఎప్పటికి సమైక్యంద్ర వాడినేనని , తను రాష్ట్రం కలిసుండాలనే కోరుకుంటున్నాని అన్నారు. అయితే ఒకవేళ అధిష్టానం రాష్ట్రవిభజన చేయాలనుకుంటే కర్నూల్, అనంతపురం జిల్లాలను తెలంగాణలోనే కలపాలని ఆయన కోరడం జరిగింది. అలాగే హైదరాబాద్ ను పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిని చేయాలని తాను కోరినట్టు తెలియజేశారు. అంతేకాకుండా పార్లమెంట్ లో బిల్లు ఆమోదానికి వస్తే తను తన పదవికి రాజీనామా చేయడమో ? లేక గైహజరు కావటమా అప్పుడే సందర్బాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.Tarak....Mokshu....Kohli