Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through May 20, 2014 * Dorala Rajyam !!! < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21050
Registered: 08-2008
Posted From: 218.186.8.230

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 7:00 pm:    Edit Post Delete Post Print Post

em vayya dalitudini CM chestam ani cheppi chivaraaakhariki
kaneesam deputy CM kooda lekunda ee announcement?


దళిత శాఖ నేనే నిర్వహిస్తా!

వారి బతుకు చూస్తే దు:ఖమొస్తోంది.. వారి రూపాయి ముట్టుకోవద్దు
డబ్బు అవసరమైతే నన్ను అడగండి.. అక్రమ సంపాదనపై మోజు వద్దు
మైనారిటీలకు 12 శాతం కోటా.. ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీలో కేసీఆర్

హైదరాబాద్, మే 17 : "మన ప్రభుత్వంలో దళిత సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. మీరు అనుమతిస్తే ఆ శాఖను నా దగ్గరే పెట్టుకొని నిర్వహించాలని ఉంది'' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖర్‌రావు కొత్తగా ఎంపికమైన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు. ఫండ్స్‌లేక కాదు..దళితులకు మేలు చేయాలనే సంకల్పం లేకపోవటమే వారి వెనుకబాటుకు కారణమని వ్యాఖ్యానించారు. దళితుల జీవితాలను చూస్తే దుఃఖం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా గెలిచిన 10 మంది ఎంపీలు, 62 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, నలుగురు ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో శనివారమిక్కడ ఆయన భేటీ ఆయ్యారు. వివిధ అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.."తెలంగాణలోని దళితులు అభివృద్ధి చెందలేదు. వచ్చే ఐదేళ్లలో మన ప్రభుత్వం వారి అభివృద్ధి కోసం రూ.50వేల కోట్లు ఖర్చు పెడితే, తప్పక మార్పు వస్తుంది. ప్రభుత్వ సహకారం లేకుండా ఎక్కడో ఒక దగ్గర స్వశక్తితో ఎవరో ఒక్కరు అభివృద్ధి చెందవచ్చు. కానీ ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల జీవితాలు చూస్తే దుఃఖం వస్తుంది.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలోని దళితుల అభివృద్ధికి రూ.500 కోట్లు వస్తాయి. ఆ నిధులతో అభివృద్ధి చేపడితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అందులో ఒక్క రూపాయిని కూడా ఆశించవద్దు. పక్కదారి పట్టించొద్దు. కేవలం దళితుల అభివృద్ధి కోసమే కేటాయించాలి. అప్పుడే వారి కళ్లలో వెలుగులు చూడగలం'' అని అన్నారు. రాజకీయ అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. "ఎవరికైనా కష్టకాలం ఎదురై డబ్బు అవసరమైతే నిర్మొహమాటంగా నన్ను అడగండి. నేను ఇస్తా. ఎవరి కాళ్లు పట్టుకొని అయినా డబ్బు తీసుకొస్తా'' అని అన్నారు. ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారని, ప్రభుత్వం పనిచేస్తుందని వారిలో నమ్మకం కలిగించాల్సి ఉన్నదని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం తెచ్చే చట్టం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమిద్దామని పేర్కొన్నారు. పార్టీలోని రిటైర్డ్ ఐఏఎస్‌ల సేవలు ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ నిర్వహణలో వారి సలహాలు తీసుకోవాలని చెప్పారు. "మనల్ని గెలిపించిన ప్రజల్లో చాలా మంది పేదలున్నారు. వారికి కోటి ఆశలు ఉన్నాయి.

మనపై ఎంతో నమ్మకం ఉంచి అధికారాన్ని కట్టబెట్టారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్నింటినీ తు.చ తప్పకుండా చేయాలి. వారి అభిమానాన్ని పొందాలి'' అని సూచించారు. నిరంతరం స్ఫూర్తి పొందే కార్యక్రమాలను రూపొందించుకొని అమలు చేయాలని కోరారు. "ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. నిత్యం ప్రజల్లో ఉండండి. గౌరవం పెంచుకోండి. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించండి. ఇప్పుడు మనది పాలకపక్షం. అందరి కళ్లూ మన మీదనే ఉంటాయి. పొరపాట్లు చేయకున్నా బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. న్యాయమైన, నీతివంతమైన పాలన అందించాలి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నిరాడంబరత అలవర్చుకోవాలి. కడుపు, నోరు కట్టుకొని పనిచేయాలి. అక్రమ సంపాదనపై వ్యామోహం వద్దు. అభివృద్ధి ఆలోచనతోనే ముందు సాగాలి'' అని నిర్దేశించారు. సమావేశం ప్రారంభంలో కేసీఆర్..సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వారికి అభినందనలు తెలియజేశారు.

సురేఖ విషయంలో.. ఎన్ని విమర్శలొచ్చినా ప్రజల తీర్పపకే వదిలేశాం: కేసీఆర్
హైదరాబాద్, మే 17 : "కొండా సురేఖను టీఆర్ఎస్‌లో చేర్చుకోవటంపై టీజేఏసీసహా ఎందరో విమర్శించారు. కానీ మనం ఏమైనా వారికి అధికారం ఇచ్చామా ? ప్రజల తీర్పుకే నిలబెట్టాం. గెలిపిస్తారా ? తిరస్కరిస్తారా ? అనేది ప్రజలకే వదిలేశాం. ప్రజలు గెలిపించటం వల్లనే కొండా సురేఖ ఎమ్మెల్యే అయ్యారు'' అంటూ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా సురేఖను ఉద్దేశించి టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత కేసీఆర్ వ్యాఖ్యానించారు.

నాటి మాటలు నా వ్యక్తిగతం కాదు
'వైసీపీలో కొనసాగినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగతం కాదు. ఓ సభ్యురాలిగా.. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడానే తప్ప, వ్యక్తిగతంగా ఎవరినీ నొప్పించాలని అనుకోలేదు. అప్పటి మాటలను ఎవరూ మనసులో పెట్టుకోవద్దు. కేసీఆర్ పెద్ద మనసుతో పార్టీలో చేర్చుకొని, ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన అడుగుజాడల్లో తెలంగాణ పునర్మిర్మాణంలో ఒక కార్మికురాలిగా పనిచేస్తా' అని కొండా సురేఖ పేర్కొన్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration