Author |
Message |
Lovebewarsetalk
Yavvanam Kaatesina Bewarse Username: Lovebewarsetalk
Post Number: 7916 Registered: 08-2014 Posted From: 157.44.23.39
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, October 10, 2019 - 3:37 pm: |
|
However, I suggest this for a goodread for everyone here...
|
Lovebewarsetalk
Yavvanam Kaatesina Bewarse Username: Lovebewarsetalk
Post Number: 7915 Registered: 08-2014 Posted From: 157.44.23.39
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, October 10, 2019 - 3:34 pm: |
|
Bro don't worry, we're better off with awareness now...Even engineering kids also started to think of AP's future instead of going by their girlfriend wish...
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7839 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, October 10, 2019 - 3:20 pm: |
|
వైసీపీ సోషల్ మీడియా కుట్ర (పార్ట్ 3) - రంగా ఫ్యాక్టర్ - జర్నలిస్టుల టీమ్ ****************************************************** ఒక్క రంగా ఫ్యాక్టర్‌నే కాదు, తరచూ, అసలు నిజంగా జరిగాయో జరగలేదో తెలియని అనేక పాతవిషయాలను ప్రస్తావిస్తూ, కులఘర్షణలని సజీవంగా ఉంచడానికి జర్నలిస్టుల ముసుగులో కొందరు వైసిపికి గత ఐదేళ్ళూ, అంతకు ముందు కూడా పనిచేశారు. వీరిలో రెండురకాలున్నాయి. ఒక రకం జర్నలిస్టులు పూర్తిగా పెయిడ్ ప్యాకేజ్ జర్నలిస్టులు. ఎప్పుడో గతంలో ఏదో పత్రికలో చేసిన అనుభవం తప్ప వాళ్ళు ప్రస్తుతం ఏ పత్రికలో పనిచేస్తున్నారంటే సమాధానం ఉండదు. కొంతమంది సితార, జ్యోతిచిత్ర, శివరంజనివంటి సినిమాపత్రికల్లో పనిచేస్తూ, సినిమా కబుర్లు రాసినవాళ్ళు. ఈ మాజీజర్నలిస్టు అనే బ్రాండ్‌తో డెయిలీ పాతవిషయాలను పరిచయం చేస్తున్నట్లు, అన్యాపదేశంగా తెదేపాని, కమ్మవారిని అవహేళనగా, దుర్మార్గమైన రీతిలో చిత్రీకరిస్తూ రాయడమే వీరి పని. ఇక రెండోరకం జర్నలిస్టులు వ్యక్తిగత కక్ష ఉన్నవాళ్ళు. వీళ్ళు ఇదివరకు ఈనాడులోనో, జ్యోతిలోనో పని చేసినవాళ్ళు. అక్కడ యాజమాన్యంతోనో, పైన ఉండే (కమ్మ) సబ్ ఎడిటర్‌తోనో వృత్తిపరంగా పొసగక బయటికి వచ్చి ఏ ఉదయం పత్రికలోనో, వార్తలోనో లేదా తర్వాత కాలంలో టీవీ ఛానెల్స్‌లోనో చేరినవాళ్ళు. ఆ వృత్తిపరమైన కక్షని తీర్చుకోవడానికి రామోజిని, రాధాకృష్ణని టార్గెట్ చేయడంలో భాగంగా కమ్మకులాన్ని, టీడీపీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తుంటారు. ప్రస్తుతం ఏ సాక్షిలోనో, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో లేదా ఒక సొంతకుంపట్లోనో పనిచేస్తుంటారు. వీళ్ళు నాన్-పెయిడ్ ఆర్టిస్టులు ప్లస్ వీళ్ళు బాహాటంగా వైసిపి ముద్ర వేసుకోరు కనుక వీళ్ళ మాటలకి న్యూట్రల్స్‌లో కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది. కౌంట్ చేస్తే మొత్తమ్మీద ఇలాంటివాళ్ళు ఒక యాభయిమంది లెక్క తేలారు. ఈ రెండురకాల జర్నలిస్టుల్లో అధికశాతం బ్రాహ్మణ సామాజికవర్గం, కొందరు దళిత క్రిస్టియన్లు. ఒకరిద్దరు రెడ్లు, ఇతర కులాలు. వీళ్ళ సగటు వయసు యాభయేళ్ళు. అంటే ఎన్టీయార్ టీడీపీని స్థాపించినప్పుడు, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడూ, రంగా హత్య జరిగినప్పుడూ వీళ్ళ వయసు పదిహేనేళ్ళనుండి పాతికేళ్ళ లోపే. ఆ వయసులో ఉన్న కుర్ర విలేకర్లకి ఏ పత్రికా ముఖ్యమంత్రి కార్యాలయం కవరేజ్‌వంటి పెద్దబాధ్యతలు ఇవ్వదు. కానీ వీళ్ళు ఆ కాలంలో అన్నీ ఎన్టీయార్, చంద్రబాబు, వైయెస్, రంగాల పక్కనే ఉండి చూసినట్లు అలవోకగా కట్టుకథల్ని, విషవార్తల్ని అల్లి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఈ పోస్టులన్నిటిలో అన్యాపదేశంగా ఎన్టీయార్‌కి, తెలుగుదేశానికి కులపిచ్చి అంటగట్టడం, అసలు జరగని సంభాషణలు, వ్యూహాలు జరిగినట్లు, వాటికి వీళ్ళే ప్రత్యక్ష సాక్షులయినట్లు చిత్రీకరించడం అనేది వీళ్ళ అజెండా. జస్ట్ రంగా ఫ్యాక్టరే కాకుండా మిగతా అనేక అంశాల్లో కమ్మవ్యతిరేకతని, టీడీపీ మిద విషాన్ని ఎలా చిమ్మారో ఇంకో పోస్టులో వివరంగా చెబుతా. కమ్మ-కాపు వైరం పెంచడానికి, రంగా హత్య టాపిక్‌లో వీళ్ళ అబద్ధాల చిత్రీకరణ ఎలా ఉంటుందంటే... "అసలు ఎన్టీయార్‌కి సినిమాల్లో ఉన్నప్పుడే కాపులంటే ద్వేషం. కమ్మనిర్మాతల సహాయంతో ఎస్వీ రంగారావుని ఎన్టీయార్ తొక్కేశాడు. ఒకరోజు కొండవీటిసింహం షూటింగ్ జరుగుతోంది. నేను అక్కడే లొకేషన్లో ఉండి కవర్ చేస్తున్నా. ఒక కాపు లైట్‌బోయ్ వచ్చి ఎన్టీయార్‌కి మంచినీళ్ళు అందించాడు. అతను పక్కకి వెళ్ళగానే అతనిది ఏ కులం అని వాకబు చేసిన ఎన్టీయార్, కాపు అని తెలియగానే మంచినీళ్ళు తాగకుండా గ్లాస్ పక్కన పెట్టేశాడు. సిఎం అయ్యాక కూడా ఒకరోజు సెక్రటేరియట్లో ఎన్టీయార్‌తో కలిసి లిఫ్టులో వెళ్తున్నాం అందరం. లిఫ్ట్ దిగి సిఎం పేషీలో అడుగుపెట్టగానే నాకు తెలిసిన టైపిస్ట్ ఎదురయ్యాడు. హలో నాయుడూ ఎలా ఉన్నావు అని పలకరించాను. అది విన్న ఎన్టీయార్ తీక్షణంగా చూసి మరసటిరోజు ఆ టైపిస్ట్‌ని మన్యం ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేయించాడు. తర్వాత అతని తమ్ముడి భార్య వేలు విడిచిన మేనమామని భీమవరం పక్కన పల్లెటూళ్ళో కమ్మవారు దాడిచేసి కొట్టారు. రంగా హత్యకి కూడా గండిపేటలోనే పెద్ద కసరత్తు జరిగింది. ముందురోజు అర్ధరాత్రి వ్యాస్‌ని, దేవినేని నెహ్రూని పిలిపించారు. కోడెల, చంద్రబాబు కూడా ఆ మీటింగులో ఉన్నారు. వ్యాస్ వద్దని వారించాడు. లేదు, ఊరుకుంటే రంగా సిఎం అవుతాడు, టీడీపీకి దెబ్బ అని కోడెల హెచ్చరించాడు........" ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా, తాము స్వయంగా అక్కడే ఉండి చూసినట్లు, విషాన్ని జనరంజకంగా తమ ఫేస్‌బుక్ వాల్స్ మీద వీళ్ళు గత ఐదేళ్ళూ రాస్తూనే ఉన్నారు. అసలు వ్యాస్‌గారు హైదరాబాద్ వచ్చి ఎన్టీయార్ని కలిశారా, ఆ వారం చంద్రబాబు ఎక్కడున్నారు, కోడెల ఎక్కడున్నారు, అందరూ ఒకేచోట కలిశారా, కలిస్తే ఇవి చర్చించారా...ఇవేవీ ఎవడికీ తెలియదు. ఎక్కడా ఆధారాలుండవు. ఆ రోజు వీళ్ళంతా ఏ జిల్లా పర్యటనల్లో ఉన్నారో, విదేశాల్లో ఉన్నారో ఆనాటి పత్రికల్లో చూసి వెరిఫై చేసుకునే ఆసక్తి, ఓపిక ఎవడికీ ఉండదు. అవి చూడాలంటే గూగుల్ చేస్తే దొరకవు. లైబ్రరీకి వెళ్ళి తిరగేయాలి. అదెవరూ చేయరులే అనే నమ్మకమే వీళ్ళ అబద్ధాలకి పునాది. అసలు దేవినేని నెహ్రూకి చంద్రబాబుతో కంటే దగ్గుబాటితో ఎక్కువ సాన్నిహిత్యం అనే నిజాన్ని కన్వీనియెంటుగా భూస్థాపితం చేసి, చంద్రబాబే ఈ హత్యకి పథకం పన్నాడూ అని రాస్తారు. లేదంటే పరమ దగుల్భాజీ పత్రిక "ఎన్‌కౌంటర్" లో అప్పట్లో అలా రాశారు అని కోట్ చేస్తారు. అందులో నిజంగా ఏం రాశారో ఎవడి దగ్గరా కాపీ ఉండాదు. ఇలా జర్నలిస్టు ముసుగులో వీళ్ళు ఒలకబోసిన పచ్చివిషమే నిజంగా చలామణీ అయింది, ఇప్పటికీ అవుతోంది. ఇలా ఈ జర్నలిస్టులు పోస్టులు పెట్టగానే కింద ఫేక్ కాపు ప్రొఫైల్స్, ఒరిజినల్ వైసీపీ ప్రొఫైల్స్ పేరుతో కామెంట్ల వరద మొదలవుద్ది. గురూజీ, ఈ పచ్చజాతి ఇంత దుర్మార్గులా అని ఒక రెడ్డి మొదలెడ్తే, ఈ కమ్మనాకొడుకుల అంతు చూడాల్సిందే అని ఒక ఫేక్ కాపు ప్రొఫైల్ అంటుంది. ఇంకొకడు జోహార్ రంగా, ప్రతీకారం తీర్చుకుంటాం అని మొదలు పెడతాడు. ఆ జర్నలిస్టు పోస్టు కంటెంట్ వెంటనే కాపుల్ని రెచ్చగొట్టడానికి అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళుద్ది. రంగా లేడు, నెహ్రూ లేడు, వ్యాస్ లేడు, ఎన్టీయార్ లేడు...అందరూ స్వర్గస్తులయ్యారు. నిందితుల్లో, సాక్షుల్లో చాలామంది చనిపోయారు, నెహ్రూగారు, వంగవీటి రాధాకృష్ణ ఒకేసారి కాంగ్రెస్‌లో ఉన్నారు, వంగవీటి రత్నకుమారిగారు టీడీపీలో ఉన్నారు, వంగవీటి రాధాకృష్ణ, దేవినేని అవినాష్ ఒకేసారి టీడీపీలో ఉన్నారు....అయినా సరే రంగా హత్య అనే ఒక ఫ్యాక్టర్‌ని సజీవంగా ఉంచి కమ్మ-కాపు వైరాన్ని కొనసాగించి లబ్ధి పొందాలనే ఈ కుట్రకి జర్నలిస్టుల కృషి ఒకవేపు అయితే, ఇంకో వేపు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వెబ్ మీడియా ద్వారా జరిగిన మెథాడికల్ కృషి గురించి నెక్స్ట్ పోస్టులో. https://www.facebook.com/kc.chekuri.50/posts/136808227646563 Warrior
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7838 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, October 10, 2019 - 3:19 pm: |
|
వైసీపీ సోషల్ మీడియా కుట్ర (పార్ట్ 2) - వంగవీటి రంగా పునరుజ్జీవనం ************************************************************** రంగా-నెహ్రూ వర్గాల మధ్య విజయవాడలో జరిగిన ఆధిపత్యపోరు, 30 ఏళ్ళ కిందట జరిగిన రంగా హత్య, దానికి ముందు దేవినేని మురళి హత్య...ఇవి కేవలం 1989 ఎన్నికల్ని మాత్రమే ప్రభావితం చేసిన అంశాలు. కోస్తాని ఊపేసిన రంగా హత్య ఐదేళ్ళు తిరిగేసరికి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 1994 లో, తిరిగి 1999లో మెజారిటీ కాపులు తెదేపాకే మద్దతు పలికారు. కొత్తపల్లి సుబ్బారాయుడు, శనక్కాయల అరుణ, ఉమ్మారెడ్డి వంటి కాపునాయకులు తెదేపా ప్రభుత్వంలో మంత్రులయ్యారు. కీలమైన పాత్ర పోషించారు. రంగాకి స్నేహితుడైన వైయెస్సార్ 2004లో గెలవడానికి కూడా రంగా అంశం ఉపయోగపడలేదు. వైయెస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎంతగా పట్టించుకోలేదంటే దేవినేని నెహ్రూ వైయెస్‌కి అత్యంత సన్నిహుతుడిగా మారేంత. ఒకవేళ నెహ్రూ 2009 లో గెలిచి ఉంటే వైయెస్సార్ ఆయనకి మంత్రిపదవి ఇచ్చేంత. రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణని కాంగ్రెస్‌లోకి తీసుకొద్దామని మల్లాది విష్ణు వైయెస్సార్ని బలవంతపెడితే, ముందు నెహ్రూ అనుమతి తీసుకునిరా అని మల్లాదిని నెహ్రూ దగ్గరికి పంపేంత. అలా దాదాపు పాతికేళ్ళపాటు మరుగునపడిపోయిన రంగా ఫ్యాక్టర్ 2014లో వైసీపీ ఓటమి తర్వాత ప్రశాంత్ కిశోర్, రిలయన్స్ జియో పుణ్యమా అని సోషల్ మీడియాలోకి జొరబడింది. రంగాకి అభిమానులు ఉన్నారు. కానీ రంగా అంశాన్ని బేస్ చేసుకుని తమ ఓటు నిర్ణయించుకునేది ఎంతమంది ? అదీ ముప్పయేళ్ళ తర్వాత 2019 ఎన్నికల్లో ? నిజానికి పరిటాల, రంగా...ఇలా ఒక ప్రాంతంలో వెలిగినవారి ప్రభావం (ఎన్నికల్లో) వారు చనిపోయిన తర్వాత నాలుగయిదు నియోజకవర్గాలను దాటి పోదు. వాళ్ళకి రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉండొచ్చేమోగానీ, అవన్నీ ఓట్లుగా మారవు. మరి రంగా ఫ్యాక్టర్ దేనికి ఉపయోగపడుతుంది వైసీపీకి ? ఉపయోగపడింది. రంగా హత్యోదంతాన్ని నిరంతరం గుర్తు చేస్తూ, అది తెదేపా, కమ్మనాయకులే చేశారని విషప్రచారం చేస్తూ కాపుల్ని ఎల్లకాలం రెచ్చగొట్టేలా చేయడానికి ఉపయోగపడుతుంది. చంద్రబాబు విధానాలవలన, తెదేపా తమవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యతవలన, 2014లో పవన్ కల్యాణ్ మద్దతునివ్వడంవల్ల తెదేపాకి అండగా నిలిచిన కాపులను తెదేపాకి దూరం చేయడానికి ఉపయోగపడింది. వైసీపీ ప్రణాళికాబద్ధంగా అమలుచేసిన ఈ కుట్ర ముందు తెదేపా అమలుజేసిన ఏ కాపుకార్పోరేషన్లూ, ఉపముఖ్యమంత్రి పదవులూ, రిజర్వేషన్లు, విదేశీచదువులూ నిలబడలేకపోయాయి. కుట్రలో మొదటి అంకం సోషల్‌మీడియాలో కొన్ని వేల ఫేక్‌ప్రొఫైల్స్ కాపుల పేరుమీద సృష్టించడం. వాటి ప్రొఫైల్స్‌లో రంగా బొమ్మలుంటాయి. పేరులో నాయుడు అనో, రాయల్ అనో ఉంటుంది. ఆ ప్రొఫైల్స్‌లో కొన్ని చిరంజీవి అభిమానులుగా, కొన్ని వైయెస్సార్ అభిమానులుగా, కొన్ని పవన్ కల్యాణ్ అభిమానులుగా ఉంటాయి. ఈ ప్రొఫైల్స్ ఏవీ మనం రోజూ తిరిగే ఫేస్‌బుక్ ప్రపంచంలో ఆపరేట్ చేయవు. కెసి చేకూరి రాసే పోస్టులమీదనో, ఇంకో వైసీపీ వ్యక్తి రాసే పోస్టుల మీదనో ఈ ఫేక్‌ప్రొఫైల్స్ ప్రతిస్పందించవు. ఆల్రెడీ ప్రశాంత్ కిశోర్ టీమ్ ప్రత్యేకంగా ఇంకొన్ని సినిమా పేజీలు, కాపుయూత్ పేరుమీద పేజీలు, గ్రూపుల్లో ఈ ఫేక్ ప్రొఫైల్స్ చిరంజీవి సినిమా గురించో, రంగా విగ్రహం ఫోటోనో పెట్టి జై చిరంజీవి అనో, జోహార్ రంగా అనో పోస్ట్ చేస్తాయి. ఇప్పుడు పార్ట్-1 లో నేను చెప్పిన చౌదరి తోకలున్న ఫేక్ ప్రొఫైల్స్ రంగంలోకి దిగుతాయి. వారి ప్రొఫైల్ పిక్చర్స్‌గా బాలకృష్ణ, ఎన్టీయార్, చంద్రబాబు బొమ్మలుంటాయి. ఈ జోహార్ రంగా పోస్టులో దూరి " ఈ కాపు నాకొడుకుని అందుకే చంపేశాం మేము, కుక్కచావు చచ్చాడు" అని హేళన చేస్తూ, రెచ్చగొడుతూ కామెంట్ పెడతాడు. దానికి ప్రతిగా వాళ్ళదే ఫేక్ కాపు ప్రొఫైల్ స్పందిస్తుంది. కమ్మనాకొడకల్లారా ఈ సారి మిమ్మల్ని బొందపెడతాం చూడండి అని. "ఏందిరా మీరు పీకేది, మీకు కాపు కార్పోరేషన్ బిక్షం వేశాం, మీ పవన్ కల్యాణ్ మా పెంపుడు కుక్క, మీ పవన్‌కి మా పరిటాల గుండు కొట్టించాడ్రా, మేము కాక మీకు ఇంక దిక్కెవ్వడు, జై బాలయ్య" అని ఫేక్ కమ్మ ప్రొఫైల్స్ ఇంకా రెచ్చగొడతాయి. ప్రతిగా, కాపు ప్రొఫైల్స్ కమ్మకులాన్ని, టీడీపీని ఇంకా దారుణంగా తిడతాయి. ఇప్పుడు ఈ విద్వేషపు కూతలను స్క్రీన్‌షాట్లు తీసి పీకే టీమ్ రెడీ చేస్తుంది. ఈ స్క్రీన్‌షాట్లు ప్రూఫులు రెండు వైసీపీ వింగ్స్‌కి అందుతాయి. ఒకటి కమ్మ, కాపు కాని వైసీపీ రెగ్యులర్ ప్రొఫైల్స్. మీరూ, నేనూ రోజూ చూసే నిజమైన వ్యక్తులు. (They operate by their original names). ఛీ-ఛీ ఈ కులపిచ్చిగాళ్ళు ఎంత బరితెగించారో చూడండి, టీడీపీ పాలనలో రాష్ట్రం ఎటుపోతోంది అని ఈ గురివిందగింజలు మెథాడికల్‌గా డెయిలీ తమ వాల్స్‌మీద ఈ స్క్రీన్‌షాట్లని ప్రదర్శిస్తూ, కమ్మ లేదా కాపు కాని న్యూట్రల్స్‌కి కమ్మవారిమీద, టీడీపీ మీద ఏహ్యభావం కలిగేలా కృషి చేస్తుంటారు. కొంతమంది కమ్మవారికి, టీడీపీ అభిమానులకి ఈ ఫేక్ కాపు ప్రొఫైల్స్ తిట్లు చూసి కాపుల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. డబుల్ ఇంపాక్ట్ అన్నమాట. ఇక రెండో వర్గం వైసీపీలో ఉండే కాపులు. రిలయన్స్ జియో వలన, స్మార్ట్‌ఫోన్ల వాడకం వలన వచ్చిన డేటా విప్లవాన్ని అందిపుచ్చుకున్న పీకే టీమ్, పారలల్‌గా చేసిన పని ఏంటంటే ప్రతి ఊళ్ళో, ఏరియాలో కాపు యూత్, కాపు అసోసియేషన్ పేరుతో "న్యూట్రల్‌గా" కనిపించే వాట్సప్ గ్రూపుల్ని ఏర్పాటు చేయించడం. ఈ గ్రూప్ ఏర్పాటు చేసిన అడ్మిన్ వైసిపీవాడయినా సరే, ఆ ఏరియా కాపులందరినీ పార్టీతో సంబంధం లేకుండా అందులో చేరుస్తాడు. మొదటిరోజుల్లో ఆ గ్రూపులో తమ కులానికి సంబంధించిన అంశాలే పోస్టులుంటాయి. ఉండేకొద్దీ పీకే టీమ్ సప్లై చేసిన ఈ విద్వేషపు స్క్రీన్‌షాట్లు ప్రత్యక్షమవుతాయి. ఇదేంటన్నా, మీ తెదేపావాళ్ళు, తెదేపా కమ్మలు కాపుల్ని ఇలా నీచంగా తిడుతున్నారు, మీరేం చేస్తున్నారు అని అదే గ్రూపులో ఉన్న టీడీపీ కాపులమీద ఎదురుదాడి మొదలవుద్ది. వాళ్ళలో కొందరు డిఫెన్స్‌లో పడిపోతే, ఇంకొందరు టీడీపీ వ్యతిరేకులుగా మారిపోతారు. ఇలా విజయవంతంగా రెండు అంకాల్లో కమ్మ-కాపు, కాపు-టీడీపీల మధ్య అగాధాన్ని సృష్టించి పెంచిన వైసీపీ/పీకే టీమ్ ఈ అగాధాన్ని, వ్యతిరేకతనీ జగన్‌మోహన రెడ్డికి అనుకూలంగా ఓట్ల కింద మార్చే కుట్ర ఇంకోటి పారలల్‌గా అమలు చేసింది. పెయిడ్ (మాజీ) జర్నలిస్టులు, వెబ్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూల రూపంలో ఆ రంగా ఫ్యాక్టర్ కుట్ర ఎలా సాగిందో పార్ట్-3 లో వివరిస్తా. https://www.facebook.com/kc.chekuri.50/posts/135951607732225 Warrior
|
|