Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 69794 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, January 16, 2020 - 9:47 am: |
|
Copied from FB: కనుమ పండగ అంటే గోసంతతిని ఇతర పశుపక్షాదులను పూజించడము లేక వాటి ఉనికి యందు, రక్షణ యందు స్పృహను కలిగి వుండడము. గోసంపద అంటే ఆవు ( గోమాత ) , గోపిత ( ఎద్దు) ఇంకా వాటి బిడ్డలు ( ఆడ , మగ దూడలు రెండునూ ). ఇతర పశుపక్షాదులు అంటే మన ఇంటి దగ్గర వుండే బర్రెలు, దున్నలు, వాటి దూడలు, కుక్కలు, పిల్లులు, కాకులు , పిచ్చుకలు ఇంకా వారి వారి ప్రాంతాలలో వుండే ఇతర పక్షులు , జంతువులు. వీటి పోషణ భాద్యత కూడా మనదే. మన నిత్య జీవితములో మనకు తెలిసినా, తెలియక పోయినా, మనకు సాయం చేస్తున్న మూగ జీవాల ఎన్నో వున్నాయి. వాటి మనుగడకు సంబంధించిన సృహను మనము ఎప్పుడూ కలిగి ఉండాలి అని మన పెద్దలు కనుమ పండుగను మనకు ఆచారముగా ఇచ్చినారు. Sye Raa Audio Review
|