Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1954 Registered: 10-2005 Posted From: 75.72.145.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, January 27, 2020 - 9:28 pm: |
|
https://andhrajyothy.com/artical?SID=1020923 ఒకవైపు ఏఏఐ ప్రయత్నాలు .. మరో వైపు ఎంపీ బాలశౌరి లేఖలు ఎయిర్ ఇండియా నుంచి సానుకూల సంకేతాలు ఢిల్లీ మీదుగా... విశాఖ వయా విజయవాడ, హైదరాబాద్ మీదుగా ఆప్షన్లు రెండింటిలో ఒక రూట్ నుంచి విమాన సర్వీసు నడపటానికి అవకాశం హబ్ అండ్ స్పోక్ విధానంలో.. ఆంధ్రజ్యోతి, విజయవాడ: దుబాయ్‌కు వారంలో రెండు రోజుల పాటు విజయవాడ నుంచి విమాన సర్వీసు నడపటానికి మార్గం సుగమం అవుతోంది. అభివృద్ధి చెందుతున్న విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు నడిపే విషయంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విమాన సర్వీసులను నడిపించడానికి చొరవ తీసుకుంటోంది. విజయవాడ నుంచి వయా ఢిల్లీ మీదుగా కానీ, విశాఖపట్నం నుంచి వయా విజయవాడ, హైదరాబాద్ మీదుగా కానీ ఒక సర్వీసును నడిపించడానికి చర్యలు తీసుకుంటోంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా ఇటీవలే దుబాయ్‌కు విమాన సర్వీసులు నడిపే అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాశారు. ఆ శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ఏఏఐ, అటు ఎంపీ బాలశౌరి ప్రయత్నం ఫలించబోయే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా కూడా సుముఖంగా ఉండటమే కారణం. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అంతర్జాతీయ విమానాలు నడపటానికి వనరులున్నా.. బైలేట్రల్ ట్రాఫిక్ రైట్స్ ఇంకా రాకపోవటంతో హబ్ అండ్ స్కోప్ విధానంలో విదేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు తన వంతు ఏఏఐ కృషి చేస్తోంది. ఈ నెల 27 విజయవాడ నుంచి హబ్ అండ్ స్కోప్ విధానంలో దోహా, షార్జాలకు విమాన సర్వీసులు విజయవంతంగా నడుస్తున్నాయి. సీట్ల ఎవైలబిలిటీ చూస్తే తక్కువగా ఉంటున్నాయి. ఆ రోజుకారోజు టికెట్ బుక్ చేసుకోవడం చూస్తే దుర్లభంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్‌కు కూడా విమాన సర్వీసును నడిపించాలన్న ప్రయత్నం ఫలించే దిశగానే కనిపిస్తోంది. రూట్ పరిశీలన దుబాయ్‌కు విమాన సర్వీసును హబ్ అండ్ స్పోక్ విధానంలో నడిపించటానికి వీలుగా ముందుగా ఢిల్లీ రూట్‌ను ఎయిర్ ఇండియా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి ఢిల్లీకి నడిచే విమాన సర్వీసును నేరుగా దుబాయ్‌కు నడిపే ఆలోచన చేస్తోంది. విజయవాడ నుంచే బ్యాగేజి చెకిన్, బోర్డింగ్ పాసులతో పాటు కస్టమ్స్ , ఇమిగ్రేషన్ కూడా పూర్తి చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విమానం మారకుండా నేరుగా వెళ్లేది కావడంతో కస్టమ్స్, ఇమిగ్రేషన్ కూడా విజయవాడ నుంచి నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీసును కూడా వయా విజయవాడ మీదుగా దుబాయ్‌కు కనెక్ట్ చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ రెండు రూట్లలోనూ హబ్ అండ్ స్పోక్ విధానమే అయినా నేరుగా విమాన సర్వీసులు నడవడానికి దోహదమౌతుంది. ఈ రెండు రూట్లలో ఏదైనా ఒక రూట్‌లో సర్వీసు నడిపే అంశాన్ని ఎయిర్ ఇండియా పరిశీలిస్తోంది. |