Author |
Message |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 72977 Registered: 05-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 04, 2022 - 7:43 am: |
|
Home minister reaction is worst,, asala eellu ministers enti AP kharma kakapote No reviews yet
|
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 3534 Registered: 11-2013
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, May 03, 2022 - 3:58 pm: |
|
maa oore |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 72974 Registered: 05-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, May 02, 2022 - 7:18 pm: |
|
Darunam no words to say. No reviews yet
|
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3408 Registered: 08-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, May 02, 2022 - 4:07 pm: |
|
Pregnant Labourer anta aa Lady. Platform meeda padukoni unte husband ni kotti aame ni darunam ga rape sesaru anta. https://youtu.be/d_9nb0YJQ8k i want to see that entire railway PS employees dismissed from service. Also that district SP need to be suspended. okka camera kuda lekapovadam enti railway station lo mari athi kaakapothe. |
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3407 Registered: 08-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, May 02, 2022 - 4:02 pm: |
|
రేపల్లె అత్యాచారం ఘటనలో, కొద్దిసేపు రాజకీయాలను పక్కన పెడుదాము "ప్రజలు" అనబడే మానవత్వం లేని మనుషుల గురించి మాట్లాడుకొందాము... తన భార్య మీద అత్యాచారం జరుగుతోంది అంటూ ప్లాట్ఫారం మీదే ఉన్న రైల్వే పోలీసు స్టేషన్ తలుపులు బాదితే, పోలీసులు తలుపులు లోపల నుంచి మూసేసుకొని నిద్రపోతున్నారట...ఎంత కొట్టినా తీలేదట...పాపం...నైట్ డ్యూటీలో నిద్ర పోకుండా ఇంకేమీ చేస్తారు చెప్పండి...! స్టేషన్ బయట, స్టేషన్ ప్లాట్ ఫారం కు ఇంకొక వైపు ఉన్న కొంత మంది మహిళలకు చెప్పుకొంటే, ఎవ్వరూ పట్టించుకోలేదట. మనల్ని కాదుగా అనేమో...! ఛీ వెధవ జన్మలు...! అక్కడ వెధవపని చేస్తుండేది, ఇరవయ్యేళ్ళ వెధవలు ఇద్దరు, పదిహేనేళ్ల వెధవ ఒకరు. ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు వెళ్లి నాలుగు తగిలించలేరా....! కనీసం వెళ్లి చూడచ్చుగా....అంత రాతి హృదయాలు ఐపొయ్యాయా మనవి....! మీ లాంటి ఒక అమ్మే కాదా ఆ స్త్రీ కూడా...! ఛీ ఛీ...కనీసం సాటి మహిళ అన్న సహానుభూతి కూడా లేకుండా పోయిందా....! ఇక ఆ తర్వాత పాపం ఆ భర్త, స్టేషన్ బయట వుండే రిక్షా వారికి చెప్పుకున్నాడు....ఎవ్వరూ కదలలేదు....! అక్కడే ఉండే రిక్షా వారికి ఆ స్టేషన్ తెలిసిందే కదా....! ఉండేది ఒకటో రెండో ప్లాట్ఫార్మలు.... అదేదో ముంబాయ్ వీటీ స్టేషన్, లేక అతి పొడవైన ఖరగ్ పూర్ స్టేషన్ కాదుగా....! మళ్లీ అంతే. మనకెందుకులే, సిండ్రోమ్...! పైగా రెండు వందల మీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్ కు దారి చూపించారట, రిక్షా వాళ్ళు. సంతోషం...!! కానీ ఒక్క రిక్షా అతను కూడా చంటి బిడ్డను భుజాన వేసుకున్న ఆ భర్తకి, .."...రా...నా రిక్షాలో కూర్చో అక్కడి దాకా వదిలి పెడతాను" అని చెప్పలేదు. ఒక్క సంతోషం ఏమిటంటే, సహాయం చెయ్యలేదు, ...కానీ వెళ్లి వీడియోలు అయితే తియ్యలేదు. అంతవరకు ధన్యులం. ఆ అమ్మ బ్రతికిపోయింది. ఇక, ప్లాట్ ఫారం మీద ఇంత జరుగుతుంటే, రైల్వే పోలీసులు కాకుండా, టికెట్ కలెక్టర్లు, ట్రాన్స్పోర్ట్ లేబర్, ఇతర వృత్తుల వారందరూ ఏమయ్యారో....! స్టేషన్ల లో ఎంత మంచి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయో...సూపర్...! పోలీస్ స్టేషన్లో మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ మధ్యత జరిగిన ఒకటి రెండు సంఘటనల దృష్ట్యా. ధన్యోస్మి. ప్రజలకు, ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేయడమే తెలుసు, అది ఏ ప్రభుత్వమైనా సరే. ప్రజలు అనబడే జీవులు, తన స్వార్ధం కోసం కాకుండా పక్కనోడి కోసం ఒక క్షణం కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడడం లేదు. "మనకెందుకు, వాళ్ళ చావు వాడిని చావనీ"....అనే సిండ్రోమ్ దేశ వ్యాప్తమైపోయింది. ఒకప్పుడు ఇదే ప్రజలు దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వెధవలని ఎదిరించడానికి వీధుల్లోకి వచ్చారంటే, నిజమేనా అనిపిస్తుంది. నమ్మ బుద్ధి కావటం లేదు ...! మానవత్వం మంటగలపటం లో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు రేపల్లె రైల్వే స్టేషన్లో....! |
|