Author |
Message |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8167 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, November 07, 2015 - 8:15 pm: |
|
btw..Bangaru telangana lo idee paristhiti.. కడియంపై చెప్పు విసిరిన కౌలు రైతుకు రిమాండ్ ఐదు సెక్షన్‌ల కింద కేసు నమోదు 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి సెంట్రల్ జైలుకు తరలింపు బెయిల్ బాధ్యత మాదే: బీజేపీ నేతలు శాయంపేట: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపైకి చెప్పు విసిరిన కౌలు రైతు దామెరకొండ కొమురయ్యను పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. కొమురయ్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అతడిని పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. వరంగల్ జిల్లా, శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై కొమురయ్య చెప్పు విసిరన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత కొమురయ్యను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత అతడిపై ఐపీసీ 447, 341, 352, 353, 504 సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. శనివారం మధ్యాహ్నం పరకాల సివిల్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి జీవన్‌కుమార్ రెండువారాల రిమాండ్ విధించారు. కాగా, కొమురయ్యను విడిపించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డిలతో పాటు పలువురు శనివారం పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రశ్నించిన రైతులపై టీఆర్‌ఎస్ కేసులు పెట్టడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కొంరయ్యను బెయిల్‌పై విడుదలయ్యేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా కొడుకును విడిపించండి బాంచెన్ కొంరయ్యను విడిపించాలంటూ అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శనివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న దామెరకొండ సాంబలక్ష్మి, చంద్రయ్య దంపతులు కనపడిన ప్రతి నాయకుడి కాళ్ల మీదా పడుతూ.. వేడుకున్నారు. కొంరయ్యకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించిన టీడీపీ, బీజేపీ నాయకుల కాళ్ల మీద పడి కొంరయ్య తల్లి రోదించింది. కొంరయ్య 3 క్వింటాళ్ల పత్తిని అమ్మిన తర్వాత మార్కెట్ నుంచి నేరుగా సమావేశానికే వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు. వారి గోడును విన్న నాయకులు కొంరయ్యను విడిపించే బాధ్యత తమదేనని ఓదార్చారు. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8165 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, November 07, 2015 - 8:09 pm: |
|
ప్రచారంలో ఎదురొచ్చి నిలదీస్తున్న ప్రశ్నలు ఈసారి మంత్రి హరీశ్, పల్లా రాజేశ్వర్ వంతు కరెంటేదీ? చెరువులో నీళ్లేవి?.. ఇచ్చిన హామీలూ నెరవేర్చరా?.. మంత్రిని నిలదీసిన రైతు మోర్తాల మహేందర్ అడ్డుకుని బయటకు పంపించిన కార్యకర్తలు, పోలీసులు.. వాళ్లు అడుగుతున్నారు.. చెప్పడం మన బాధ్యత: హరీశ్ మీ పథకాలు అందట్లేదు.. చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఎమ్మెల్సీ పల్లాపై మరో రైతు ఆగ్రహం.. పంపించిన పోలీసులు రఘునాథపల్లి రూరల్, నవంబరు 7: మొన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. నిన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. నేడు మంత్రి హరీశరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్! వరంగల్ ఉప ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. ఇచ్చిన హామీలపై జనం వారిని ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీల ఊసేదీ అంటూ జనం వారిని నిలదీస్తున్నారు. వరంగల్ జిల్లా స్టేషన ఘనపూర్ నియోజకవర్గంలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న హరీశకు ఇదే సీన ఎదురైంది. సభలో మంత్రి హరీశ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. ‘మా చెరువులోకి గోదారి నీళ్లు ఎప్పుడు తెస్తారో చెప్పండి’ అంటూ ఓ గొంతుక నుంచి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వేసింది ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన మోర్తాల మహేందర్ అనే రైతు. హరీశ వద్దకు వచ్చిన అతడు.. ‘‘రైతాంగానికి పగటి పూట కరెంటు ఇస్తామని చెప్పారు. కానీ కరెంట్ రావట్లేదు. రాత్రిపూట మాత్రమే ఇస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంట్‌ను పగటిపూట మాత్రమే ఇవ్వాలి. నెలరోజుల్లో చెరువులన్నింటినీ నింపుతామని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. అయినా మా చెరువులు నేటికీ నీటితో నిండలేదు. ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదు. ఇదేనా పాలన?’’ అని మంత్రి హరీశను మహేందర్ నిలదీశాడు. అయితే అదే సమయంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మారుజోడు రాంబాబు జోక్యం చేసుకుని అడగడానికి ఇదేనా సందర్భం అంటూ మహేందర్‌తో గొడవకు దిగాడు. దీంతో హరీశ కల్పించుకుని ‘‘వాళ్లు అడుగుతున్నారు. అడగడం తప్పు కాదు కదా’’ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై కచ్చితంగా ఉంది అంటూ మహేందర్‌ను శాంతింపజేశారు. అప్పటికే అతడిని పోలీసులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి పక్కకు పంపించారు. ఇక, అంతకుముందు ఎమ్యెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయి కదా? అంటూ ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. వెంటనే రఘునాథపల్లి గ్రామానికి చెందిన సిరిగిరి ఉప్పలయ్య అనే వ్యక్తి స్పందించారు. ‘‘మీ పథకాలు ఎవరికీ అందడం లేదు. చెప్పేది ఒకటి.. చేసేదొకటి’’ అంటూ పెద్దగా గొంతెత్తి అరిచాడు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అక్కడి నుంచి పంపించారు. |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 1022 Registered: 03-2004 Posted From: 107.131.41.254
| Posted on Saturday, November 07, 2015 - 2:34 pm: |
|
Fanno1:
Cha nijama -mari aytithe ee desamlo unna 99% rajakeeyanayakulantha dukaali kalisi, ayanokkedena ??
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 56751 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Friday, November 06, 2015 - 6:48 pm: |
|
Yes miss ayyindi aadini Ippudu psycho gaa prove chese panilo unnaru TRS.. Brucelee Audio Review
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8161 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Friday, November 06, 2015 - 5:30 pm: |
|
Kubang:
kadiyam meeda padaledhu anta le..‘చెప్పుతో నిరసన’ తెలంగాణకూ పాకింది! వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార టీఆర్‌ఎ్‌సకు గట్టి షాక్ తగిలింది! సాక్షాత్తూ ఆ పార్టీ ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరిపైనే కౌలు రైతు ఒకరు చెప్పు విసిరి నిరసన తెలిపా రు. గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని నినదిస్తూ వరంగల్ జిల్లా శాయంపేట శివారు ఆరెపల్లెకు చెందిన బీసీ జేఏసీ నాయకుడు, కౌలు రైతు దామెరకొండ కొమురయ్య చెప్పు విసిరేశాడు. అయితే, అది కడియం వరకూ వెళ్లకుండా స్టేజీ కింద ఉన్న మహిళకు తగిలి కింద పడిపోయింది. శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి కొమురయ్య అక్కడకు వచ్చాడు. వారితో కలిసి సమావేశం వెనకాల నిలబడ్డాడు. మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతున్న సమయంలో, వెనక నిలబడిన కొమురయ్య.. ‘రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల’ని నినదించాడు. పోలీసులు కొమురయ్యను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, మంత్రి పోచారం అడ్డుకోవద్దని వారికి సూచించారు. దాంతో పోలీసులు వెనకడుగు వేశారు. అనంతరం డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో.. వెనక నుంచి ఎడమ వైపుగా కొము రయ్య స్టేజీకి కాస్త సమీపంలోకి వచ్చాడు. ‘గిట్టుబాటు ధరపై టీఆర్‌ఎస్ ప్రభు త్వం స్పష్టత ఇవ్వాల’ని మళ్లీ నినదించాడు. దీంతో, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అవలంబించిన విధానాలను కడియం తెలిపారు. గిట్టుబాటు ధరను కేంద్రమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. పత్తికి కేంద్ర ప్రభుత్వం రూ.5000 గిట్టుబాటు ధరను కల్పించిందని, కానీ రూ.4100 మాత్రమే ఇస్తోందని చెప్పారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దాంతో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైతే మీరేం చేస్తున్నారు. రైతులకు మీరైనా గిట్టుబాటు ధర కల్పించవచ్చు కదా!’’ అని కొమురయ్య ప్రశ్నించాడు. రైతులకు నువ్వు హామీ ఇచ్చావు కనక గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశాడు. దాంతో, ‘ఎవరిస్తారు!?’ అని కడియం గద్దించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొమురయ్య ఒక్కసారిగా చెప్పును చేతిలోకి తీసుకుని కడియంపైకి విసిరాడు. అయితే, కొమురయ్య విసిరిన చెప్పు స్టేజీ కింద ఉన్న మహిళకు తగిలి కింద పడిపోయింది. పోలీసులు వెంటనే కొమురయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. టీఆర్‌ఎస్ సర్కారుపై కొంతమంది పనిగట్టుకుని రాద్దాంతం చేస్తున్నారని కడియం మండిపడ్డారు. ఘటన తర్వాత కొద్దిసేపే ఉండి కడియం అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో వైఎస్ నూ..! కొమురయ్యకు సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది రెండెకరాలు కౌలుకు తీసుకుని దానిలో పత్తి వేశాడు. పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అయితే, కొమురయ్య మొదటి నుంచీ నిలదీసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శాయంపేటకు వచ్చిన దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డిని నిలదీశాడు. అదే క్రమంలో టీఆర్‌ఎస్ బహిరంగ సభకు హాజరైన హరీశ రావును నిలదీసేందుకు ప్రయత్నించాడు. కొమురయ్య గతంలో టీఆర్‌ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ అంటే పిచ్చి అభిమానం వ్యక్తం చేసేవాడు. అయితే, ఆ తర్వాత బీసీ జేఏసీ కో కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నాడు. కొంరయ్య ఓ సైకో: టీఆర్‌ఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన కొమురయ్య ఓ సైకో అని టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పోలేపెల్లి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ప్రతి సమావేశంలోనూ గొడవకు దిగడం కొమురయ్య నైజమని, ఆయన కనీసం రైతు కూడా కాదని పేర్కొన్నాడు. కొమురయ్యపై కేసు నమోదు కడియంపై చెప్పు విసిరిన బీసీ జేఏసీ నాయకుడు కొమురయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. డిప్యూటీ సీఎంను దూషించి, సమావేశంలో గందరగోళం సృష్టించడంతోపాటు దానిని అడ్డుకోబోయిన పోలీసులను నెట్టి వేసి విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ 447, 341, 352, 353, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 29186 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Friday, November 06, 2015 - 5:19 pm: |
|
cheppu visirina visual leda, chuss.. Ignorance is bliss
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8158 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Friday, November 06, 2015 - 4:18 pm: |
|
mounika comments ఇదీ రియలైజేషన్ అంటే ... తెరాస గెలిచినా .. ఓడినా ... కడియంకు జరిగిన ఈ అవమానం చాలు చెప్పుకునేందుకు !!! కడియానికి సిగ్గు శరం ఏమన్నా మిగిలి ఉంటె పాడుబడ్డ బావిలో దూకి చస్త్రాడు ... కానీ తెరాస లో చేరాలి అంటే అవి వదిలేసి రావాలి కాబట్టి ఏమీ పట్టించుకోడు .. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 56748 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, November 06, 2015 - 3:05 pm: |
|
meeda cheppulu visiradanta evado farmer.. https://www.youtube.com/watch?v=PVyQFVuLk3c ide news NTV vadu, psycho cheppulu esadu ani reporting.. https://www.youtube.com/watch?v=gbeuCh0rbtc Brucelee Audio Review
|
|