Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1684 Registered: 10-2005 Posted From: 73.185.138.54
| Posted on Monday, April 04, 2016 - 9:50 pm: |
|
https://youtu.be/n-WwQOKLaEc మరో వారసుడొస్తున్నాడు! ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ త్వరలో రాష్ట్ర మంత్రి కానున్నారు. దీనిపై పార్టీ నేతలతో చంద్రబాబు ఇప్పటికే చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గంలో కొన్ని మార్పులుచేర్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. జూన 8వ తేదీ నాటికి ఆయన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుంది. ఆ తర్వాత జూన్ నెలాఖరు లేదా జులైలో ఆయన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరిని మార్చి కొందరు కొత్త వారిని తీసుకొనే యోచనలో సీఎం ఉన్నారు. అదే సమయంలో లోకేశ్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. తర్జన భర్జనల అనంతరం... లోకేశ్‌ను కేంద్ర మంత్రిగా పంపాలా, రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలా అన్నదానిపై పార్టీలో అంతర్గతంగా కొంత తర్జనభర్జన జరిగింది. తెలంగాణ టీడీపీ నేతలు లోకేశ్‌ను కేంద్ర మంత్రిని చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దీనివల్ల ఆయన కేంద్ర మంత్రి హోదాలో తమకు కూడా అందుబాటులో ఉంటారని, తద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే ఈ ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. కానీ, దీనిపై చంద్రబాబు సుముఖత చూపలేదు. ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు, నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న వ్యూహంలో ఆయన ఉన్నారు. ఇలాంటి సమయంలో తన కుమారుడు స్వయంగా అక్కడ మంత్రిగా ఉంటే కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేలేమని... మొహమాటం అడ్డొస్తుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. లోకేశ్‌ను తన మంత్రివర్గంలోకే తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకొన్నారు. రాహుల్ నేర్పిన పాఠం రాహుల్ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన తప్పిదాన్ని లోకేశ్ విషయంలో జరగకుండా చూడాలని కొందరు పార్టీ సీనియర్లు చంద్రబాబుకు సలహా ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ అధికార పీఠానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రాహుల్ పార్టీ పరమైన బాధ్యతలు చేపట్టారు. అలాకాకుండా ముందు నుంచే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే రాహుల్ రాజకీయ స్థాయి పెరిగి ఉండేదన్నది సీనియర్ల వాదన. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను ఇప్పుడే ప్రభుత్వంలో భాగస్వామి చేయాలని పలువురు టీడీపీ నేతలు సూచించారు. నవ్యాంధ్రలో పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లోకేశ్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు ఎక్కువగా అధికార బాధ్యతల్లో నిమగ్నమైతే లోకేశ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ప్రభుత్వంలో ఏ పదవి లేకపోయినా లోకేశ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్నారని, ఆయన రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కొందరు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు కూడా చాలాకాలం ప్రభుత్వంలో చేరకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై కూడా ‘రాజ్యాంగేతర శక్తి’ ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల అప్పట్లో టీడీపీ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, ఇప్పుడు లోకేశ్‌ను నేరుగా ప్రభుత్వంలోకి తీసుకొంటే అటువంటి విమర్శలకు అవకాశం ఉండదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పొరుగున తెలంగాణలో కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన కుమారుడు కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ‘కుటుంబ పాలన’ పేరిట మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా క్రమంగా వారికి ప్రజల ఆమోద ముద్ర లభించిందని, ఇక్కడ లోకేశ్ విషయంలో కూడా అదే జరుగుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. లోకేశ్ అధికార బాధ్యతల్లోకి వస్తే దివంగత ఎన్టీ రామారావు కుటుంబంలో మూడోతరం ఆ అవకాశం అందుకొన్నట్లు అవుతుంది. ఎన్టీఆర్ తర్వాత అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు కుమారుడు హరికృష్ణ, కుమార్తె పురందేశ్వరి, అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొంతకాలం మంత్రులుగా చేశారు. ఇప్పుడు మూడో తరంలో లోకేశ్‌కు ఆ అవకాశం రాబోతోంది. |