Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27173 Registered: 08-2008 Posted From: 116.88.82.203
| Posted on Saturday, June 04, 2016 - 10:10 am: |
|
malli penta pettedatlu unnaru. last time cars lo nundi aadavallani laagi pollaloki teeskelli rape chesaru. case edu padu ledu. recent ga ochina commission report lo aa incident nijame ani annaru judge ఛండీగఢ్: రిజర్వేషన్ కోటాపై జాట్లు మరోసారి ఆందోళనలకు సిద్ధపడుతుండటంతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల కోసం 4,800 మంది పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దింపారు. అధికార యంత్రాగాన్నిఅప్రమత్తం చేశారు. శనివారం ఆందోళనలకు జాట్లు పిలుపునివ్వడంతో పోలీసు సిబ్బిందితో పాటు, 48 కంపెనీల పారామిలటరీ బలగాలను రాష్ట్రమంతటా మోహరించినట్టు హర్యానా హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రామ్ నివాస్ తెలిపారు. మరో 15 కంపెనీల బలగాలను పంపాలని కూడా కేంద్రాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. ధర్నా జరిపితీరాలని ఒక గ్రూపు మాత్రమే పట్టుదలగా ఉన్నప్పటికీ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తాము చర్చలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. సోనిపట్ జిల్లా వెస్ట్రన్ యమునా కెనాల్ వద్ద పారామిలటరీ దళాలతో పహారాను కట్టుదిట్టం చేశామని తెలిపారు. గత ఫిబ్రవరిలో జాట్ ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటం ద్వారా ఢిల్లీకి నీటి సరఫరాను అడ్డుకోవడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఒకే ప్రదేశంలో శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు అధికార యంత్రాగం అనుమతించినట్టు చెబుతున్నారు. గత ఆందోళనల సమయంలో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లను ఆందోళనకారులు అడ్డుకున్న ఘటనల దృష్ట్యా ఆ తరహా పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు గరిష్ట స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే సిబ్బంది ముందస్తు సెలవులను హర్యానా పోలీసులు రద్దు చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేందుకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. హర్యానాలోని 7 సమస్యాత్మక జిల్లాల్లో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఐదు, అంతకు మించి వ్యక్తులు గుమిగూడితే వారిని అదుపులోకి తీసుకుంటారు. కొద్దిరోజులుగా పారామిలిటరీ దళాలు ఫ్యాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎవరూ ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు, వదంతులు వ్యాప్తి చేయకుండా పోలీసులు దృష్టి సారించారు. ఎలాంటి పరిస్థితినైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు అదనపు డిజిపి మహ్మద్ అఖిల్ తెలిపారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|