Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2640 Registered: 03-2004 Posted From: 171.161.160.10
| Posted on Monday, October 23, 2017 - 9:15 am: |
|
తండ్రి బాటలోనే: ఆ ఇద్దరికీ పాదయాత్రలు కలిసొచ్చాయి, జగన్ ప్లాన్ ఇదే అమరావతి:పాదయాత్రలతో పదవులు దక్కుతాయా, గతంలో పాదయాత్రలు నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా విజయం సాధించారు. అదే బాటలో పయనించనున్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్రను పునరావృతం చేస్తారా, లేదా కొత్త చరిత్రకు నాంది పలుకుతారానే అనే చర్చ సాగుతోంది. 2017 నవంబర్ 2వ, తేది నుండి ఇడుపులపాయ నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభిస్తారు. రంగంలోకి అనిల్: వ్యూహం మార్చిన జగన్, వైసీపీ తాజా ప్లాన్ ఇదే! సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుండి ఇఛ్చాపురం వరకు యాత్ర చేయాలని జగన్ భావిస్తున్నారు.2019 ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని చేపట్టేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వైఎస్ జగన్ తనకు అనుకూలంగా వినియోగించుకొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యమంత్రులు కావాలంటే పాదయాత్రలే మార్గమా? 1.పాదయాత్రలతో ముఖ్యమంత్రులు అవుతారా? పాదయాత్రలతో ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుందా, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులు కావడానికి పాదయాత్రలు ప్రముఖ పాత్రను పోషించాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కేవలం పాదయాత్రలే ముఖ్యమంత్రి పదవిని తెచ్చిపెడతాయన్న గ్యారంటీ ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాదయాత్రలతో ముఖ్యమంత్రులు అవుతారా? పాదయాత్రలతో ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుందా, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులు కావడానికి పాదయాత్రలు ప్రముఖ పాత్రను పోషించాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కేవలం పాదయాత్రలే ముఖ్యమంత్రి పదవిని తెచ్చిపెడతాయన్న గ్యారంటీ ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావడానికి కారణాలివే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆ పార్టీకి కలిసివచ్చింది.వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి పాదయాత్ర కలిసిరావడానికి అనేక కారణాలున్నాయి.. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఒక్క పాదయాత్రే కారణం కాదు.. ఎన్నో అంశాలు కలిసొచ్చాయి..రాజకీయాలలో మూడు దశాబ్దాల పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.. సీఎం పదవి వచ్చినట్టే వచ్చి చేజారినప్పుడు బాధపడలేదు. సమయం కోసం ఎదురుచూశారు. టిడిపి పాలనపై ప్రజల అసంతృప్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేవేళ్ళ నుండి పాదయాత్రను 2003లో పాదయాత్ర చేపట్టి అన్ని రకాలుగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.అయితే వైఎస్ సీఎం కావడానికి అదొక్కటే సరిపోలేదు.. అప్పట్లో కాంగ్రెస్‌పార్టీలో అగ్రనేతలందరూ వైఎస్‌కు అండదండగా నిలిచారు.. అంతేకాదు.. అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయ్యింది.. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత మొదలయ్యింది.. రైతులు, ఉద్యోగుల్లో అసంతృప్తి ఏర్పడింది.. ఇది కూడా వైఎస్‌కు బాగా కలిసివచ్చింది.. ఇవన్నీ ఆయనను సులువుగా ముఖ్యమంత్రిని చేశాయి.. చంద్రబాబుకు కలిసివచ్చిన రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన అంశం చంద్రబాబునాయుడుకు కలిసి వచ్చింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర పూర్తైన తర్వాత రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకొంది. ఈ తరుణంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విభజన జరిగింది. ఏపీ ప్రజలు రాష్ట్ర విభజనను అడ్డుకొన్నారు. ఎన్నికలకు ముందే బిజెపితో టిడిపి పొత్తును కుదుర్చుకొంది. ఈ పరిణామాలు రాజకీయగా టిడిపికి కలిసివచ్చాయి.ఆర్థిక ఇభ్బందులు, రాజధాని లేని రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత అవసరమనే భావించి బాబుకు పట్టం కట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. Jagath sathyam..Brahma Midhya.
|