Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10508 Registered: 03-2004 Posted From: 32.212.213.128
| Posted on Saturday, December 23, 2017 - 8:35 pm: |
|
ఇప్పుడు విదేశాలకు వెళితే నలుగురైదుగురు అధికారులు ఉంటున్నారని, పాత రోజుల్లో తానూ.. తన పేషీలో పనిచేసిన రణదీప్ సుడాన్ మాత్రమే అమెరికాలో రోడ్లు పట్టుకొని తిరిగి కంపెనీలు తెచ్చామని గుర్తు చేశారు. ఆ రోజుల్లో సుడాన్ ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునని, ఏ కంపెనీ వాళ్లు వస్తామన్నా వారి చుట్టూ తిరిగి వారికి ఏం కావాలో అమర్చి వచ్చేవరకూ ఆయన వదిలిపెట్టేవాడు కాదని గుర్తు చేసుకున్నారు. ఫైళ్లు చూసి అవీ ఇవీ లోపాలు వెతికే వారికి కంపెనీలు వెనక్కిపోతే ఎలాంటి బాధ ఉండదని, అవి రావాలని తపన పడే తమకు ఆ నొప్పి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉండి పనిచేస్తేనే ఈ ప్రాంతంపై మమకారం వస్తుందని, మొక్కుబడిగా వచ్చే వారిలో ఆ తపన ఏర్పడటం కొంత కష్టమేనని అన్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి విశాఖలో 40 ఎకరాలు కేటాయిస్తూ ఎస్ఐపీబీలో నిర్ణయం తీసుకొన్నారు. కిందిస్థాయి అధికారులు ఏ ప్రతిపాదన పంపినా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఎస్ఐపీబీదే తుది నిర్ణయం కావడంతో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ కలిసి విశాఖలో ఎనిమిదేళ్లలో రూ.455 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. అధికారుల తీరుపై సీఎం ఆగ్రహంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్ జోక్యం చేసుకొని కొంత చల్లార్చారు. |